ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కతో కలిసి బడ్జెట్ పై సమీక్షా సమావేశం

Local
Advertisement
  • అసలైన తెలంగాణ బడ్జెట్ 
  • వాస్తవికతను ప్రతిబింబించాలి 
  • ఉన్నది ఉన్నట్లు ప్రజల ముందుంచుదాం 
  • కేంద్రం నిధులను నూటికి నూరు పాళ్లు వాడుకోవాలి 
  • ప్రజలకు జవాబుదారీగా వచ్చే వార్షిక బడ్జెట్ 
  • ఆర్థిక శాఖ సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, సవాళ్లు మనముందున్న లక్ష్యాలు, ఉన్నది ఉన్నట్లు ప్రజలకు చెప్పేద్దామని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అన్నారు. అసలైన తెలంగాణ ఇప్పుడే వచ్చిందనుకొని బడ్జెట్ తయారుచేయాలని అధికారులకు సూచించారు. దుబారా చేయకుండా, వృధా ఖర్చులు తగ్గించాలని ఆదేశించారు. వచ్చే ఆర్థిక సంవత్సరపు వార్షిక బడ్జెట్ రాష్ట్ర ఆదాయ వ్యయాల వాస్తవికతను ప్రతిబింబించేలా తయారు చేయాలని అన్నారు. బుధవారం సెక్రెటేరియట్ లో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే గ్రాంట్లను నూటికి నూరు పాళ్లు సద్వినియోగం చేసుకోవాలని, లేనిపోని గొప్పలు, ఆర్భాటాలకు పోకుండా వాస్తవిక బడ్జెట్ ను రూపొందించాలని అన్నారు. అసలైన ప్రజల తెలంగాణ ఇప్పుడే వచ్చిందనుకొని.. అధికారులు అందుకు అనుగుణంగా బడ్జెట్ ను తయారు చేయాలని ముఖ్యమంత్రి కోరారు. వాస్తవంగా రాష్ట్ర ఆదాయమెంత.. ఉద్యోగుల జీతభత్యాలు, మనమిచ్చిన హామీలకు, చేయాల్సిన పనులకు ఎంత ఖర్చవుతుంది? అని పక్కాగా అంచనాలను రూపొందించాలని ఆదేశించారు. అప్పులు, చెల్లించాల్సిన బకాయిలు, నెలసరి ఖర్చులన్నింటిపై స్పష్టత ఉండాలని, ఎలాంటి దాపరికం లేకుండా ఆదాయ వ్యయాల ముఖచిత్రం ప్రజలకు అర్థమయ్యేలా ఉండాలని సీఎం సూచించారు. ఎవరో కొందరు వ్యక్తులను సంతృప్తిపరిచే పని లేదని, తెలంగాణ ప్రజలను సంతృప్తి పరచాల్సిన బాధ్యత మన ప్రభుత్వంపై ఉందని అన్నారు.

