‘రాయవలస’ నుంచి మా ఊరు రాయవలస పాట విడుదల

25-10-2026 Sun 11:13 | Entertainment
Advertisement
రేసన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గోపి కృష్ణ జయంతి నిర్మించిన ‘రాయవలస’ చిత్రానికి రాధిక జయంతి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో కార్తీక్ జయంతి, శ్రీష నులు హీరో హీరోయిన్లుగా నటించగా, ప్రముఖ నటులు అనితా చౌదరి, రవివర్మ, జయప్రకాష్, కాశీ విశ్వనాథ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఫస్ట్ సింగిల్‌గా విడుదలైన ‘రింగుడు రింగుడు’ ఆంధ్రా జానపద ఫోక్ సాంగ్ సోషల్ మీడియాలో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ప్రముఖ గాయకులు ధనుంజయ్, సాహితీ చాగంటి ఆలపించిన ఈ పాట ఇప్పటికే 12 లక్షలకు (1.2 Million) పైగా వ్యూస్‌తో దూసుకుపోతోంది.  

తాజాగా మాస్ కా దాస్  విశ్వక్ సేన్ చేతుల మీదుగా ఈ సినిమా సెకండ్ సింగిల్ ‘మా ఊరు రాయవలస’ పాటను విడుదల చేశారు. ఆస్కార్ అవార్డు గెలుచుకున్న ‘నాటు నాటు’ పాటను ఆలపించిన ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఈ పాటను పాడటం మరో విశేషం. 

ఈ పాటను రిలీజ్ చేసిన అనంతరం విశ్వక్ సేన్ మాట్లాడుతూ .. ‘రాయవలస’ కంటెంట్ బాగుంది. సాంగ్ గొప్పగా ఉంది. రాహుల్ అద్భుతంగా పాడాడు. అందరికీ ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.

ఆంధ్రా పల్లెటూరి జానపద పాట న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వరకు చేరుకుంది. డెబ్యూ హీరో, డెబ్యూ డైరెక్టర్ సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం కల్పిస్తూ, అమెరికాలోని ప్రఖ్యాత న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ బిల్‌బోర్డ్‌పై ‘రింగుడు రింగుడు’ పాట విజువల్స్‌ను ప్రదర్శించడం విశేషంగా నిలిచింది. తొలి సినిమాకే ఇలాంటి వినూత్న ప్రమోషన్స్‌తో రాయవలస టీమ్ ఇండస్ట్రీలో ప్రత్యేకంగా నిలిచే ప్రయత్నం చేస్తోంది.

అర్జున్ బాల సంగీతం అందించగా, రాఖీ కథను అందించారు. కిట్టు సినిమాటోగ్రఫీ అందించగా, ప్రముఖ ఎడిటర్ గ్యారీ బీహెచ్ ఈ చిత్రానికి ఎడిటింగ్ చేశారు. పల్లెటూరి నేపథ్యంలో ప్రేమ, స్నేహం, కుటుంబ అనుబంధాలు, భావోద్వేగాల కలయికతో తెరకెక్కిన ‘రాయవలస’ డిసెంబర్ 11న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది
Advertisement
RayavalasaRayavalasa somgRayavalasa release date

More Press News

Vijay Antony’s Nanna Kutti Begins Promotions With First Single Nannala Lokamulo

25-10-2026 Sun 11:15

'ఓస్కార్ మిస్సింగ్' చిత్ర ప్రారంభం

23-10-2026 Fri 23:21

మనోజ్‌ క్లాప్‌తో ‘మిస్టర్ దెయ్యం’ ప్రారంభం

23-10-2026 Fri 23:09

డిసెంబర్ 11న 'రాయవలస' విడుదల

22-10-2026 Thu 15:29

కిల్లర్‌ ట్రైలర్‌ విడుదల

22-10-2026 Thu 15:25

నవంబర్ 6న థియేటర్స్‌లో "సమ్మర్ హాలిడేస్"

22-10-2026 Thu 15:19

సింగపూర్‌లో ఎస్‌పీ‌ఎస్ ఒబెరాయ్‌కు తెలుగు వారి ఆత్మీయ పలకరింపు

20-10-2026 Tue 07:18

‘Ranabaali’ Becomes a Career Milestone for Vijay Deverakonda and Rashmika Mandanna

19-10-2026 Mon 12:43

కామ్రేడ్‌ కళ్యాణ్‌తో ప్రతిభను చాటుకున్న దర్శకుడు జానకీరామ్‌ మారెళ్ల

19-10-2026 Mon 12:38

YouTube Sensation Ajay (Aye Jude) Begins His Next Film with a Grand Pooja Ceremony

18-10-2026 Sun 00:17

‘ఐ హేట్ మ్యారేజ్ ’ టీజర్‌ విడుదల

18-10-2026 Sun 00:14

Charlotte, Michigan Telugu Communities Celebrate Culture and Service

18-10-2026 Sun 00:09

నవంబరు 13న 'డానీ' చిత్రం విడుదల

17-10-2026 Sat 13:09

నందినీ రెడ్డి చేతులు మీదుగా ‘డెస్టినీ’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

17-10-2026 Sat 13:04

Versatile Actor Sunil to Play a Powerful Lawyer in ‘Due Date’

17-10-2026 Sat 12:58
..more