ప్రతీ ప్రాణమూ విలువైనది, స్వీయ జాగ్రత్తలే కరోనా నుంచి శ్రీరామ రక్ష: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

Related image

  • ప్రతీ పౌరుడూ, ఉద్యోగులూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రభుత్వ సూచనలు పాటించాలి
హైదరాబాద్: మరోసారి విరుచుకుపడుతున్న కోవిద్ వైరస్ మహమ్మారి నుంచి మనల్ని మనం రక్షించుకోవాలని, స్వీయ జాగ్రత్తలే ఇందుకు శ్రీరామ రక్ష అని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. అటవీ శాఖలో అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది తాజా పరిస్థితిపై మంత్రి ఆరా తీశారు.

కోవిడ్ జాగ్రత్తలు పాటించటంపై అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్) ఆర్ శోభ నుంచి వివరాలు తెలుసుకున్నారు. ప్రతీ ప్రాణమూ విలువైనదని, ఎలాంటి అజాగ్రత్తలకు చోటివ్వకుండా కరోనా నియమాలను పాటించాలని, ప్రతీ పౌరుడూ, ఉద్యోగులూ ప్రభుత్వ సూచనలను తూ.చ తప్పకుండా పరిగణలోకి తీసుకోవాలని మంత్రి చెప్పారు.

మంత్రి సూచనల మేరకు అరణ్య భవన్ లో ప్రత్యేకంగా కోవిడ్ వాక్సినేషన్ సెంటర్ ను ప్రారంభించినట్లు పీసీసీఎఫ్ వెల్లడించారు. ప్రతీ ఉద్యోగి వాక్సిన్ వేసుకునేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అలాగే, వైద్య ఆరోగ్య శాఖతో సమస్వయం ద్వారా అన్ని జిల్లాల్లో క్షేత్ర స్థాయి సిబ్బందికి వాక్సిన్ ఇప్పిస్తున్నామని పీసీసీఎఫ్ వెల్లడించారు.

అరణ్య భవన్ లో ఏర్పాటు చేసిన వాక్సినేషన్ సెంటర్ లో పీసీసీఎఫ్ ఆర్ శోభ స్వయంగా దగ్గర ఉండి, ఉద్యోగులు అందరూ వాక్సిన్ తీసుకునేలా ప్రోత్సహించారు. హైదరాబాద్ చీఫ్ కన్జర్వేటర్ ఎం.జె అక్బర్, డీఎఫ్ఓ జోజి ఏర్పాట్లను పర్యవేక్షించారు.

More Press Releases