Advertisement

'అనకాపల్లి' (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ!

Movie Reviews
Rating: 2/5Action, Crime, DramaMovie details ›
Advertisement

Anakapalli Review

సీనియర్ స్టార్ హీరోల కుటుంబాల నుంచి మాత్రమే కాదు, వ్యాపార .. రాజకీయ వర్గాలకు చెందిన వారసులు కూడా తెరపై హీరోగా ప్రూవ్ చేసుకోవడానికి ఉత్సాహాన్ని కనబరుస్తున్నారు. అలా తెలుగు తెరపైకి పరిచయమైన మరో వారసుడే విక్రమ్ సహిదేవ్. లగడపాటి శ్రీధర్ తనయుడైన విక్రమ్ సహిదేవ్, హీరోగా చేసిన తొలి సినిమానే 'అనకాపల్లి'. సంధ్య వశిష్ఠ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, ప్రతినాయకుడిగా తారక్ పొన్నప్ప కనిపిస్తాడు. ఖగేశ్ తమ్మినేని దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 3వ తేదీ నుంచి 'అమెజాన్ ప్రైమ్' లో స్ట్రీమింగ్ అవుతోంది.

'అనకాపల్లి'లో సాంబశివరావు (నక్కిన త్రినాథరావు) ఆయన భార్య 'జయంతి' (ఇంద్రజ) నివసిస్తూ ఉంటారు. వారి ఒక్కగానొక్క సంతానమే సూర్య ( విక్రమ్ సహిదేవ్). సాంబశివరావు ఒక ప్రభుత్వ ఉద్యోగి .. ఎలాంటి వివాదాలు లేని ప్రశాంతమైన జీవితాన్ని ఆ కుటుంబం అనుభవిస్తూ ఉంటుంది. ఆ ఊళ్లో అందరికీ కూడా 'బుల్లెట్' ( తారక్ పొన్నప్ప) అంటే భయం. అందువలన ఆయన ప్రధానమైన అనుచరుడైన 'చంటి' హవా అక్కడ కొనసాగుతూ ఉంటుంది. ఒకానొక సందర్భంలో సాంబశివరావు పట్ల చంటి దురుసుగా ప్రవర్తిస్తాడు.

ఇక తాము ఆ ఊళ్లో ధైర్యంగా బ్రతకాలంటే తాను 'బుల్లెట్'తో ఫ్రెండ్షిప్ చేయాలని సూర్య భావిస్తాడు. ఆ ఊరి ఎమ్మెల్యే .. అతని ప్రధాన అనుచరుడైన నాయుడుతో బుల్లెట్ కి గొడవలు ఉంటాయి. అక్రమ వ్యాపారాల విషయంలో ఒకరిపై ఒకరు ఆధిపత్యాన్ని సంపాదించాలని ప్రయత్నిస్తూ ఉంటారు. బుల్లెట్ ఆశ్రయాన్ని సంపాదించుకున్న సూర్య, తనకి తెలియకుండానే అతని ప్రధాన అనుచరుడిగా మారిపోతాడు. అతని అక్రమాలలో .. హత్యలలో పాలుపంచుకుంటాడు.

ఇదే సమయంలో 'అమృత' ( సంధ్య వశిష్ఠ)ను సూర్య ఆరాధించడం మొదలుపెడతాడు. ఆమె ఫ్యామిలీ ఒక మెస్ నడుపుతూ ఉంటుంది. అమృత పట్ల ఉన్న ప్రేమను బయటపెట్టడానికి సూర్య ప్రయత్నిస్తూ ఉండగా, తాను బుల్లెట్ ను లవ్ చేస్తున్నట్టుగా ఆమె చెబుతుంది. అతని హీరోయిజం తనకి ఇష్టమని అంటుంది. అప్పుడు సూర్య ఎలా స్పందిస్తాడు? బుల్లెట్ స్వభావం తెలిసిన అతను,  ఆమె విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు? చివరికి అమృత ఎవరికి దక్కుతుంది? అనేదే కథ.

సాధారణంగా ప్రతో చోటా కూడా అక్రమ వ్యాపారాలను నిర్వహించే వారి మధ్య వార్ జరుగుతూనే ఉంటుంది. ఇలాంటి లావాదేవీల మధ్య రాజకీయనాయకుల ప్రమేయం ఉండనే ఉంటుంది. బలమైన వారి వెనుక ఉంటే, తమ ఫ్యామిలీకి రక్షణగా ఉంటుందని కొంతమంది అబ్బాయిలు భావించడం సహజం. అలాగే అందరూ భయపడే వ్యక్తిని అండగా మార్చుకోవాలని  ఆశపడే అమ్మాయిలు ఉండకపోరు. అలా ఆలోచించిన ఒక జంట కథనే ఈ సినిమా.

'అనకాపల్లి'లో తన ఫ్యామిలీ ధైర్యంగా బ్రతకాలంటే తమకి బుల్లెట్ అండదండలు ఉండాలని సూర్య భావిస్తాడు. అందుకోసం అతను చేసే ప్రయత్నాలు .. బుల్లెట్ అక్రమాలలో పాల్గొనడం .. అతని అభిమానాన్ని పెంచుకోవడం .. అదే సమయంలో అమృత ప్రేమలో పడటం .. ఆమె మనసులో ఉన్నది బుల్లెట్ అని తెలుసుకోవడం వంటి సన్నివేశాలతో ఫస్టాఫ్ నడుస్తుంది. తాను ప్రేమించిన అమ్మాయి అమాయకత్వంతో బుల్లెట్ వంటి దుర్మార్గుడి మాయలో పడకూడదనే ఉద్దేశంతో సూర్య చేసే పోరాటంతో సెకండాఫ్ కొనసాగుతుంది. 

