‘డ్యాడ్స్ లిటిల్ ఫ్రెండ్’ టీజర్‌ విడుదల

Entertainment
Advertisement
వెన్నెల సిల్వర్ స్క్రీన్ బ్యానర్ మీద దీపక్ నిర్మాణంలో శరత్ తెరకెక్కించిన చిత్రం ‘డ్యాడ్స్ లిటిల్ ఫ్రెండ్’. ఈ సినిమాలో రజత్ రాఘవ్, కాజల్, హాసిని సుధీర్ హీరో హీరోయిన్లు గా బేబీ పరిణిత రుద్రరాజు ముఖ్య పాత్రలో రూపొందించిన ఈ మూవీకి సంబంధించిన టీజర్‌ను గురువారం నాడు రిలీజ్ చేశారు. ఈ టీజర్ లాంచ్‌కి స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో..

స్టార్ డైరెక్టర్ వి. విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ .. ‘‘పరిణితతో సినిమాని తీసేందుకే దర్శకుడు, నిర్మాత పుట్టారనిపిస్తోంది. పరిణితకు ఈ తెలుగు సినిమా చరిత్రలో ఓ పేజీ ఉండబోతోంది. శరత్ గారు సినిమాని అద్భుతంగా తీసి ఉంటారని ఆశిస్తున్నాను. రజత్‌కి ఈ చిత్రంతో పేరు, డబ్బు అన్నీ వస్తాయని కాంక్షిస్తున్నాను. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

హీరో రజత్ రాఘవ్ మాట్లాడుతూ .. ‘‘విజయేంద్ర వర్మ గారితో స్టేజ్ పంచుకుని 9 ఏళ్లు అవుతోంది. ఆయన నన్ను నమ్మి ‘శ్రీవల్లి’ చిత్రానికి అవకాశం ఇచ్చారు. నాకు ఈ ఐడెంటిటీని ఆయనే ఇచ్చారు. హాసినీ సెట్‌లో ఎంతో సరదాగా ఉంటారు. రోలర్ కోస్టర్ రైడ్‌లా సినిమా ఉంటుంది. కుటుంబ విలువల్ని చాటి చెప్పే చిత్రమిది. ప్రతీ ఫ్యామిలీకి ఈ చిత్రం కనెక్ట్ అవుతుంది’ అని అన్నారు.

దర్శకుడు శరత్ మాట్లాడుతూ .. ‘‘రజత్ నాకు మొదటి అవకాశం ఇచ్చాడు. మా మధ్య ఎనిమిదేళ్ల స్నేహ బంధం ఉంది. నేను చెప్పిన సబ్జెక్ట్ అతనికి నచ్చింది. ఈ ప్రయాణంలో నాకు ఎప్పుడూ అండగానే ఉంటూ వచ్చాడు. నిర్మాత శరత్ గారు ఎప్పుడూ, ఎక్కడా వెనుకంజ వేయలేదు. ప్రతీ ఆర్టిస్ట్ నాకు ఎంతో సపోర్ట్ చేశారు. సెట్ అంతా పిక్‌నిక్‌లా ఉండేది. ప్రతీ ఒక్కరూ అద్భుతంగా నటించారు’ అని అన్నారు.

నిర్మాత డి దీపక్ మాట్లాడుతూ .. ‘ఇది నాకు తొలి చిత్రం. సెట్‌లో ఎప్పుడూ పండుగ వాతావరణం కనిపించేది. మాకు సపోర్ట్ చేసేందుకు వచ్చిన విజయేంద్ర ప్రసాద్ గారికి థాంక్స్. మా సినిమా నవంబర్ 27న రాబోతోంది. అందరూ చూడండి’ అని అన్నారు.

