మేధావులను సృష్టించేది గ్రంథాలయలే: మంత్రి జగదీష్ రెడ్డి

భోనగిరియాదాద్రి: గ్రంథాలయ ఉద్యమం మొదలైంది భోనగిరి సభల నుండేనని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. అంతటి ప్రాశస్త్యం కలిగిన ఈ నేల మీద రెండు కోట్ల అంచనా వ్యయంతో నూతన గ్రంథాలయ భవనాన్ని నిర్మించుకోవడం అభినందనీయామని ఆయన కొనియాడారు.

భోనగిరియాదాద్రి జిల్లా కేంద్రంలో రెండుకోట్ల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టిన నూతన గ్రంథాలయ భవన నిర్మాణానికి ఆయన శంఖుస్థాపన చేశారు. అనంతరం మంత్రి జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రాపంచిక పరిజ్ఞానం పెంచేది గ్రంథాలయాలేనన్నారు. విద్యార్థి యువతకు విద్యా బోధనతో పాటు పఠనాశక్తిని పెంపొందించెందుకు గ్రంథాలయలు దోహదపడుతాయన్నారు. ఒక్కమాటలో చెప్పాలి అంటే గ్రంథాలయలు మేధావులను సృష్టించే కర్మాగారాలు అని ఆయన అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలోప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి, జడ్ పి చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, స్థానిక శాసన సభ్యుడు ఫైళ్ల శేఖర్ రెడ్డి, రాష్ట్ర గ్రంథాలయసంస్థ అధ్యక్షుడు ఆయాచితం శ్రీధర్, జిల్లా అధ్యక్షుడు అమరెందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

More Press News