నవంబర్ 27న తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘ఫూలే

Entertainment
Advertisement
సామాజిక సంస్కరణల చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన మహనీయులు జ్యోతిరావ్ ఫూలే, సావిత్రిబాయి ఫూలే జీవిత ప్రయాణం, వారి సామాజిక పోరాటం ఆధారంగా తెరకెక్కింది ‘ఫూలే’ చిత్రం... సమాజంలో నెలకొన్న కులవివక్ష, అసమానతలు, మహిళలపై వివక్షకు వ్యతిరేకంగా పోరాడుతూ విద్య, సమానత్వం, సామాజిక న్యాయం కోసం తమ జీవితాలను అంకితం చేసిన మహనీయులు జ్యోతిరావ్ ఫూలే, సావిత్రిబాయి ఫూలే జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘ఫూలే’ చిత్రం తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం తెలుగు డబ్బింగ్ పూర్తి చేసుకుని నవంబర్ 27న థియేటర్లలో విడుదల కానుంది.
ప్రముఖ దర్శకుడు అనంత్ మహదేవన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సుపదా క్రియేషన్స్ నిర్మిస్తోంది. డా. పొన్నం రవిచంద్ర నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.విద్య, సమానత్వం, సామాజిక న్యాయం, మహిళా విద్య వంటి అంశాల కోసం ఫూలే దంపతులు సాగించిన పోరాటాన్ని, వారి ఆదర్శప్రాయమైన జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించిన ఈ చిత్రం ప్రేక్షకుల్లో ఆలోచనలను రేకెత్తించే కథాంశంతో రూపొందింది.

తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి ప్రత్యేకంగా వీక్షించారు. సినిమా చూసిన అనంతరం ఫూలే దంపతులు కులవివక్ష నిర్మూలన కోసం, మహిళా విద్య కోసం చేసిన పోరాటం నేటి తరానికి గొప్ప స్ఫూర్తిదాయకమని ఉప ముఖ్యమంత్రి కొనియాడారు. ఫూలే దంపతుల సామాజిక సేవ, వారి జీవితాలు నేటి సమాజానికి ఎంతో అవసరమైన సందేశాన్ని అందిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.

‘ఫూలే’ కేవలం ఒక సినిమా మాత్రమే కాదు.. సమాజంలో మార్పు కోసం పోరాడిన ఇద్దరు మహనీయుల జీవితాలను, వారి ఆశయాలను, వారు ఎదుర్కొన్న అడ్డంకులను మన ముందుకు తీసుకొచ్చే ఒక చారిత్రాత్మక కథనం. నేటి యువత, విద్యార్థులు, ప్రతి ఒక్కరూ ఫూలే దంపతుల జీవితం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సమానత్వం, విద్య, మానవత్వం, సామాజిక బాధ్యత వంటి విలువలను గుర్తుచేసే ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ థియేటర్లలో వీక్షించాలని చిత్ర బృందం కోరుతోంది.
ఈ సందర్భంగా సినిమా విడుదలకు సంబంధించిన వార్తను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మీడియా మిత్రులు తమ ప్రచారం, సహకారం అందించాలని చిత్ర బృందం విజ్ఞప్తి చేస్తోంది.

Advertisement
PhulePhule movie

More Press News

ఐ హేట్‌ మ్యారేజ్‌ బోల్డ్‌ సినిమా కాదు.. హార్ట్‌ టచ్చింగ్‌గా ఉంటుంది: దర్శకుడు పరమేష్‌

25 Nov, 23:10

'డ్యాడ్స్‌ లిటిల్‌ ఫ్రెండ్‌' సినిమా అందరి హృదయాలను హత్తుకుంటుంది: నిర్మాత దీపక్‌

25 Nov, 23:05

డాన్సర్స్ కి సువర్ణావకాశం.. జీ తెలుగు డాన్స్ రియాలిటీ షో ‘ఆట’ ఆడిషన్స్‌, ఈ ఆదివారం, మన హైదరాబాద్ లో!

25 Nov, 16:51

27న థియేటర్స్‌లోకి సిద్ధుగాడి ప్రేమకథ

24 Nov, 12:46

మనసుకు తాకే కథతో "రాజిగాడు రాజయ్యాడు"

19 Nov, 21:46

అమెజాన్ ప్రైమ్‌లో ‘హ్యాపీ జర్నీ’ సందడి!

18 Nov, 15:28

ఇంట్రెస్టింగ్‌గా "రాజిగాడు రాజయ్యాడు" ఫస్ట్‌లుక్‌ !

16 Nov, 22:55

సైకలాజికల్‌ థ్రిల్లర్‌ "ది మేజ్" ట్రైలర్ విడుదల

16 Nov, 22:48

‘ఐ హేట్ మ్యారేజ్ ’ ట్రైలర్‌ విడుదల!

16 Nov, 22:41

‘ఛప్రి’ టీజర్‌ ఆవిష్కరణ.. సమ్మర్‌లో సినిమా రిలీజ్‌

15 Nov, 15:09

యుద్దం రాముడితో కాదు.. రాజ్యంతో అంటోన్న కొణిదెల పవన్‌తేజ్‌

15 Nov, 15:02

చంద్రయాన్" సినిమా మీ అందరినీ ఆకట్టుకుంటుంది: శ్రీ విష్ణు

11 Nov, 23:22

మెగాస్టార్‌ చిరంజీవికి 'ఖైదీ'లా సుడిగాలి సుధీర్‌ కెరీర్‌కు 'గోట్‌' కెరీర్‌లో నిలిచిపోతుంది!

11 Nov, 23:15

ఇంకా ఏం అనుకోలేదు!’ చిత్రం అందరికీ కనెక్ట్‌ అవుతుంది!

11 Nov, 23:12

Unveiling First Look of Arjun Sarja as VIRAAVI from Polimera 3

09 Nov, 22:38
..More Press News