కిల్లర్ ట్రైలర్ విడుదల
జ్యోతి పూర్వజ్, పూర్వాజ్, లీడ్ రోల్స్ లో నటిస్తున్న సెన్సేషనల్ సై ఫై థ్రిల్లర్ మూవీ "కిల్లర్". ఈ చిత్రంలో మనీష్ గిలాడా, చంద్రకాంత్ కొల్లు, అయినాబత్తిన దశరథ మాధవ్, విశాల్ రాజ్, అర్చన అనంత్, గౌతమ్ చక్రధర్ కొప్పిశెట్టి ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను ధ్యానం నాన్నగారు ఆశీస్సులతో థింక్ సినిమా, ఏయూ అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్స్ పై పూర్వాజ్ , పద్మనాభ రెడ్డి.ఎ. నిర్మిస్తున్నారు. ఉర్వీశ్ పూర్వజ్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. పూర్వాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. "కిల్లర్" సినిమా ఈ నెల 30న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ రాబోతోంది. ఓవర్సీస్ లో "కిల్లర్" మూవీని ఓఎంజి పిక్చర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. ఈ రోజు ఈ చిత్ర ట్రైలర్ ను పవర్ డైరెక్టర్ హరీశ్ శంకర్ చేతుల మీదుగా హైదరాబాద్ లో గ్రాండ్ గా రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో
ప్రొడ్యూసర్ పద్మనాభరెడ్డి.ఎ. మాట్లాడుతూ - ఇంతమంది వేదిక మీద మాట్లాడుతున్నారంటే దాని వెనక దర్శకుడి కష్టం ఎంతగా ఉంటుందో నేను చూశాను. ఐదేళ్ల కిందట పూర్వాజ్ మమ్మల్ని కలిసి ఒక పెద్ద స్పాన్ ఉన్న స్టోరీ చెప్పారు. కొత్త దర్శకుడు ఇలాంటి స్క్రిప్ట్ డీల్ చేయగలరా అనుకున్నాం. ఆ తర్వాత కొత్త కొత్త కాన్సెప్ట్ లు మా దగ్గరకు తీసుకొచ్చారు. మేము నమ్మిన ఒక కొత్త దర్శకుడు ఈ రోజు ఎదగడం చూస్తుంటే సంతోషంగా సంతృప్తిగా ఉంది. డీవోపీ జగదీశ్ బొమ్మిశెట్టి కూడా మంచి పేరు తెచ్చుకోవడం హ్యాపీగా ఉంది. మనం ఎదుగుతున్న క్రమంలో అనుకోకుండా కొందరిని మిస్ అవుతూ జర్నీ చేస్తుంటాం. కానీ తనతో ఉన్న అందరినీ కలుపుకుంటూ కెరీర్ కొనసాగిస్తున్నారు పూర్వజ్. అదీ ఆయన ప్రత్యేకత. గతంలో పూర్వాజ్ తో సినిమా చేసినప్పుడు కూడా ఆయన కథలు, కాన్సెప్ట్ ల కంటే దర్శకుడిగా ఆయన ప్రతిభనే ఎక్కువగా నమ్మాను. ఈ సినిమా కూడా పూర్వజ్ క్రియేటివ్ టాలెంట్ ను నమ్మి సినిమా చేశాను. ఫస్ట్ కాపీ రెడీ అయ్యాక సినిమా చూశాను. మూవీ చూశాక చాలా హ్యాపీగా అనిపించింది. ఈ సినిమా మాకు మా టీమ్ కు మంచి సక్సెస్ ఇచ్చి మా కాంబినేషన్ ను ఇలా మందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అన్నారు.
హీరోయిన్ జ్యోతి పూర్వజ్ మాట్లాడుతూ - రెండేళ్ల క్రితం నవరాత్రుల సమయంలోనే ఈ స్క్రిప్ట్ తీసుకుని అమ్మవారి పలు దేవాలయాల్లో పూజలు చేసి స్టార్ట్ చేశాం. ఈ దసరాకు ట్రైలర్ రిలీజ్ చేసుకుంటున్నాం. మా మూవీ ట్రైలర్ మీ అందరికీ నచ్చిందని నమ్ముతున్నాం. నేను చిత్ర పరిశ్రమలో చాలా కాలంగా ఉన్నాను. కిల్లర్ కథ చాలా కొత్తగా ఉంటుంది. ఇంటర్నేషనల్ స్థాయి సై - ఫై ఫిక్షన్ తో , ఆ తరహా స్క్రీన్ ప్లేతో చేసిన చిత్రమిది. ఇలాంటి వినూత్నమైన సినిమా తెరకెక్కించిన పూర్వాజ్ ను చూస్తుంటే గర్వంగా ఉంది. పూర్వాజ్ విజన్ వైవిధ్యంగా ఉంటుంది. ప్రేక్షకులు మా కిల్లర్ సినిమా చూస్తున్నప్పుడు వావ్ అనుకుంటారు. మేము కోట్లు సంపాదించాలని చేసిన సినిమా కాదిది. ప్యాషన్ తో మూవీ చేశాం. సీరియల్స్ లో మిమ్మల్ని ఆకట్టుకున్నాను. సినిమాల్లో తను ఏం చేయబోతోంది అని అనుకుంటారు. అలా అనుకునేవాళ్లకు నా సమాధానం కిల్లర్. ఈ సినిమా చూసి నేను ఇండస్ట్రీలో ఉంటూ మిమ్మల్ని మెప్పించగలనా లేదా అనేది ఫీడ్ బ్యాక్ ఇవ్వండి. ఈ సినిమాలో గ్లామర్ తో కాకుండా టాలెంట్ తో నన్ను మీరు గుర్తిస్తారని నమ్ముతున్నాను.
