రజనీకాంత్ కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు రావడం పట్ల సీఎం కేసీఆర్ హర్షం

హైదరాబాద్: చలనచిత్ర రంగంలో అత్యున్నత పురస్కారం, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును అశేష ప్రజాదరణ పొందిన దక్షిణాది తమిళ నటులు రజనీకాంత్ కు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తంచేశారు.

నటుడిగా దశాబ్దాల పాటు తనకంటూ ఒక ప్రత్యేక శైలిని చాటుకుంటూ, నేటికీ దేశ విదేశాల్లో కోట్లాదిమంది అభిమానుల ఆదరణ పొందుతున్న రజనీకాంత్ కు ఫాల్కే అవార్డు రావడం గొప్ప విషయం అని సీఎం అన్నారు. ఈ సందర్భంగా సినీ నటులు రజనీకాంత్ కు సీఎం శుభాకాంక్షలు తెలిపారు.

More Press Releases