'వరం' (జియో హాట్ స్టార్) సిరీస్ రివ్యూ!
Advertisement
Varam Review
మెగా డాటర్ సుస్మిత కొణిదెల తన సొంత బ్యానర్ పై ఒక వైపున సినిమాలను నిర్మిస్తూనే, మరో వైపున సిరీస్ లను రూపొందిస్తూ వెళుతున్నారు. అలా తమ బ్యానర్లో నిర్మించిన సిరీస్ పేరే 'వరం'. విశ్వదేవ్ రాచకొండ - శివాత్మిక రాజశేఖర్ ప్రధానమైన పాత్రలను పోషించిన సిరీస్ ఇది. ఆదిత్య మందల దర్శకత్వం వహించిన ఈ సిరీస్ స్ట్రీమింగ్ అక్టోబర్ 22వ తేదీ నుంచి మొదలైంది. ప్రతి గురువారం కొత్త ఎపిసోడ్స్ ను వదులుతూ వెళుతున్నారు.
'రాజు' (విశ్వదేవ్ రాచకొండ) ఒక స్లమ్ ఏరియాకి చెందిన యువకుడు. అతని తండ్రి (శివాజీ రాజా) ఒక తాగుబోతు. తల్లి 'కమలమ్మ' బాగా డబ్బున్న 'శర్మ' ఇంట్లో పనిమనిషిగా చేస్తుంటుంది. టిఫిన్ సెంటర్ నడిపే బాబాయ్ .. అతని కూతురు సింధు .. స్నేహితుడు నాని .. వేశ్యాగృహంలో ఉండే సత్య ఇదే అతని ప్రపంచం. 'సత్య'తో రాజుకి మంచి సాన్నిహిత్యం ఉంటుంది. ఆ చెర నుంచి ఆమెను బయటికి తీసుకురావాలనే ఒక బలమైన ఆలోచన అతనికి ఉంటుంది. అయితే సత్యతో రాజు చనువుగా ఉండటం, ఆమె దగ్గరికి తరచూ వెళ్లే రాజకీయనాయకుడైన 'త్రిపాఠి'(అవసరాల)కి ఇష్టం ఉండదు.
స్లమ్ ఏరియాలోని జీవితం పట్ల రాజు విసిగిపోయి ఉంటాడు. బాగా డబ్బు సంపాదించాలి. తన తల్లిని అవమానించిన శర్మ ఇల్లును కొనాలి .. అందులో తన తల్లిని ఉంచాలని భావిస్తాడు. సహజంగానే మానవత్వం ఎక్కువగా ఉండే రాజుకి, ఆ మంచితనం వల్లనే ఒక 'వరం' లభిస్తుంది. జరగబోయే సంఘటనలు ఒక న్యూస్ మాదిరిగా ముందుగానే అతని ఫోన్ కి వచ్చేస్తూ ఉంటాయి. ఈ విషయాన్ని తన టీమ్ తో అతను పంచుకుంటాడు. తనకి మాత్రమే ముందుగా తెలిసే వార్తలను తనకి అనుకూలంగా మార్చుకుని, రాజు డబ్బు సంపాదించడం మొదలుపెడతాడు.
క్రికెట్ బెట్టింగ్ కి సంబంధించిన వార్తలను ముందుగానే తెలుసుకుంటూ రాజు కోట్లు గడించడం మొదలుపెడతాడు. వేశ్యా గృహం నుంచి సత్యను విడిపిస్తాడు. తనతో తీసుకుని వెళ్లి ఆమెను పెళ్లి చేసుకునే ప్రయత్నాలలో ఉంటాడు. ఈ విషయం తెలుసుకున్న త్రిపాఠి, రాజును దెబ్బతీయాలని నిర్ణయించుకుంటాడు. రాజకీయంగా మరింత ఎదిగిన త్రిపాఠి ఏం చేస్తాడు? పర్యవసానంగా రాజు ఎలాంటి పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుంది? అనేది మిగతా కథ.
పేదరికంతో నానా అవస్థలు పడుతున్న రాజుకి ఒక వరం లభిస్తుంది. ఆ వరం కారణంగా అంచెలంచెలుగా రాజు ఎదుగుతూ ఉంటాడు. ఈ క్రమంలోనే సత్యను తన దానిగా చేసుకుంటాడు. సత్యతో సంబంధం కలిగి ఉన్న రాజకీయనాయకుడికి, రాజు శత్రువుగా మారతాడు. 'వరం' వలన వచ్చిన డబ్బు కారణంగా, సత్య కారణంగా రాజు జీవితం ఎలాంటి మలుపులు తిరుగుతుందనేది ఈ కథలోని ప్రధానమైన అంశం.
