Advertisement

'మేడమ్ ఇన్ స్పెక్టర్' (నెట్ ఫ్లిక్స్) సిరీస్ రివ్యూ!

Movie Reviews
Rating: 1.75/5Crime, ThrillerSeries details ›
Advertisement

Madam Inspector Review

బెంగాలీలో కొంతకాలం క్రితం 'బీరాంగన' (వీరాంగన) అనే టైటిల్ తో ఒక సిరీస్ రూపొందింది. ఆ సిరీస్ ఇప్పుడు  'మేడమ్ ఇన్ స్పెక్టర్'గా ఓటీటీ ప్రేక్షకులను పలకరిస్తోంది. అక్టోబర్ 17వ తేదీ నుంచి 'నెట్ ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్ అవుతోంది. సస్పెన్స్ తో కూడిన ఈ క్రైమ్ థ్రిల్లర్ ను 7 ఎపిసోడ్స్ గా వదిలారు. బెంగాలితో పాటు ఇప్పుడు తెలుగు .. తమిళ .. హిందీ భాషల్లో ఈ సిరీస్ అందుబాటులోకి వచ్చింది.

కోల్ కతాలో చిత్రా బసు ( సందీప్తా సేన్) పోలీస్ ఆఫీసర్ గా పనిచేస్తూ ఉంటుంది. అత్తమామలకు ఆమె జాబ్ చేయడం ఇష్టం ఉండదు. అయినా భర్త సపోర్ట్ తో తన పని తాను చేసుకుంటూ వెళుతూ ఉంటుంది. అప్పుడప్పుడు బాల్యంలో జరిగిన ఒక సంఘటన ఆమె కనులముందు కదులుతూ ఉంటుంది. అప్పుడు ఆమె గుండె బరువెక్కుతూ ఉంటుంది. ఆ సంఘటనను మరిచిపోవడానికి ఆమె చాలా కాలంగా ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. అలాగే తన పైఅధికారి 'బరల్'ను భరిస్తూ ఉంటుంది. 

నగరంలో చిత్రమైన మరణాలు చోటుచేసుకుంటూ ఉంటాయి. పెళ్లి ముహూర్తానికి ముందు పెళ్లికూతుర్లు చనిపోతుంటారు. వాళ్ల మరణానికి కారణం ఏమిటనేది కూడా మిస్టరీగా మిగిలిపోతూ ఉంటుంది. ఈ కేసును సాల్వ్ చేయడం కోసం ధీరజ్ బృందంతో కలిసి చిత్రా బసు రంగంలోకి దిగుతుంది. అమ్మాయికి రెండో పెళ్లి అయినప్పుడు మాత్రమే మరణాలు సంభవిస్తున్నాయనేది ఆమె విచారణలో తేలుతుంది. మరణాలు సంభవించిన పెళ్లి కూతుళ్ల అందరికీ కలిపి కామన్ పాయింట్ ఏమిటనేది ఆలోచన చేస్తుంది. 

పెళ్లి మంటపంలోనే పెళ్లి కూతురు మరణించిన అన్ని పెళ్లిళ్లకి ఫ్లవర్ డెకరేషన్ చేసింది ఒక్కరేనని  .. అతని పేరు 'చిరాయు' అనే విషయం తెలుస్తుంది. అతనిని పట్టుకోవడం కోసం తన టీమ్ తో కలిసి చిత్రా బసు రంగంలోకి దిగుతుంది. హంతకుడు ఎవరు? ఎందుకు హత్యలు చేస్తున్నాడు? రెండో వివాహం చేసుకుంటున్న యువతులను ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు? అతణ్ణి పట్టుకోవడంలో  ఆమె ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది? అనేదే కథ.

రెండో వివాహానికి సిద్ధమైన యువతులు, కల్యాణ మంటపంలో కుప్పకూలిపోతుంటారు. హఠాత్తుగా .. అనుమానాస్పదంగా వాళ్ల మరణాలు జరుగుతూ ఉంటాయి. అందుకు కారణం ఏమిటి? జరుగుతున్న మరణాలకు కారకులు ఎవరు? అనే విషయాన్ని తేల్చడానికి పోలీస్ ఆఫీసర్ చిత్రా బసు రంగంలోకి దిగుతుంది. ఆమె ఈ కేసును ఎలా డీల్ చేస్తుందనేదే ఈ కథలోని ప్రధానమైన అంశం. దీని చుట్టూనే ఈ కథ అంతా తిరుగుతూ ఉంటుంది.

