అనిల్ రావిపూడి ‘జనవరి 12 విడుదల’లో పాడే అవకాశం దక్కించుకోనున్న ముగ్గురు 'సరిగమప' కంటెస్టెంట్స్

Entertainment
Advertisement
హైదరాబాద్, అక్టోబర్ 31, 2026: తమ అద్భుతమైన గానంతో ప్రేక్షకులను అలరిస్తూ, సినిమా పాటలు పాడే అవకాశాన్ని అందిపుచ్చుకునే దిశగా అడుగులు వేస్తున్నారు జీ తెలుగు సరిగమప కంటెస్టెంట్స్. జీ తెలుగు ప్రతిష్ఠాత్మక రియాలిటీ షో ‘సరిగమప – ది నెక్స్ట్ సింగింగ్ సెన్సేషన్’ ఈ ఆదివారం స్పెషల్ ఎపిసోడ్ తో  ప్రేక్షకులను అలరించనుంది. ఈ ఎపిసోడ్‌లో ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి తన తదుపరి సినిమా ‘జనవరి 12 విడుదల’లో పాడేందుకు ముగ్గురు కంటెస్టెంట్స్‌ను ఎంపిక చేయనున్నారు.

యాంకర్ సుధీర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ సీజన్ టైటిల్ కోసం ప్రతిభావంతులైన కంటెస్టెంట్స్ పోటీపడుతున్నారు. పోటీ రోజురోజుకూ ఉత్కంఠభరితంగా మారుతున్న తరుణంలో, ఈ వారం ఎపిసోడ్‌లో ముగ్గురు సింగర్స్ అద్భుత అవకాశాన్ని సొంతం చేసుకోబోతున్నారు. ప్రముఖ పాటల రచయిత అనంత శ్రీరామ్, ప్రముఖ గాయని ఎస్పీ శైలజ, ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్న ఈ సీజన్ ఫినాలే కంటే ముందే ప్రేక్షకుల్లో ఉత్కంఠ రేపే ట్విస్ట్ లతో కొనసాగుతోంది.

సరిగమప టైటిల్ కోసం పోటీపడుతూనే, సినిమా పాటలు పాడే అవకాశాన్ని అందిపుచ్చుకోవడం కంటెస్టెంట్స్ సంగీత ప్రయాణంలో కీలక మైలురాయిగా నిలవనుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘జనవరి 12 విడుదల’ చిత్రంలో తమ గొంతును వినిపించే అవకాశం ఎవరికి దక్కుతుంది అనే ప్రశ్న ఆసక్తికరంగా మారింది.

అనిల్ రావిపూడిని మెప్పించి ఈ అరుదైన అవకాశాన్ని సొంతం చేసుకోనున్న ఆ ముగ్గురు కంటెస్టెంట్స్ ఎవరు? న్యాయనిర్ణేతల ప్రశంసలు అందుకునే ప్రదర్శనలు ఏవి? సినిమా నేపథ్య గానంలోకి అడుగుపెట్టే దిశగా ముందడుగు వేసే అదృష్టవంతులు ఎవరు? సంగీతం, భావోద్వేగాలు, ఉత్కంఠతో నిండిన ఈ ప్రత్యేక ఎపిసోడ్‌లో ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు లభించనున్నాయి.

‘సరిగమప – ది నెక్స్ట్ సింగింగ్ సెన్సేషన్’ను నవంబర్ 1, ఆదివారం రాత్రి 9 గంటలకు జీ తెలుగులో తప్పక చూడండి!
.

Advertisement
SarigamapaAnil RavipudiJanavari 12 VidudalaZEE Telugu

More Press News

‘ఓ నా సిద్ధయ్య’ పాటను ఆవిష్కరించిన సోనూసూద్

31 Oct, 16:28

Sai Rajesh’s Mynaa Movie Launched

30 Oct, 23:31

‘మైలురాయి’ టైటిల్ ఆసక్తికరంగా ఉంది: నాగబాబు

30 Oct, 23:25

FIEO, Central Bank of India Educate Entrepreneurs on Export Opportunities

30 Oct, 17:28

పూజా హెగ్డే, హరీశ్ శంకర్, అనిల్ రావిపూడి, వి.వి. వినాయక్‌లతో జీ తెలుగు వీకెండ్ సందడి!

30 Oct, 14:34

డియర్ ఆస్ట్రోనాట్’ గొప్ప సినిమాగా నిలుస్తుంది : శేఖర్ కమ్ముల

29 Oct, 20:15

‘డ్యాడ్స్ లిటిల్ ఫ్రెండ్’ టీజర్‌ విడుదల

29 Oct, 20:10

"కిల్లర్"సెకండాఫ్ ట్విస్ట్ చెప్పండి.. కోటి రూపాయాలు తీసుకోండి: పూర్వాజ్

29 Oct, 12:31

"సమ్మర్ హాలిడేస్" ట్రైలర్ చూశాక నా బాల్యం గుర్తుకువచ్చింది: శ్రీ విష్ణు

29 Oct, 12:25

Vijay Antony’s Nanna Kutti Begins Promotions With First Single Nannala Lokamulo

25 Oct, 11:15

‘రాయవలస’ నుంచి మా ఊరు రాయవలస పాట విడుదల

25 Oct, 11:13

'ఓస్కార్ మిస్సింగ్' చిత్ర ప్రారంభం

23 Oct, 23:21

మనోజ్‌ క్లాప్‌తో ‘మిస్టర్ దెయ్యం’ ప్రారంభం

23 Oct, 23:09

డిసెంబర్ 11న 'రాయవలస' విడుదల

22 Oct, 15:29

కిల్లర్‌ ట్రైలర్‌ విడుదల

22 Oct, 15:25
..More Press News