మాజీ మంత్రి చందూలాల్ మృతి పట్ల హోంమంత్రి మహమ్మద్ మహమూద్ అలీ తీవ్ర సంతాపం

హైదరాబాద్: అనారోగ్యంతో తుదిశ్వాస విడిచిన మాజీ మంత్రి చందూలాల్ మృతి పట్ల రాష్ట్ర హోంమంత్రి మహమ్మద్ మహమూద్ అలీ తీవ్ర సంతాపం ప్రకటించారు. చందూలాల్ గిరిజన హక్కుల సాధనకు, బీద, బడుగు వర్గాల అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేసిన గొప్ప నాయకుడని హోం మంత్రి పేర్కొన్నారు. మంత్రి పదవులతో పాటు వివిధ పదవులు నిర్వహించిన చందూలాల్, ప్రజల సంక్షేమం కోసమే పని చేసేవారని, ఆయన జీవితమే స్ఫూర్తిదాయకమని, తెలంగాణ రాష్ట్రం ఒక మంచి నాయకుడినే కాకుండా, గొప్ప వ్యక్తిని కోల్పోయిందని హోం మంత్రి తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు హోం మంత్రి మహమూద్ అలీ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

More Press News