బుల్లెట్ అనేవాడు ఎలాంటివాడు .. ఏం చేస్తూ ఉంటాడు? అనేది తెలిసే అమృత అతనిని ప్రేమిస్తుంది గనుక, అతని గురించి ఆమెకి కొత్తగా చెప్పేదేమీ లేదని సూర్య భావిస్తాడు. అలాగే అసలు ప్రేమ అనే మాటకు అర్థం తెలియని బుల్లెట్ కి, అమృత ప్రేమ గురించి చెప్పడం వలన కూడా ప్రయోజనం లేదని సూర్య భావిస్తాడు. ఈ ఇద్దరి మధ్య నలిగిపోతున్న అతను చివరికి ఏం చేస్తాడు? అనే కుతూహలంతోనే ఆడియన్స్ ఎదురుచూస్తూ ఉంటారు. 

ఏ కథలోనైనా హీరోయిన్ .. హీరోనే ప్రేమిస్తుంది. హీరోకంటే బలంగా ఉన్నాడనీ .. అతనికి పరపతి ఎక్కువుందని చెప్పి విలన్ ప్రేమించడం దాదాపుగా జరగదు. అయితే హీరోయిన్ ను విలన్ ఇష్టపడటం .. ఆమెను తన దారికి తెచ్చుకోవడానికి అనేక రకాలుగా ప్రయత్నించడం సహజం. దానిని ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు కూడా. కానీ ఈ సినిమాలో హీరోయిన్ .. విలన్ ను లవ్ చేస్తుంది. ఇదే ఈ సినిమాలోని కొత్తదనమని దర్శకుడు అనుకుని ఉండొచ్చు. కానీ అది ప్రేక్షకులకు మింగుడు పడని విషయంగానే మిగిలిపోతుంది.  

"నేను నిన్ను ఇష్టపడుతున్నాను ... కానీ నీకు ఆ విషయం అర్థం కావడం లేదు. నువ్వేమో బుల్లెట్ ను ప్రేమిస్తున్నావ్ .. అది కూడా నాకు సమస్య కాదు. అతనికి నీ పట్ల ప్రేమలేదు .. అదే నా సమస్య అంటాడు హీరో. నీకు ఏమైనా అయితే అతణ్ణి చంపేస్తాను" అంటూ హీరో అతిగా ఆవేశపడిపోయే సీన్ ఒకటి ఉంది. వాస్తవ పరిస్థితులకు కాస్త దూరంగా అనిపించే సీన్ గా ఇది కనిపిస్తుంది. పద్ధతిగా పెంచుకున్న కొడుకు నేరుగా వెళ్లి రౌడీ గ్యాంగ్ లో చేరితే, ఆరంభంలోనే పేరెంట్స్ వారించే సీన్ ఒక్కటీ పడకపోవడం ఆశ్చర్యం.

నాయుడు చనిపోయిన తరువాత ఎమ్మెల్యే రంగంలోకి దిగడం .. డీఎస్పీ సత్యను బరిలోకి దింపానంటూ హడావిడి చేయడం జరుగుతుంది. అయితే అందుకు సంబంధించిన ట్రాక్ ఆపేయడంతో, అది ఒక అనవసరమైన హడావిడిగానే మిగిలిపోతుంది. విక్రమ్ కి హీరోగా ఇది మొదటి సినిమానే అయినా ఫరవాలేదన్నట్టుగా చేశాడు. సంధ్య నటన కూడా ఫరవాలేదు. తారక్ పొన్నప్ప నటన ఆకట్టుకుంటుంది. త్రినాథరావు అందించిన కథ .. మాయ ఫొటోగ్రఫీ .. దేవ్ జండ్ నేపథ్య సంగీతం .. ఖగేశ్ టేకింగ్ ఫరవాలేదు. హీరోయిన్ .. విలన్ ను లవ్ చేయడం అనే లైన్ కొత్తగా అనిపిస్తే ఈ సినిమాను ఒకసారి చేసేయవచ్చు.         

Movie Details

Movie Name: Anakapalli

Genre: Action, Crime, Drama

Release Date: 3 Nov 2026

Cast: Vikram Sahidev, Sandhya Vasista, Tarak Ponnappa, Inadraja, Thinatha Rao

Director: Khagesh Tammineni

Music: Devzand

Banner: Trinatha Rao Nakkina Productions

Review By: Peddinti

Anakapalli Rating: 2 out of 5

Disclaimer: This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.

Trailer

Advertisement
AnakapalliKhagesh TammineniKandregula NaiduVikram SahidevSandhya VasistaTarak PonnappaInadrajaThinatha Rao

More Movie Reviews

'మేడమ్ ఇన్ స్పెక్టర్' (నెట్ ఫ్లిక్స్) సిరీస్ రివ్యూ!

10 Nov, 15:45

'అనుగ్రహీతన్ ఆంటోనీ' ( ఈటీవీ విన్) మూవీ రివ్యూ! 

08 Nov, 08:27

'కౌరిబురి: ది కర్స్ డ్ టెంపుల్' ( నెట్ ఫ్లిక్స్) సిరీస్ రివ్యూ!

07 Nov, 12:07

'సీన్' - మూవీ రివ్యూ!

06 Nov, 14:09

'Summer Holidays Movie' Review

06 Nov, 11:59

'సమ్మర్‌ హాలిడేస్‌' మూవీ రివ్యూ

06 Nov, 11:44

Ramayana Part 1 Movie Review

05 Nov, 14:26

'రామాయణం - పార్టు 1' (మూవీ రివ్యూ)

05 Nov, 12:53

'ఇమ్మోర్టల్ ' (సోనీ లివ్) మూవీ రివ్యూ!

04 Nov, 13:38
..More Movie Reviews