Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install
Advertisement

డిసెంబర్ 11న 'రాయవలస' విడుదల

డిసెంబర్ 11న 'రాయవలస' విడుదల
Advertisement
సన్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద గోపీ కృష్ణ జె నిర్మాతగా, ఎన్నారై డైరెక్టర్ రాధిక జయంతి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రాయవలస’. ఈ చిత్రంలో కార్తీక్ జయంతి, శ్రీషా నులు ప్రధాన పాత్రల్లో నటించారు. అమెరికా నుంచి కార్తీక్ జయంతి టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నారు. ‘రాయవలస’తో కార్తీక్ జయంతి తెలుగు ప్రేక్షకుల ముందుకు హీరోగా రాబోతోన్నారు. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్ అందరినీ ఆకట్టుకున్నాయి. రీసెంట్‌గా విడుదల చేసిన ‘రింగుడు రింగుడు’ సాంగ్ యూట్యూబ్‌లో వన్ మిలియన్‌కి పైగా వ్యూస్ సాధించి చార్ట్ బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.

తాజాగా దసరా పండుగ స్పెషల్ అంటూ ‘రాయవలస’ రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేశారు. ‘రాయవలస’ మూవీని డిసెంబర్ 11న విడుదల చేయబోతోన్నట్టుగా ప్రకటించారు. దసరా సందర్భంగా వదిలిన పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్‌లో ఇంటెన్స్‌తో కూడుకున్న హీరో సీరియస్ లుక్, వెనకాల అమ్మవారు అన్నీ కూడా పాజిటివ్ వైబ్‌ను క్రియేట్ చేస్తున్నాయి.

గ్రామీణ జీవితం, వాస్తవ సంఘటనల స్ఫూర్తితో ‘రాయవలస’ రూపొందింది. నటీనటులు, సాంకేతిక బృందం అంకితభావంతో ఈ చిత్రాన్ని ఒకే షెడ్యూల్‌లో పూర్తి చేశారు. ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్న శ్రీషా నులు, ‘రాణి’ పాత్రలో ప్రేక్షకులను అలరించనున్నారు. తన సహజమైన నటన, హుందాతనంతో రాణి పాత్రకు ప్రత్యేకతను తీసుకొచ్చారు. తొలి చిత్రంతోనే కార్తిక్ జయంతి తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకోబోతోన్నారు.

ఈ చిత్రానికి అర్జున్ బాల మ్యూజిక్ డైరెక్టర్‌గా పని చేశారు. పూర్ణాచారి, కార్తీక్ జయంతి, తరుణ్ సైదుల్ పాటలకు సాహిత్యం అందించారు. రాహుల్ సిప్లిగంజ్, ధనుంజయ్, రోహిత్ పరిటాల, రమ్య బెహరా, సాహితి చాగంటి, సౌజన్య భగవతుల, వాగ్దేవి, అర్జున్, కార్తీక్ జయంతి పాటలు పాడారు. ఈ సినిమాకి వి.ఆర్.కె. నాయుడు (కిట్టు) కెమెరామెన్‌గా, గ్యారీ బీహెచ్ ఎడిటర్‌గా వర్క్ చేశారు. డిసెంబర్ 11న ఈ మూవీని గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు.


Advertisement
Rayavalasa
Rayavalasa release date

Watch Today's Deals on Amazon

More Press News