ప్రజలకు జవాబుదారీగా ఉండాలని, ఎన్నికలప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన గురుతరమైన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉందని అధికారులకు గుర్తు చేశారు. అందుకే ప్రజల కోణంలో బడ్జెట్ ఉండేలా ప్రత్యేక కసరత్తు చేయాలని కోరారు. గతంలో అప్పులు దాచి, ఆదాయ వ్యయాలను భూతద్దంలో చూపించాల్సిన అవసరం లేనే లేదని అన్నారు. ఉన్నది ఉన్నట్లు రాష్ట్ర ఆదాయ స్థితిగతులను జనం ముందు ఉంచాలని సూచించారు. అడ్డగోలు ఖర్చులు, అనవసర వ్యయం, దుబారా లేకుండా చూడాలని కోరారు. తప్పనిసరయితే తప్ప ప్రభుత్వం తరఫున ఇచ్చే ప్రకటనలు తగ్గించాలని, కొత్త వాహనాల కొనుగోలు చేయకుండా, ఇప్పుడు ఉన్న వాహనాలనే వినియోగించుకోవాలని సీఎం ఆదేశించారు. గత ప్రభుత్వం ఎన్నికల్లో గెలువకముందే 22 ల్యాండ్ క్రూయిజర్లను కొనుగోలు చేసిన విషయం ఈ సందర్భంగా చర్చకు వచ్చింది. కేంద్ర ప్రభుత్వం నుంచి వీలైనన్ని గ్రాంట్లను రాబట్టేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. వివిధ శాఖలు, స్కీముల వారీగా కేంద్రం అందించే మ్యాచింగ్ గ్రాంట్ ను నూటికి నూరు పాళ్లు సద్వినియోగం చేసుకోవాలని సీఎం సూచించారు. కొంతమేరకు రాష్ట్రం వాటా చెల్లిస్తే కేంద్రం తన వంతు వాటాగా ఇచ్చే నిధులను ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దని అధికారులను అప్రమత్తం చేశారు. దీంతో కేంద్ర ప్రభుత్వానికి పేరు వస్తుందనో లేదా.. రాష్ట్ర ప్రభుత్వానికి పెద్దగా పేరు వచ్చేది లేదనో బేషజాలకు పోవద్దని అన్నారు. తెలంగాణ అభివృద్ధి, ఇక్కడి ప్రజల సంక్షేమమే అంతిమ లక్ష్యంగా బడ్జెట్ కసరత్తు జరగాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

ఆర్ధిక శాఖ స్పెషల్ సీఎస్ రామకృష్ణారావు, సెక్రటరీ టి.కె.శ్రీదేవి, జాయింట్ సెక్రెటరీ కె.హరిత, డిప్యూటీ సీఎం ఓఎస్డీ కృష్ణభాస్కర్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.
Advertisement

More Press News

Sai Rajesh’s Mynaa Movie Launched

30 Oct, 23:31

‘మైలురాయి’ టైటిల్ ఆసక్తికరంగా ఉంది: నాగబాబు

30 Oct, 23:25

FIEO, Central Bank of India Educate Entrepreneurs on Export Opportunities

30 Oct, 17:28

పూజా హెగ్డే, హరీశ్ శంకర్, అనిల్ రావిపూడి, వి.వి. వినాయక్‌లతో జీ తెలుగు వీకెండ్ సందడి!

30 Oct, 14:34

డియర్ ఆస్ట్రోనాట్’ గొప్ప సినిమాగా నిలుస్తుంది : శేఖర్ కమ్ముల

29 Oct, 20:15

‘డ్యాడ్స్ లిటిల్ ఫ్రెండ్’ టీజర్‌ విడుదల

29 Oct, 20:10

"కిల్లర్"సెకండాఫ్ ట్విస్ట్ చెప్పండి.. కోటి రూపాయాలు తీసుకోండి: పూర్వాజ్

29 Oct, 12:31

"సమ్మర్ హాలిడేస్" ట్రైలర్ చూశాక నా బాల్యం గుర్తుకువచ్చింది: శ్రీ విష్ణు

29 Oct, 12:25

Vijay Antony’s Nanna Kutti Begins Promotions With First Single Nannala Lokamulo

25 Oct, 11:15

‘రాయవలస’ నుంచి మా ఊరు రాయవలస పాట విడుదల

25 Oct, 11:13

'ఓస్కార్ మిస్సింగ్' చిత్ర ప్రారంభం

23 Oct, 23:21

మనోజ్‌ క్లాప్‌తో ‘మిస్టర్ దెయ్యం’ ప్రారంభం

23 Oct, 23:09

డిసెంబర్ 11న 'రాయవలస' విడుదల

22 Oct, 15:29

కిల్లర్‌ ట్రైలర్‌ విడుదల

22 Oct, 15:25

నవంబర్ 6న థియేటర్స్‌లో "సమ్మర్ హాలిడేస్"

22 Oct, 15:19

సింగపూర్‌లో ఎస్‌పీ‌ఎస్ ఒబెరాయ్‌కు తెలుగు వారి ఆత్మీయ పలకరింపు

20 Oct, 07:18
..More Press News