అగ్నిప్రమాదాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సమీక్ష నిర్వహించారు.

Local
Advertisement
హైదరాబాద్, ఏప్రిల్ 13 :: అగ్నిమాపక భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు వ్యూహం రూపొందించాలని ప్రభుత్వ
ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. ప్రజలను నిరంతరం సంసిద్దం చేయవలసిన అవసరం ఉందని సి.ఎస్తె లిపారు. నేడు బి.ఆర్.కె.ఆర్ భవన్ లో అగ్ని ప్రమాదాలపై సీ.ఎస్‌ సమావేశం నిర్వహించి అగ్ని ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన పలు భద్రతా చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌కుమార్‌ మాట్లాడుతూ షాపింగ్ కాంప్లెక్స్‌ లు, సినిమా హాళ్లు మొదలైనవాటిని ఎమర్జెన్సీ ఎగ్జిట్ పని చేస్తుందా లేదా అనే దానిపై జిహెచ్‌ఎంసి విస్తృత తనిఖీలు నిర్వహించి, అగ్నిమాపక భద్రతా చర్యలపై అవగాహన కల్పించేందుకు నివాస సంక్షేమ సంఘాలను సంప్రదిస్తున్నామని అన్నారు. నగరంలోని అన్ని పురాతన భవనాలను గుర్తించి, అగ్నిమాపక భద్రతా పరికరాలను ఏర్పాటు చేయాలని నోటీసులు జారీ చేసామని ఆయన అన్నారు. అన్ని షాపింగ్ కాంప్లెక్స్‌ లు, మల్టీప్లెక్స్‌ లు, ఆసుపత్రులు, ఇతర వాణిజ్య సంస్థలను సకాలంలో తనిఖీలు నిర్వహించి, వాటి ప్రాంగణాల్లో అగ్నిమాపక భద్రతా పరికరాలను ఏర్పాటు చేసేలా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని జీహెచ్‌ఎంసీ, అగ్నిమాపక శాఖ అధికారులను సి.ఎస్ ఆదేశించారు. రెసిడెన్షియల్ జోన్లలో పనిచేస్తున్న రెడ్ కేటగిరీ సంస్థలను గుర్తించి, వాటిని తరలించేందుకు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని సి.ఎస్ తెలిపారు. ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి, సీసీపీ దేవేందర్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

    -----------------------------------------------------------------------------------------------------------------------------శ్రీయుత కమీషనర్, సమాచార పౌర సంబంధాల శాఖ, హైదరాబాద్ వారిచే జారీ చేయనైనది.
Advertisement
శాంతికుమారి

More Press News

Sai Rajesh’s Mynaa Movie Launched

30 Oct, 23:31

‘మైలురాయి’ టైటిల్ ఆసక్తికరంగా ఉంది: నాగబాబు

30 Oct, 23:25

FIEO, Central Bank of India Educate Entrepreneurs on Export Opportunities

30 Oct, 17:28

పూజా హెగ్డే, హరీశ్ శంకర్, అనిల్ రావిపూడి, వి.వి. వినాయక్‌లతో జీ తెలుగు వీకెండ్ సందడి!

30 Oct, 14:34

డియర్ ఆస్ట్రోనాట్’ గొప్ప సినిమాగా నిలుస్తుంది : శేఖర్ కమ్ముల

29 Oct, 20:15

‘డ్యాడ్స్ లిటిల్ ఫ్రెండ్’ టీజర్‌ విడుదల

29 Oct, 20:10

"కిల్లర్"సెకండాఫ్ ట్విస్ట్ చెప్పండి.. కోటి రూపాయాలు తీసుకోండి: పూర్వాజ్

29 Oct, 12:31

"సమ్మర్ హాలిడేస్" ట్రైలర్ చూశాక నా బాల్యం గుర్తుకువచ్చింది: శ్రీ విష్ణు

29 Oct, 12:25

Vijay Antony’s Nanna Kutti Begins Promotions With First Single Nannala Lokamulo

25 Oct, 11:15

‘రాయవలస’ నుంచి మా ఊరు రాయవలస పాట విడుదల

25 Oct, 11:13

'ఓస్కార్ మిస్సింగ్' చిత్ర ప్రారంభం

23 Oct, 23:21

మనోజ్‌ క్లాప్‌తో ‘మిస్టర్ దెయ్యం’ ప్రారంభం

23 Oct, 23:09

డిసెంబర్ 11న 'రాయవలస' విడుదల

22 Oct, 15:29

కిల్లర్‌ ట్రైలర్‌ విడుదల

22 Oct, 15:25

నవంబర్ 6న థియేటర్స్‌లో "సమ్మర్ హాలిడేస్"

22 Oct, 15:19

సింగపూర్‌లో ఎస్‌పీ‌ఎస్ ఒబెరాయ్‌కు తెలుగు వారి ఆత్మీయ పలకరింపు

20 Oct, 07:18
..More Press News