"సమ్మర్ హాలిడేస్" ట్రైలర్ చూశాక నా బాల్యం గుర్తుకువచ్చింది: శ్రీ విష్ణు

Entertainment
Advertisement
కథా బలమున్న చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తూ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా, డిస్ట్రిబ్యూటర్ గా పేరు తెచ్చుకున్నారు ధీరజ్ మొగిలినేని. ఆయన తన ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై "సమ్మర్ హాలిడేస్" అనే చిల్డ్రన్ మూవీని నిర్మిస్తున్నారు. "సమ్మర్ హాలిడేస్" సినిమాను మన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసే ఒక అందమైన కథతో దర్శకుడు శ్రీకర్ రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో మాస్టర్ రోహన్, మాస్టర్ అరుణ్, బేబి ఖుషి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నవంబర్ 6న "సమ్మర్ హాలిడేస్" సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ రోజు కింగ్ ఆఫ్ ఎంటర్ టైన్ మెంట్ హీరో శ్రీవిష్ణు అతిథిగా ఈ చిత్ర ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో



మాస్టర్ అరుణ్ మాట్లాడుతూ - "సమ్మర్ హాలిడేస్" సినిమా చూస్తున్నప్పుడు మీరు కూడా ఆ కథలోని ఒక ఫ్యామిలీ మెంబర్ అనే అనుభూతికి లోనవుతారు. నా క్యారెక్టర్ తో మీరు బాగా కనెక్ట్ అవుతారు. ఈ పాత్రకు న్యాయం చేసేందుకు పూర్తి ప్రయత్నం చేశాను. ఆ క్యారెక్టర్ ఎలా ఉందో మీరు చూసి చెప్పాలి. ఈ మధ్య పిల్లలు అమ్మమ్మ వాళ్లింటికి వెళ్లడం తగ్గిపోయి, వెకేషన్స్, టూర్స్ కు వెళ్తున్నారు. కానీ మా సినిమా చూశాక అమ్మమ్మ వాళ్ల ఊరికి వెళ్లి ఆ వాతావరణంలో ఎంజాయ్ చేయాలని అనిపిస్తుంది. అన్నారు.

మాస్టర్ రోహన్ రాయ్ మాట్లాడుతూ - ప్రీ వెడ్డింగ్ షో కంప్లీట్ అయ్యాక నాకు వచ్చిన అవకాశం ఇది. ఆఫర్ వచ్చినప్పుడు ఈ మూవీలో ఏదో ఒక క్యారెక్టర్ ఇస్తారని అనుకున్నా. కానీ లీడ్ రోల్ చేసే అవకాశం వస్తుందని అనుకోలేదు. మా మూవీ ప్రొడ్యూసర్ ధీరజ్ ఎంతో ప్యాషన్ తో ఈ సినిమాను నిర్మించారు. అనుభవం గల, ఎంతోమంది మంచి నటీనటులతో కలిసి ఈ సినిమాలో నటించడం సంతోషంగా ఉంది. మా మూవీలోని ప్రతి క్యారెక్టర్ మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. అన్నారు.

డైరెక్టర్ శ్రీకర్ మాట్లాడుతూ - మా మూవీ ట్రైలర్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాం. ట్రైలర్ చూసినప్పుడు మీకు కలిగిన అనుభూతే సినిమా చూస్తున్నప్పుడు కూడా కలుగుతుంది. మా ప్రొడ్యూసర్ ధీరజ్ గారి ప్యాషన్ వల్లే మా సినిమా ఇక్కడిదాకా వచ్చింది. ఆయన ఈ స్క్రిప్ట్ విన్నప్పటి నుంచి ఇప్పటిదాకా సపోర్ట్ చేస్తూనే వస్తున్నారు. మా మూవీ నుంచి రిలీజ్ చేసిన 3 పాటలకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. మా చిల్డ్రన్ తో పాటు జయసుధ గారు, వాసుకి, హర్షవర్థన్..ఇలా ప్రతి యాక్టర్ ఎంతో ఇన్వాల్వ్ అయి పర్ ఫార్మ్ చేశారు. ఇడియట్ లో రవితేజలా మా సినిమాలో రోహన్ ఎనర్జిటిక్ గా కనిపిస్తాడు. అరుణ్ సూపర్బ్ గా నటించాడు. థియేటర్స్ కు వచ్చిన ప్రతి ప్రేక్షకుడి గుండెను తాకేలా మా సినిమా ఉంటుంది. మరికొన్నేళ్ల పాటు మా సినిమా గురించి మాట్లాడుకుంటారు. ఎక్కడా బోర్ ఫీల్ కాకుండా ప్రతి సీన్ ఎంజాయ్ చేసే చిత్రమిది. అన్నారు.

ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ - "సమ్మర్ హాలిడేస్" కథ విన్నప్పటి నుంచి ఈ మూవీని క్వాలిటీగా చేయాలని అనుకున్నాం. అమ్మమ్మ పాత్రలో జయసుధ గారు ఒదిగిపోయారు. వాసుకి గారి క్యారెక్టర్ చూస్తుంటే మా మదర్ గుర్తుకువచ్చారు. హర్షవర్థన్, రాజీవ్ కనకాల, హర్షిణి..ఇలా ప్రతి ఆర్టిస్ట్ తమ నటనతో మా సినిమాకు మరింత వ్యాల్యూ తీసుకొచ్చారు. చిన్నపిల్లల సినిమా ఎందుకు చేస్తున్నావని, థియేటర్స్ కు జనం వస్తారా అని మిత్రులు అంటున్నారు. ఇలాంటి సినిమా హిట్ అయితే వందమంది శ్రీకర్ లు ఇండస్ట్రీకి వస్తారు. ఇలాంటి కథలు ఇంకా ఉన్నాయి కానీ ఎవరూ చేసేందుకు ముందుకురావడం లేదు. ఇలాంటి సినిమా ఇతర భాషల్లో వస్తే చూసి ఎంజాయ్ చేస్తున్నాం. మా సినిమా సక్సెస్ అవుతుందనే సూపర్ కాన్ఫిడెన్స్ తో మేమంతా ఉన్నాం.. అన్నారు.

హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ - "సమ్మర్ హాలిడేస్" సినిమా ట్రైలర్ నాకు బాగా నచ్చింది. ఈ ట్రైలర్ చూస్తున్నప్పుడు నేను చిన్నప్పుడు సెలవుల్లో ఊరెళ్లిన మెమొరీస్ గుర్తుకువచ్చాయి. ఈ సినిమాను నేను తప్పకుండా చూస్తాను. ఈ దీపావళి పండక్కి నవంబర్ 6న మీరంతా ఫ్యామిలీతో కలిసి "సమ్మర్ హాలిడేస్" సినిమాను థియేటర్స్ లో చూడాలని కోరుతున్నా. పిల్లలంతా బాగా నటించారు. ఈ యంగ్ టీమ్ ను మీరంతా బ్లెస్ చేయండి. రోహన్ నాతో కలిసి నటించాడు. సినిమా మీద బాగా ఇష్టం ఉన్న యాక్టర్ తను. అలాగే అరుణ్ ను చూస్తుంటే నేషనల్ అవార్డ్ ను చాలా దగ్గరగా చూస్తున్నట్లు ఉంది. ఖుషి బాగా పర్ ఫార్మ్ చేసింది. సమ్మర్ వస్తే అమ్మమ్మ, తాతయ్య ఊరికి వెళ్లడం అనేది మనం మర్చిపోయాం. కానీ ఈ సినిమా చూస్తే ఒకప్పుడు మనం సమ్మర్ ఎలా ఉండేది అని గుర్తుచేసుకుంటారు. వాసుకి గారిని చూస్తుంటే తొలి ప్రేమ సినిమానే గుర్తుకొస్తుంది. నవంబర్ 6న ఈ చిన్న పిల్లల సినిమాను పెద్ద మనసుతో పెద్ద హిట్ చేస్తారని కోరుకుంటున్నా. ఇలాంటి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీస్ చేసే  ధైర్యం ధీరజ్ గారిలో ఉంది. అన్నారు.


Advertisement
Summer HolidaysSree VishnuDheeraj Mogilinenicinema news

More Press News

"కిల్లర్"సెకండాఫ్ ట్విస్ట్ చెప్పండి.. కోటి రూపాయాలు తీసుకోండి: పూర్వాజ్

29 Oct, 12:31

Vijay Antony’s Nanna Kutti Begins Promotions With First Single Nannala Lokamulo

25 Oct, 11:15

‘రాయవలస’ నుంచి మా ఊరు రాయవలస పాట విడుదల

25 Oct, 11:13

'ఓస్కార్ మిస్సింగ్' చిత్ర ప్రారంభం

23 Oct, 23:21

మనోజ్‌ క్లాప్‌తో ‘మిస్టర్ దెయ్యం’ ప్రారంభం

23 Oct, 23:09

డిసెంబర్ 11న 'రాయవలస' విడుదల

22 Oct, 15:29

కిల్లర్‌ ట్రైలర్‌ విడుదల

22 Oct, 15:25

నవంబర్ 6న థియేటర్స్‌లో "సమ్మర్ హాలిడేస్"

22 Oct, 15:19

సింగపూర్‌లో ఎస్‌పీ‌ఎస్ ఒబెరాయ్‌కు తెలుగు వారి ఆత్మీయ పలకరింపు

20 Oct, 07:18

‘Ranabaali’ Becomes a Career Milestone for Vijay Deverakonda and Rashmika Mandanna

19 Oct, 12:43

కామ్రేడ్‌ కళ్యాణ్‌తో ప్రతిభను చాటుకున్న దర్శకుడు జానకీరామ్‌ మారెళ్ల

19 Oct, 12:38

YouTube Sensation Ajay (Aye Jude) Begins His Next Film with a Grand Pooja Ceremony

18 Oct, 00:17

‘ఐ హేట్ మ్యారేజ్ ’ టీజర్‌ విడుదల

18 Oct, 00:14

Charlotte, Michigan Telugu Communities Celebrate Culture and Service

18 Oct, 00:09

నవంబరు 13న 'డానీ' చిత్రం విడుదల

17 Oct, 13:09
..More Press News