హాసిని సుధీర్ మాట్లాడుతూ .. ‘‘డ్యాడ్స్ లిటిల్ ఫ్రెండ్’ చిత్రంలో అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. నిర్మాత వల్లే అందరికీ ఉపాధి కలుగుతుంది. డైరెక్టర్ గారు ఎంతో వేగంగా సినిమాని పూర్తి చేశారు. శరత్ గారికి ఎంతో డెడికేషన్ ఉంది. పరిణిత, బన్నీ ఇద్దరూ చక్కగా నటించారు. నవంబర్ 27న మా చిత్రం రాబోతోంది. అందరూ తప్పకుండా చూడండి’ అని అన్నారు.

నటుడు రాకేష్ మాట్లాడుతూ .. ‘‘డ్యాడ్స్ లిటిల్ ఫ్రెండ్’కి అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. ఈ మూవీ కోసం అందరం చాలా కష్టపడ్డాం. ఈ సినిమా నవంబర్ 27న రాబోతోంది. అందరూ తప్పకుండా చూడండి’ అని అన్నారు.

బేబీ పరిణిత మాట్లాడుతూ .. ‘‘డ్యాడ్స్ లిటిల్ ఫ్రెండ్’ జర్నీలో అందరూ నాకు సపోర్ట్ చేశారు. సెట్‌లో మేమంతా సరదాగా ఉండేవాళ్లం. ఈ మూవీని మీడియా ముందుకు తీసుకు వెళ్లాలి’ అని అన్నారు.

మాస్టర్ బన్నీ మాట్లాడుతూ .. ‘పిల్లలకు పేరెంట్స్ మాత్రమే ఫస్ట్ ఫ్రెండ్స్. ‘డ్యాడ్స్ లిటిల్ ఫ్రెండ్’ అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. అందరూ తప్పకుండా చూడండి’ అని అన్నారు.

Advertisement
Dads Little friendDads Little friend teaserDads Little friend release date

More Press News

డియర్ ఆస్ట్రోనాట్’ గొప్ప సినిమాగా నిలుస్తుంది : శేఖర్ కమ్ముల

29 Oct, 20:15

"కిల్లర్"సెకండాఫ్ ట్విస్ట్ చెప్పండి.. కోటి రూపాయాలు తీసుకోండి: పూర్వాజ్

29 Oct, 12:31

"సమ్మర్ హాలిడేస్" ట్రైలర్ చూశాక నా బాల్యం గుర్తుకువచ్చింది: శ్రీ విష్ణు

29 Oct, 12:25

Vijay Antony’s Nanna Kutti Begins Promotions With First Single Nannala Lokamulo

25 Oct, 11:15

‘రాయవలస’ నుంచి మా ఊరు రాయవలస పాట విడుదల

25 Oct, 11:13

'ఓస్కార్ మిస్సింగ్' చిత్ర ప్రారంభం

23 Oct, 23:21

మనోజ్‌ క్లాప్‌తో ‘మిస్టర్ దెయ్యం’ ప్రారంభం

23 Oct, 23:09

డిసెంబర్ 11న 'రాయవలస' విడుదల

22 Oct, 15:29

కిల్లర్‌ ట్రైలర్‌ విడుదల

22 Oct, 15:25

నవంబర్ 6న థియేటర్స్‌లో "సమ్మర్ హాలిడేస్"

22 Oct, 15:19

సింగపూర్‌లో ఎస్‌పీ‌ఎస్ ఒబెరాయ్‌కు తెలుగు వారి ఆత్మీయ పలకరింపు

20 Oct, 07:18

‘Ranabaali’ Becomes a Career Milestone for Vijay Deverakonda and Rashmika Mandanna

19 Oct, 12:43

కామ్రేడ్‌ కళ్యాణ్‌తో ప్రతిభను చాటుకున్న దర్శకుడు జానకీరామ్‌ మారెళ్ల

19 Oct, 12:38

YouTube Sensation Ajay (Aye Jude) Begins His Next Film with a Grand Pooja Ceremony

18 Oct, 00:17

‘ఐ హేట్ మ్యారేజ్ ’ టీజర్‌ విడుదల

18 Oct, 00:14
..More Press News