జరగబోయే సంఘటనలు హీరోకి ముందుగానే తెలియడం .. వాటిని ఆపడానికో .. అనుకూలంగా మార్చుకోవడానికో హీరో ప్రయత్నించడం వంటి కథనాలు గతంలో చాలానే వచ్చాయి. అలాంటి ఒక కథనే ఇది. అయితే స్మార్ట్ ఫోన్ ద్వారా ఆ ప్రక్రియను నడిపిస్తూ, బడ్జెట్ పరంగాను .. కథాపరంగా ఈ అంశాన్ని తేలిక చేసేశారు. అయితే హీరో తాను ఎదగడానికి బెట్టింగ్ ను ఎంచుకోవడం .. పోలీసులను తప్పుదారి పట్టించడం అందుకు సంబంధించిన సన్నివేశాలు రొటీన్ గా అనిపిస్తాయి.
ఈ కథలో నిజాయితీ పరుడైన ఒక తండ్రి పాత్రలో శివాజీ రాజా కనిపిస్తాడు. అయితే అతను మద్యానికి బానిస అనే ఒక ముద్ర వేయడం వలన ఆ నిజాయితీ మసకబారుతుంది. ఇక తన తల్లికి ఒక పెద్ద సొంత ఇంటిని ఇవ్వాలనేది హీరో ఆశయం. అయితే ఆ తల్లికి దొంగతనం చేస్తూ దొరికిపోవడం .. తల్లిపట్ల హీరోకి ఎంతో ప్రేమ ఉన్నప్పటికీ, అతను ఆ తల్లి ముచ్చట తీర్చడం కోసం చేసే పనులు సరైనవి కాకపోవడం వలన ఎమోషనల్ గా కనెక్ట్ కాలేకపోయాయి.
ఇక ఈ కథలో అత్యంత కీలకమైన అంశం, హీరోకి 'వరం' లభించడం. జరగబోయే సంఘటనలు హీరోకి ముందుగా తెలియడమనే వరం దక్కడం అంత తేలికగా జరగదు. దానిని వెనుక ఒక బలమైన కారణమే ఉండాలి. అప్పుడే అది ఆడియన్స్ కి ఒక రేంజ్ లో కనెక్ట్ అవుతుంది. కానీ ఈ పాయింట్ ను గురించి పెద్దగా పట్టించుకోలేదు. ఈ సంఘటనను కూడా హీరో చేస్తున్న పనితో ముడిపెట్టడం అవసరమా? అనిపిస్తుంది.
అజయ్ పాత్రను పట్టించుకోకపోవడం అసంతృప్తిని కలిగిస్తుంది. శర్మ తన బంగ్లాను వదులుకుని వెళ్లిపోయే సీన్ చాలా సిల్లీగా అనిపిస్తుంది. 6వ ఎపిసోడ్ ట్విస్ట్ మాత్రం రానున్న ఎపిసోడ్స్ పై ఆసక్తిని పెంచేదిలానే ఉంది. ఫహద్ అబ్దుల్ మజీద్ ఫొటోగ్రఫీ .. సిద్ధార్థ్ సదాశివుని నేపథ్య సంగీతం .. సిద్ధేశ్ చౌదరి ఎడిటింగ్ ఓ మాదిరిగా అనిపిస్తాయి. ప్రధానమైన పాత్రలను పోషించిన వాళ్లంతా తమ పాత్ర పరిధిలో బాగానే చేశారు.
జీవితం ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంతోషంగా .. సుఖంగా .. సాగిపోవాలనే అంతా కోరుకుంటూ ఉంటారు. తమ వాళ్లకు ఎలాంటి లోటు రాకుండా చూసుకోవాలనే భావిస్తారు. అయితే అలా ఎదిగే అవకాశం భగవంతుడు కొంతమందికే ఇస్తాడు. అలా ఇచ్చిన అవకాశాన్ని 'వరం'గా ఉపయోగించుకుంటారా? శాపంగా మార్చుకుంటారా? అనేది వాళ్ల ఆలోచనా విధానంపై ఆధారపడి ఉంటుందనే ఒక సందేశం ఈ కథలో మనకి కనిపిస్తుంది.

Series Details
Series Name: Varam
Genre: Fantasy, Thriller
Release Date: 22 Oct 2026
Cast: Vishwadev Rachakonda, Shivathmika Rajasekhar, Srinivas Avasarala, Shivaji Raja, Ajay, Sruthi Jayan
Director: Adithya Mandala
Music: Siddharth Sadashivuni
Banner: Gold Box Entertainments
Review By: Peddinti
Varam Rating: 1.75 out of 5
Disclaimer: This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer
Advertisement