ఎన్టీ రామారావుకు 'భారతరత్న' వస్తే బాగుంటుంది: చిరంజీవి
- నిన్న ఢిల్లీలో పద్మ విభూషణ్ అందుకున్న చిరంజీవి
- నేడు హైదరాబాద్ తిరిగిరాక
- ఎయిర్ పోర్టులో మీడియాతో మాట్లాడిన మెగాస్టార్
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘పద్మవిభూషణ్ అవార్డు రావటం చాలా సంతోషంగా ఉంది. నాతో సినిమాలు చేసిన దర్శకులు, నిర్మాతలు, నటీనటులు, సాంకేతిక నిపుణుల కారణంగా నాకు ఈ అవార్డు వచ్చింది. అలాగే అభిమానుల అండదండలు ఎప్పుడూ మరచిపోలేను. అందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు" అంటూ వినమ్రంగా స్పందించారు.
ఇక నందమూరి ఎన్టీ రామారావుకు అత్యంత ప్రతిష్ఠాత్మకమైన 'భారతరత్న' వస్తే సంతోషంగా ఉంటుందని అన్నారు. ప్రభుత్వ సహకారంతో అది త్వరగా రావాలని కోరుకుంటున్నానని చిరంజీవి పేర్కొన్నారు.