ప్రొడ్యూసర్, డైరెక్టర్ పూర్వాజ్ మాట్లాడుతూ - మా మూవీ ట్రైలర్ మీకు మంచి ఎక్సిపీరియన్స్ ఇచ్చిందని నమ్ముతున్నాను. మా మూవీ టీజర్ నే ట్రిక్కిగా చేశాం. ఆ టీజర్ లో జ్యోతి టెర్రరిస్ట్, హౌస్ వైఫ్, వ్యాంపైర్, స్పై, సూపర్ షీ వంటి డిఫరెంట్ క్యారెక్టర్స్ లో కనిపించారు. టీజర్ తో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. అప్పుడు వీఎఫ్ఎక్స్ వాళ్లు మాకు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం మార్చి లేదా ఏప్రిల్ లో మా సినిమా రిలీజ్ కావాలి. వీఎఫ్ఎక్స్ వల్ల ఏడాది ఆలస్యమైంది. క్వాలిటీ పరంగా కాంప్రమైజ్ కాకూడదని వెయిట్ చేశాం. టీజర్ లో ఉన్న ట్విస్ట్ లను కొనసాగిస్తూ ట్రైలర్ చేశాం. టీజర్ లో నేను పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తా, ట్రైలర్ లో పోలీస్ ఆఫీసర్ తో పాటు సైంటిస్ట్ గా పరిచయమయ్యా. టీజర్ లాగే మా ట్రైలర్ కూడా చాలా ట్విస్ట్స్ లతో టర్న్స్ తో ఉంటుంది. మీకు అర్థమైనట్లే అనిపించినా డీప్ గా ఒక అందమైన కథ ఉంటుంది. అందులో నుంచి ఒక్క షాట్ కూడా మేము చూపించలేదు. ప్రతి దర్శకుడు తమది కొత్త సినిమా అని, ఎప్పుడూ చూసి ఉండరనే అంటారు. నేనూ అదే చెబుతున్నా. నేను చెప్పడం కాదు ఈ నెల 30న మీరే థియేటర్స్ లో ఎక్సిపీరియన్స్ చేస్తారు.. అన్నారు.
అతిథిగా వచ్చిన డైరెక్టర్ హరీశ్ శంకర్ మాట్లాడుతూ - ఈ ఈవెంట్ కు వచ్చాక పూర్వాజ్ తో మాట్లాడుతూ సినిమా బడ్జెట్ ఎంత అయ్యింది అని అడిగాను. ఆయన బడ్జెట్ ఎంతో చెప్పారు. ఆయన చెప్పిన బడ్జెట్ లో ఇంత మంచి క్వాలిటీ సినిమా చేయడం గొప్ప విషయం. ట్రైలర్ లోనే సినిమా క్వాలిటీ ఎంత బాగుందో తెలిసిపోతోంది. పూర్వాజ్, జ్యోతి ఇద్దరూ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గారికి అభిమానులు. వారి అభిమానమే నన్ను ఈ ఈవెంట్ కు వచ్చేలా చేసింది. పూర్వాజ్ మొదటి సినిమా కూడా ప్రొడ్యూసర్ పద్మనాభ రెడ్డి గారే చేశారు. ఈ సినిమాకు ఆయనకు బెస్ట్ విశెస్ అందిస్తున్నా. న్యూరో లింక్ కు సంబంధించిన నేపథ్యమున్న కథ ఇది. ఈ మధ్య ఎలాన్ మస్క్ న్యూరో లింక్ పై పరిశోధనలు చేయిస్తున్నారు. ఈ న్యూరో లింక్ సూపర్ షీని కలిస్తే ఎలా ఉంటుంది అనేది ఈ సినిమాలో ఆసక్తికరంగా ఉండబోతోంది. కిల్లర్ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. అన్నారు.