K Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ కోర్టులో స్వల్ప ఊరట

  • భౌతికంగా కోర్టు ఎదుట హాజరుపరచాలని కోర్టులో కవిత పిటిషన్
  • ఆమె విజ్ఞప్తికి అంగీకారం తెలిపిన న్యాయస్థానం
  • రేపు కవితను కోర్టులో హాజరుపరిచే అవకాశం
Delhi Court allows BRS leader K Kavitha application for her physical production before court

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ కోర్టులో సోమవారం స్వల్ప ఊరట లభించింది. ఆమెను ప్రత్యక్షంగా కోర్టు ఎదుట హాజరుపరచాలని ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఆదేశించింది. తన జ్యుడీషియల్ రిమాండ్ ముగియనున్న నేపథ్యంలో తనను కోర్టులో ప్రత్యక్షంగా హాజరుపరచాలని కవిత కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం... ఆమె విజ్ఞప్తికి అంగీకరించింది. కవిత జ్యుడీషియల్ కస్టడీ రేపటితో ముగియనుంది.

ఆమె మొదటిసారి కోర్టుకు హాజరైనప్పుడు మీడియాతో మాట్లాడటంపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ తర్వాత రెండుసార్లు ఆమెను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించి, జ్యుడీషియల్ రిమాండ్‌ను పొడిగించింది. ఈ నేపథ్యంలో తనను ప్రత్యక్షంగా కోర్టులో హాజరుపరచేలా ఆదేశాలివ్వాలని ఆమె కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో రేపు ఆమెను కోర్టులో హాజరుపరిచే అవకాశముంది.

  • Loading...

More Telugu News