మోతీనగర్ లో అట్టహాసంగా న్యూటన్ హైస్కూల్ వార్షికోత్సవం.. అలరించిన చిన్నారుల ప్రదర్శనలు!

మోతీనగర్‌లోని రాయల్ ఫంక్షన్ హాల్‌లో ఇవాళ‌ ఉదయం న్యూటన్ హైస్కూల్ వార్షికోత్సవ వేడుకలు మిన్నంటాయి. కరస్పాండెంట్ పి.జనార్ధన్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. న్యూటన్ స్కూల్ మోతీనగర్ బ్రాంచ్ హెడ్స్ రవి, రాజు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ పి.జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీయడంలో వార్షికోత్సవాలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ప్రిన్సిపాల్ సుభాషిణి వార్షిక నివేదికను సమర్పించి, పాఠశాల సాధించిన విజయాలను వివరించారు. 

అనంతరం చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను మంత్రముగ్ధులను చేశాయి. దేశభక్తి గీతాలు, జానపద నృత్యాలతో విద్యార్థులు స్టేజీపై సందడి చేశారు. టీచర్ల పర్యవేక్షణలో జరిగిన ఈ వేడుకల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. భారీ సంఖ్యలో హాజరైన తల్లిదండ్రులు తమ పిల్లల ప్రదర్శనలను చూసి మురిసిపోయారు. ఉపాధ్యాయ బృందం, పాఠశాల సిబ్బంది సమన్వయంతో ఈ కార్యక్రమం ఘనంగా ముగిసింది.


More Press Releases