'వార్‌-2'మూవీ రివ్యూ

  • ఎన్టీఆర్‌ నటించన బాలీవుడ్‌ చిత్ర 'వార్‌-2' 
  • యాక్షన్‌ హంగామా... అలరించే యాక్షన్‌ ఏపిసోడ్స్‌ 
  • ఆకట్టుకోని భావోద్వేగాలు
తెలుగు స్టార్‌ హీరో, ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంతో ఇండియా వైజ్‌ క్రేజ్‌ సంపాందించుకున్న హీరో ఎన్టీఆర్‌ తొలిసారిగా బాలీవుడ్‌లో నటించిన చిత్రం 'వార్‌-2'. ఈ సంవత్సరం ఆడియన్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రంలో హృతిక్‌రోషన్‌, ఎన్టీఆర్‌లు కలిసి నటించారు. యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ స్పై యూనివర్శ్‌లో భాగంగా ఫ్రాంఛైజీగా తెరకెక్కిన ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ కూడా నటించడంతో ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకుల్లో కూడా క్రేజ్‌ పెరిగింది. నేడు ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ ఎలా ఉంది? హృతిక్‌ రోషన్‌, ఎన్టీఆర్‌లు ఎంత వరకు అలరించారు అనేది రివ్యూలో తెలుసుకుందాం.. 

కథ: దేశం దృష్టిలో ద్రోహిగా ముద్రపడ్డ 'రా' మాజీ ఏజెంట్‌ కబీర్‌ (హృతిక్‌ రోషన్‌), సునీల్‌ లూథ్రా (అశుతోష్‌ రాణా)కు కనిపించకుండా అజ్క్షాతంలో గడుపుతుంటాడు. అంతేకాదు ముందుగా కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా జపాన్‌లో ఉన్న ఓ పవర్‌ఫుల్‌ వ్యక్తిని అంతం చేస్తాడు కబీర్‌. అయితే  కార్టెల్‌ అనే యాంటీ సోషల్‌ యాక్టివిటీ గ్రూప్‌ కబీర్‌ సహాయంతో భారతదేశాన్ని తమ చేతుల్లోకి తీసుకోవాలని ప్లాన్‌ చేస్తుంది. ఆ కార్టెల్‌ గ్రూప్‌ కబీర్‌కు సునీల్‌ లూథ్రాని చంపాలని చెబుతుంది. అనుకున్నట్లుగానే తన గాడ్‌ఫాదర్‌ లాంటి సునీల్‌ను అంతం చేస్తాడు కబీర్‌. అయితే కబీర్‌ను ఎలాగైనా పట్టుకోవాలని 'రా'  కొత్త చీఫ్‌ విక్రాంత్‌ కౌల్‌ (అనిల్‌కపూర్‌), ఇండియన్‌ గవర్నమెంట్ సోల్జర్‌ విక్రమ్‌ చలపతి (ఎన్టీఆర్‌) నేతృత్వంలో ఓ టీమ్‌ను రంగంలోకి దింపుతుంది. ఆ టీమ్‌లోనే కావ్య లూథ్రా (కియారా అద్వాణి) కూడా ఉంటారు. ఇక విక్రమ్‌ టీమ్‌, కబీర్‌ను పట్టుకోవడానికి ఎలాంటి ఎత్తుగడలు వేసింది? అసలు కబీర్‌ దేశద్రోహిగా ముద్ర పడటానికి కారణం ఏమిటి? కబీర్‌, లూథ్రాని చంపండానికి కారణం ఏమిటి? కలి కార్టెల్‌ సంస్థ వెనుక ఉన్నదెవరు? ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలియాలంటే సినిమా చూడాలి.. 


