Premane Oorilo: విలక్షణమైన ప్రేమకథ 'ప్రేమనే ఊరిలో..'
Add ap7am to your home Screen

విలక్షణమైన ప్రేమకథ 'ప్రేమనే ఊరిలో..'

విలక్షణమైన ప్రేమకథ 'ప్రేమనే ఊరిలో..'
మనోజ్ కుమార్ దర్శకత్వంలో మహారత్న ప్రొడక్షన్స్, ఎస్.కే పిక్చర్స్, వనిల్లా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై చందు శ్రీనివాస్, సురేష్ కొండేటి, మమత దేవేంద్ర ఎం సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'ప్రేమనే ఊరిలో..'  ఈ చిత్రంలో శ్రీ రామ్, రామికా శివు, తపస్విని పూణచ్చ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. "Welcome to the land of love" అనే క్యాప్షన్‌తో, పచ్చని గ్రామీణ నేపథ్యం, విండ్ మిల్స్, ఎడ్ల బండి మరియు ఆహ్లాదకరమైన భావోద్వేగాలతో విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఆదివారం నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ ప్రజలు ఎంతో వైభవంగా జరుపుకునే అమ్మవారి బోనాలు పండుగ రోజు ఫిలింనగర్ శ్రీ రాజరాజేశ్వరి దేవస్థానంలో ఫస్ట్ లుక్ ఆవిష్కరణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. 

తెలుగులో 'కెజిఎఫ్' మరియు 'కాంతార' లాంటి బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్స్ చిత్రాలకు మాటలను అందించిన ఈ సినిమాకు డైలాగ్స్ రాసిన హనుమాన్ చౌదరి డైలాగ్స్ ఈ సినిమాకి హైలైట్స్ గా చెప్పుకోవచ్చు. అలాగే 'అర్జున్ రెడ్డి','మజ్ను','మజిలీ', 'కాంతార', 'హరిహర వీరమల్లు', 'మిరాయ్', 'కూలీ', 'కొత్తలోక' వంటి బ్లాక్ బస్టర్ విచిత్రాలకు పాటల అందించిన రాంబాబు గోశాల ఈ సినిమాలోని అన్ని పాటలను సింగల్ కార్డుగా రాయడం మరో విశేషంగా చెప్పుకోవచ్చు. సునాద్ గౌతమ్ సంగీతం, రాజ్‌కాంత్ ఎస్.కే కెమెరా పనితనం, ఈ చిత్రానికి మరిన్ని ప్లస్ పాయింట్లు. సురేష్ కొండేటి ఈ సినిమాకు నిర్మాతల్లో ఒకరిగా వ్యవహరించడం విశేషం. 

రంగాయణ రఘు, శ్రీరామ్, తపస్విని పూనాచా, రమిక శివు తదితరులు నటించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం (DOP): రాజ్‌కాంత్ ఎస్‌. కె, ఎడిటర్: హర్షిత్ ప్రభు, క్రియేటివ్ ప్రొడ్యూసర్: దేవేంద్ర ఎం, అసోసియేట్ డైరెక్టర్: శృతి మైదల, క్రియేటివ్ సపోర్ట్: హేమ మనోజ్ మైదల, నిర్మాతలు: చందు శ్రీనివాస్, సురేష్ కొండేటి, మమత దేవేంద్ర ఎం, కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: మనోజ్ కుమార్.
Premane Oorilo
Sri Ram
tollywood

Watch Today's Deals on Amazon

More Press News