సాధారణంగా సైకో కిల్లర్ వరుస హత్యలు చేస్తూ వెళుతుంటాడు. అతను ఎవరు? ఎందుకు ఇలా హత్యలు చేస్తున్నాడు? అనే రహస్యాన్ని ఛేదించడానికి పోలీస్ అధికారులు రంగంలోకి దిగుతూ ఉంటారు. కథ క్లైమాక్స్ కి చేరుకుంటూ ఉండగా ఆ సైకో కిల్లర్ ఎవరనేది రివీల్ చేయడం .. ఆడియన్స్ గెస్ కరెక్ట్ కాదని నిరూపించడం సహజంగా జరుగుతూ ఉంటుంది. కానీ ఈ కథలో సాయికి కిల్లర్ ఎవరనేది ముందుగానే చూపించేస్తారు? అతనిని పోలీసులు ఎలా పట్టుకుంటారనేదే ఉత్కంఠను రేకెత్తించే అంశంగా మారుతుంది.

మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో .. సైకో కిల్లర్ కథలలో, హత్యలకు హంతకుడు ఎలా ప్లాన్ చేస్తున్నాడు? అతనిని పట్టుకోవడానికి పోలీసులు ఎలాంటి వ్యూహాలను పన్నుతున్నారు? అనేదే అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తూ ఉంటుంది. అయితే ఈ కథలో ఈ రెండు ప్రక్రియలు చాలా సాధారణంగా జరిగిపోతూ ఉంటాయే తప్ప, నెక్స్ట్ ఏం జరగబోతోంది? అనే ఒక ఉత్కంఠ మాత్రం ఆడియన్స్ వైపు నుంచి తొంగిచూడదు. 

ఇక అసలైన విషయం .. హంతకుడు అలా మారడానికి గల కారణం ఏమిటి? అనేది తెలుసుకోవడానికి ప్రేక్షకులు కుతూహలాన్ని కనబరుస్తారు. అందుకు సంబంధించిన కారణం ఫ్లాష్ బ్యాక్ గా ఆడియన్స్ ముందుకు వస్తుంది. కాకపోతే అది చాలా రొటీన్ గా అనిపిస్తుంది. ఇక ప్రధానమైన పాత్రను పోషించిన పోలీస్ ఆఫీసర్ చిత్రా బసు ఫ్లాష్ బ్యాక్ కూడా చాలా పేలవంగా అనిపిస్తుంది. 

ప్రధానమైన పాత్రలను పోషించిన ఆర్టిస్టులు, తమ పాత్ర పరిధిలో బాగానే చేశారు. ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం .. ఎడిటింగ్ జస్ట్ ఓకే అన్నట్టుగా అనిపిస్తాయి. కొన్ని పాత్రల డైలాగ్స్ మాత్రం మ్యూట్ లోనే ఉండిపోయాయి. కథాకథనాల పరంగా పెద్దగా ప్రభావితం చేయలేకపోయిన ఈ కంటెంట్, ఓ మాదిరిగా అనిపిస్తుందంతే.           

Series Details

Series Name: Madam Inspector

Genre: Crime, Thriller

Release Date: 17 Oct 2026

Cast: Sandipta Sen, Niranjan Mondal, Pratik Dutta, Aditya Sengupta

Director: Nirjhar Mitra

Music: Nabarun Bose

Banner: No Country Flims

Review By: Peddinti

Madam Inspector Rating: 1.75 out of 5

Disclaimer: This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.

Advertisement
Madam InspectorNirjhar MitraShayak Roy- Niranjan ChakraborthySandipta SenNiranjan MondalPratik DuttaAditya Sengupta

More Movie Reviews

'అనుగ్రహీతన్ ఆంటోనీ' ( ఈటీవీ విన్) మూవీ రివ్యూ! 

08 Nov, 08:27

'కౌరిబురి: ది కర్స్ డ్ టెంపుల్' ( నెట్ ఫ్లిక్స్) సిరీస్ రివ్యూ!

07 Nov, 12:07

'సీన్' - మూవీ రివ్యూ!

06 Nov, 14:09

'Summer Holidays Movie' Review

06 Nov, 11:59

'సమ్మర్‌ హాలిడేస్‌' మూవీ రివ్యూ

06 Nov, 11:44

Ramayana Part 1 Movie Review

05 Nov, 14:26

'రామాయణం - పార్టు 1' (మూవీ రివ్యూ)

05 Nov, 12:53

'ఇమ్మోర్టల్ ' (సోనీ లివ్) మూవీ రివ్యూ!

04 Nov, 13:38

'అక్క' (నెట్ ఫ్లిక్స్) సిరీస్ రివ్యూ!

03 Nov, 16:37
..More Movie Reviews