విశ్లేషణ: ఈ సినిమా ప్రారంభంలోనే ఎటువంటి కన్‌ఫ్యూజన్‌ లేకుండా ఇది ఇద్దరు హీరోల కథ అని చెప్పి దర్శకుడు ఓ క్లారిటీ ఇచ్చాడు. అయితే ఈ సినిమా ప్రకటన వచ్చిన దగ్గర్నుంచీ ఈ సినిమాలో హీరో ఎవరు? విలన్‌ ఎవరు అనే సందేహలు ఎక్కువగా వ్యక్తమయ్యాయి.ఈ సినిమా ఫస్ట్‌హాఫ్‌లో యాక్షన్‌ స్వీకెన్సీల హంగామానే ఎక్కువగా కనిపించింది. సెకండాఫ్‌లో ఎమోషన్స్‌ని పండించాలనే దర్శకుడి ప్రయత్నం పెద్దగా ఫలించలేదు. హృతిక్‌ రోషన్‌, ఎన్టీఆర్‌ల మధ్య వచ్చే యాక్షన్‌ సన్నివేశాలు థ్రిల్ల్‌ను పంచుతాయి. ఇంటర్వెల్‌ ట్విస్ట్‌ కూడా ఇంట్రెస్ట్‌ను క్రియేట్‌చేస్తుంది. అయితే ఆ ట్విస్ట్‌ సెకండాఫ్‌పై పెద్దగా ఆసక్తి పెంచే విధంగా ఏమి ఉండదు. కబీర్‌, కావ్యల మధ్య వచ్చే సన్నివేశాలు రొటిన్‌గానే అనిపిస్తాయి. ఈ చిత్రంలో ఉన్న దేశభక్తి,సన్నివేశాలు గతంలో వచ్చిన  స్పై చిత్రాల్లో చూసిన విధంగానే ఉంటాయి. ముఖ్యంగా ఎమోషన్స్‌ సీన్స్‌ల్లో ప్రతి సన్నివేశం ఎంతో కృతిమంగా అనిపించడం ఈ సినిమాకు మైనస్‌. కథలో మలుపులు ఉన్నా అవి పెద్దగా మనకు షాకింగ్‌గా అనిపించవు. రెగ్యులర్‌ సన్నివేశాల్లానే ఉంటాయి. ఈ ట్విస్టుల్లోనే కొన్ని ఆడియన్స్‌లో కన్‌ఫ్యూజన్‌కు, గందరగోళానికి గురిచేస్తాయి. పతాక సన్నివేశాలు ఫర్వాలేదనిపిస్తాయి. 

నటీనటుల పనితీరు: కబీర్‌ లాంటి పాత్రలు హృతిక్‌రోషన్‌కు కొత్తేమీ కాదు. ఆయన ఈ పాత్రలో ఎంతో ప్రతిభావంతంగా కనిపించాడు. యాక్షన్‌ హీరోగా ఆయన స్టైల్‌, పాటల్లో ఆయన డ్యాన్స్‌ మూమెంట్‌ ఆకట్టుకుంటాయి. ఎన్టీఆర్‌తో ఆయన కలిసి నటించిన సన్నివేశాలు స్క్రీన్‌ మీద అలరించే విధంగా ఉన్నాయి. విక్రమ్‌ పాత్రలో ఎన్టీఆర్‌ ఒదిగిపోయాడు. ఈ సినిమాకు ఎన్టీఆర్‌ పాత్ర ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. ఎన్టీఆర్‌ విక్రమ్‌ పాత్రలో ఎంతో కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. కియారా అద్వానీ బ్యూటీఫుల్‌ స్క్రీన్‌ ప్రజెన్స్‌ కుర్రకారును కట్టిపడేసే విధంగా ఉంది.  టెక్నిషియన్స్‌ల్లో బెంజమెన్‌ జాస్పర్‌ కెమెరా పనితనం కథ మూడ్‌ను ఇంప్రూవ్‌చేసింది. యాక్షన్‌ సీక్వెన్సీల్లో ఆయన ప్రతిభ కనిపిస్తుంది. సంచిత్‌, అంకిత్‌ కాంబో నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్‌ అయ్యింది. 

ఫైనల్‌గా ఆదిత్య చోప్రా రాసిన కథలో పెద్దగా కొత్తదనం ఏమీ లేకపోవడంతో గతంలో చాలా సినిమాల కథలు గుర్తుకు వస్తాయి. స్క్రీన్‌ప్లే వేగంగా ఉన్న కథ శక్తివంతంగా లేకపోవడంతో సినిమా నిరాశపరుస్తుంది. యాక్షన్‌ సీక్వెన్సీలతో.. హంగామా చేసే ఈ వార్‌లో కథ వీక్‌గా ఉండటంతో ఓ మోస్తరుగా ఆడియన్స్‌ను మెప్పించే అవకాశం ఉంది.

Movie Details

Movie Name: War 2

Release Date: 2025-08-14

Cast: NTR, Hrithik Roshan, Kiara Advani, Ashutosh Rana, Anil Kapoor

Director: Ayan Mukerji

Producer: Aditya chopra

Music: Sanchit Balhara, Ankit Balhara

Banner: Yash Raj Films

Review By: Madhu

War 2 Rating: 2.25 out of 5

Trailer

More Movie Reviews