గొల్ల కురుమల ఆర్థికాభివృద్ధికే గొర్రెల పంపిణీ కార్యక్రమం: మంత్రి తలసాని

Related image

  • 6 వేల కోట్లతో రెండో విడత గొర్రెల పంపిణీ పథకం ప్రారంభం
జమ్మికుంట: రాష్ట్రంలోని గొల్ల కురుమలందరూ ఆర్థికాభివృద్ధి సాధించేందుకే రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించామని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డులో రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని హుజరాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట లో లాంఛనంగా ప్రారంభించామని ,ఈ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని మంత్రి తెలిపారు .రెండో విడత గొర్రెల పంపిణీ పథకాన్ని 6 వేల కోట్లతో ప్రారంభించామని మంత్రి తెలిపారు .రాష్ట్రంలోని 18 సంవత్సరాలు దాటిన ప్రతి గొల్ల కురుమలకు గొర్రెల యూనిట్లు మంజూరు చేస్తామని మంత్రి తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని విధంగా తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని అన్నారు.

రాష్ట్రంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేయుటలో భాగంగా రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల జీవితాల్లో వెలుగులు నింపుటకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో  6వేల కోట్ల 70 లక్షలతో మొదటి విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేశామని తెలిపారు .మొదటి విడత గొర్రెల పంపిణీ కార్యక్రమంలో 80 లక్షలు గొర్రెల యూనిట్లను గొల్లకుర్మలకు పంపిణీ చేశామని తెలిపారు.

వాటి ద్వారా కోటి 30 లక్షల గొర్రె పిల్లలు ఉత్పత్తి అయ్యాయని అన్నారు .తద్వారా దేశం లోనే గొర్రెల సంపద ఎక్కువ గల నంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని తెలిపారు. దళితుల ఆర్థిక అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత రైతు బంధు, రైతు బీమా, రైతు వేదికలు, వైకుంఠ దామల నిర్మాణాలు, నర్సరీలు ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్లు మొదలగు అనేక కార్యక్రమాలు ముఖ్యమంత్రి ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని పేర్కొన్నారు.

రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమంలో పంపిణీ చేసిన గొర్రెలు అనారోగ్యంతో చనిపోతే వారం రోజుల్లోగా ఇన్సూరెన్స్ ఇప్పించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. గొల్ల కురుమల కు మల్లన్న బీరప్ప దేవుళ్ళ స్వరూపమే రాష్ట్ర ముఖ్యమంత్రి అని మంత్రి కొనియాడారు. గొల్ల కురుమలు తమ పిల్లలను ఉన్నత  చదువులు చదివించి బంగారు భవిష్యత్తును కల్పించాలని అన్నారు.

రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ మొదటి విడత గొర్రెల పంపిణీ కార్యక్రమంలో 80 లక్షల గొర్రెలను పంపిణీ చేశామని మంత్రి తెలిపారు. రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రారంభించుకున్నామని అన్నారు .హుజరాబాద్ నియోజకవర్గంలో 4 వేలకు పైగా లబ్ధిదారులకు గొర్ల యూనిట్లు పంపిణీ చేస్తామని మంత్రి తెలిపారు. గొల్ల కురుమలను గొప్పగా గౌరవించిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని అన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల అభివృద్దే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు.

మాట తప్పని మడమ తిప్పని నిజాయితీ గల జాతి గొల్ల కురుమ జాతి అని మంత్రి అన్నారు. అన్ని వర్గాలను అభివృద్ధి చేసే విధంగా ప్రభుత్వo కృషి చేస్తుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న ఆరున్నర సంవత్సరాలలో ఎన్నో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి రాష్ట్రంలో కోటి 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని తెలిపారు .సాగునీటితో బీడు భూములు సస్యశ్యామలమై పచ్చదనంతో కళకళలాడుతున్నాయని అన్నారు. సంక్షేమ రంగంలో రాష్ట్రంలో అనేక మార్పులు వచ్చాయని తెలిపారు. రాష్ట్రంలో 40 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నామని అన్నారు.

రెండవ విడత గొర్రెల పంపిణీ పథకం ప్రారంభం సందర్భంగా 500 గొర్రెల యూనిట్లు పంపిణీ చేయుటకు 12,000 గొర్రెలు తెచ్చారని తెలిపారు. గొర్రెల యూనిట్ ధరను లక్షా 25 వేల నుండి లక్షా 75 వేలకు రాష్ట్ర ముఖ్యమంత్రి పెంచారని తెలిపారు. రైతులకు 24 గంటల కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. ఈ సందర్భంగా 500 గొర్రెల యూనిట్లు లబ్ధిదారులకు అందజేశారు.

ఈ సమావేశంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ కనుమల్ల విజయ, శాసనమండలి సభ్యుడు ఎగ్గే మల్లేశం, వరంగల్ శాసనసభ్యుడు నన్నపనేని నరేందర్, పశుసంవర్ధక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ అనితరావు, జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్, పశుసంవర్ధక శాఖ ఎండీ రామచందర్, అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్, హుజరాబాద్ మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
  

More Press Releases