Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install
Advertisement

రోషన్‌ మేక ‘ఏమో ఏమో ఇది’ అక్టోబర్‌ 30న విడుదల!

రోషన్‌ మేక ‘ఏమో ఏమో ఇది’ అక్టోబర్‌ 30న విడుదల!
Advertisement
యువతను ఆకట్టుకునే ఆహ్లాదకరమైన ప్రేమకథా చిత్రంగా రూపొందుతున్న ‘ఏమో ఏమో ఇది’ విడుదల తేదీ ఖరారైంది. రోషన్ మేక, ప్రీతి ముకుందన్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని 2026 అక్టోబర్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ శీతాకాలంలో ప్రేక్షకులకు ఓ సరికొత్త ప్రేమానుభూతిని అందించేందుకు సినిమా సిద్ధమవుతోంది.

‘HIT’ ఫ్రాంచైజీతో బ్లాక్‌బస్టర్ విజయాలను అందుకున్న రచయిత, దర్శకుడు శైలేష్ కొలను తొలిసారి ఓ ఆహ్లాదకరమైన ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. తనదైన థ్రిల్లర్ కథాంశాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆయన, ‘ఏమో ఏమో ఇది’తో పూర్తిగా భిన్నమైన కథా ప్రపంచాన్ని ఆవిష్కరించబోతున్నారు. రోషన్ మేక, ప్రీతి ముకుందన్‌ల ఫ్రెష్ పెయిర్ ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచుతోంది.

ఇప్పటికే విడుదలైన ‘ది ఫస్ట్ బ్రీజ్ ఆఫ్ ' ఏమో ఏమో ఇది’ వీడియోకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ వీడియో సినిమాపై పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేయడంతో పాటు, చిత్రంలోని ప్రేమకథ ఎలా ఉండబోతోందనే ఆసక్తిని పెంచింది.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ ఎస్., సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తుండగా, వంశీ పచ్చిపులుసు సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

విడుదల తేదీ ఖరారు కావడంతో చిత్ర బృందం తదుపరి ప్రచార కార్యక్రమాలకు సిద్ధమవుతోంది. త్వరలోనే సినిమాలోని పాటలతో పాటు ఇతర ఆసక్తికరమైన అప్‌డేట్స్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.


Advertisement
EMO EMO IDI
Roshan Meka NEW FILM
Roshan Meka
Preity Mukhundhan
CINEMA NEWS

Watch Today's Deals on Amazon

More Press News