'సిట్'(స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) చిత్ర ట్రైలర్ విడుదల చేసి అభినందించిన మాస్ కా దాస్ విశ్వక్ సేన్..

Entertainment
Advertisement
హీరోగా పలు సినిమాలతో పలకరించిన అరవింద్ కృష్ణ మరియు రజత్ రాఘవ ఇప్పుడు సస్పెన్స్ థ్రిల్లర్ 'SIT'(సిట్ - స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్)అనే చిత్రంతో రాబోతున్నారు. SNR ఎంటర్టైన్మెంట్స్, వైజాగ్ ఫిలిం ఫ్యాక్టరీ, వాసిరెడ్డి సినిమాస్ బ్యానర్స్ పై సంయుక్తంగా ఈ సిట్ సినిమాని నాగిరెడ్డి, తేజ్ పల్లి, గుంటక శ్రీనివాస్ రెడ్డి నిర్మాణంలో తెరకెక్కిస్తున్నారు. VBR (విజయ్ భాస్కర్ రెడ్డి) దర్శకత్వంలో ఈ సిట్ సినిమా తెరకెక్కుతుంది. 

సిట్ చిత్రంలో అరవింద్ కృష్ణ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా కనిపిస్తుండగా రజత్ రాఘవ్ కీలక పాత్రని పోషిస్తున్నారు. నటాషా దోషి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా రుచిత సాధినేని, అనుక్ రాథోడ్, కౌశిక్ మేకల.. పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సిట్ చిత్ర ట్రైలర్ ని యువ హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ విడుదల చేశారు. విశ్వక్ సేన్ ట్రైలర్ చూసి చాలా ఆసక్తికరంగా ఉందని మూవీ యూనిట్ ని అభినందించారు.         

ఇక ఈ సిట్ చిత్ర ట్రైలర్ ను చూస్తుంటే..మొదట ఓ అమ్మాయి మర్డర్ కేసు నుంచి ఓపెన్ అయ్యి ఆ తర్వాత సస్పెన్స్ థ్రిల్లర్ గా సాగింది. ఒక అమ్మాయిని రేప్ చేసి మర్డర్ చేస్తే ఆ కేసు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ దగ్గరికి వస్తే అరవింద్ కృష్ణ ఎలా డీల్ చేశాడు అని సస్పెన్స్, థ్రిల్లర్ ఎలిమెంట్స్  కథాంశంతో ఈ సినిమా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ట్రైలర్ చివర్లో 'We Take The Words Duty, Honour and Compassion' అని తమ జాబ్ గురించి నిజాయితీ నిబద్దత కలిగిన పోలీసాఫీసర్ గా అరవింద్ కృష్ణ చెప్పడం హైలెట్ గా నిలిచింది.         

ఇక ఈ సిట్ చిత్రానికి బాలిరెడ్డి, రమేష్ గుండా, వాసిరెడ్డి నరేంద్ర సహా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. వరికుప్పల యాదగిరి మ్యూజిక్ అందిస్తుండగా జగదీశ్ బొమ్మిశెట్టి సినిమాటోగ్రాఫర్ గా, కిరణ్ తుంపెర ఈ చిత్రానికి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. 

తారాగణం : అరవింద్ కృష్ణ, రజత్ రాఘవ, నటాషా దోషి, రుచిత సాదినేని, అనిల్ రాథోడ్, కౌశిక్ మేకల.. తదితరులు 

సాంకేతిక తారాగణం:     
దర్శకుడు : VBR
నిర్మాతలు : నాగిరెడ్డి, తేజ్ పల్లి మరియు గుంటక శ్రీనివాస్ రెడ్డి
బ్యానర్స్ : SNR ఎంటర్టైన్మెంట్స్, వైజాగ్ ఫిలిం ఫ్యాక్టరీ మరియు వాసిరెడ్డి సినిమాస్
సహా నిర్మాతలు : బాలిరెడ్డి, రమేష్ గుండా మరియు వాసిరెడ్డి నరేంద్ర  
సంగీతం : వరికుప్పల యాదగిరి 
BGM : విజయ్ కురకాల 
సినిమాటోగ్రాఫర్ : జగదీశ్ బొమ్మిశెట్టి 
ఎడిటర్ : కిరణ్ తుంపెర 
లైన్ ప్రొడ్యూసర్ : అరవింద్ రెడ్డి 
పీఆర్వో : సాయి సతీష్

   
Advertisement
SITVishwak Sen

More Press News

Sai Rajesh’s Mynaa Movie Launched

30 Oct, 23:31

‘మైలురాయి’ టైటిల్ ఆసక్తికరంగా ఉంది: నాగబాబు

30 Oct, 23:25

FIEO, Central Bank of India Educate Entrepreneurs on Export Opportunities

30 Oct, 17:28

పూజా హెగ్డే, హరీశ్ శంకర్, అనిల్ రావిపూడి, వి.వి. వినాయక్‌లతో జీ తెలుగు వీకెండ్ సందడి!

30 Oct, 14:34

డియర్ ఆస్ట్రోనాట్’ గొప్ప సినిమాగా నిలుస్తుంది : శేఖర్ కమ్ముల

29 Oct, 20:15

‘డ్యాడ్స్ లిటిల్ ఫ్రెండ్’ టీజర్‌ విడుదల

29 Oct, 20:10

"కిల్లర్"సెకండాఫ్ ట్విస్ట్ చెప్పండి.. కోటి రూపాయాలు తీసుకోండి: పూర్వాజ్

29 Oct, 12:31

"సమ్మర్ హాలిడేస్" ట్రైలర్ చూశాక నా బాల్యం గుర్తుకువచ్చింది: శ్రీ విష్ణు

29 Oct, 12:25

Vijay Antony’s Nanna Kutti Begins Promotions With First Single Nannala Lokamulo

25 Oct, 11:15

‘రాయవలస’ నుంచి మా ఊరు రాయవలస పాట విడుదల

25 Oct, 11:13

'ఓస్కార్ మిస్సింగ్' చిత్ర ప్రారంభం

23 Oct, 23:21

మనోజ్‌ క్లాప్‌తో ‘మిస్టర్ దెయ్యం’ ప్రారంభం

23 Oct, 23:09

డిసెంబర్ 11న 'రాయవలస' విడుదల

22 Oct, 15:29

కిల్లర్‌ ట్రైలర్‌ విడుదల

22 Oct, 15:25

నవంబర్ 6న థియేటర్స్‌లో "సమ్మర్ హాలిడేస్"

22 Oct, 15:19

సింగపూర్‌లో ఎస్‌పీ‌ఎస్ ఒబెరాయ్‌కు తెలుగు వారి ఆత్మీయ పలకరింపు

20 Oct, 07:18
..More Press News