'అనుగ్రహీతన్ ఆంటోనీ' ( ఈటీవీ విన్) మూవీ రివ్యూ!
Advertisement
Anugraheethan Antony Review
మలయాళంలో నటుడిగా 'సన్నీవేన్' కి మంచి పేరు ఉంది. విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ ఎప్పటికప్పుడు ఆయన తనదైన ప్రత్యేకతను చాటుతూ వెళుతున్నాడు. ఆయన కథానాయకుడిగా నటించిన సినిమానే 'అనుగ్రహీతన్ ఆంటోనీ'. గౌరీ కిషన్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమాకి, 'ప్రిన్స్ జాయ్' దర్శకత్వం వహించాడు. 2021లో థియేటర్లకు వచ్చిన ఈ రొమాంటిక్ కామెడీ డ్రామా, ఈ నెల 6వ తేదీ నుంచి 'ఈటీవీ విన్'లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఆంటోని (సన్నీ వేన్) ఓ మిడిల్ క్లాస్ యువకుడు. అతని తండ్రి స్కూల్ హెడ్ మాస్టర్ గా పనిచేసి ఉంటాడు. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన ఆంటోనీని అతని తండ్రి ఎంతో గారంగా పెంచుతాడు. అక్క ఝాన్సీ కూడా అతనిని ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది. దాంతో అతను పెద్దగా చదువుకోకుండా .. స్నేహితులతో కలిసి సరదాగా తిరుగుతూ .. తాగుతూ రోజులు గడిపేస్తూ ఉంటాడు. పైగా తండ్రి పెంచుకునే కుక్కపిల్లలపై కూడా తన శాడిజం చూపిస్తూ ఉంటాడు.
ఈ నేపథ్యంలోనే పిండిమిల్లులో అతనికి 'సంజన' ( గౌరీ కిషన్) పరిచయమవుతుంది. ఆమె అందం .. అణకువ అతనిని ఆకట్టుకుంటాయి. పిండి పట్టించుకునే సాకుతో ప్రతిరోజూ కలుసుకుంటూ, ఆమె మనసులో స్థానం సంపాదిస్తాడు. అతను ఎవరు? ఎక్కడి నుంచి తన మిల్లుకు వస్తున్నాడు? అనే విషయం పట్టించుకోకుండానే, అతనిని సంజన ఆరాధిస్తూ ఉంటుంది. ఆమెతో అందమైన జీవితాన్ని ఊహించుకుంటూ, ఆంటోనీ రోడ్డు ప్రమాదానికి గురవుతాడు. ఆ ప్రమాదంలో అతను అక్కడికక్కడే చనిపోతాడు.
ఆత్మగా మారిపోయిన అతను తన ఇంటికి చేరుకుంటాడు. తన కోసం ఏడుస్తున్న బంధుమిత్రులను చూస్తాడు. వాళ్లను ఓదార్చడానికి ప్రయత్నిస్తాడు. అయితే వాళ్లకి తాను కనిపించననీ .. వాళ్లను తాకలేనని తెలుసుకుని డీలాపడిపోతాడు. చనిపోయినవాళ్లు వారం రోజులు పాటు మాత్రమే నేలపై ఉండగలుగుతారని తెలుసుకున్న ఆంటోనీ, వారం రోజులలోగా తాను అనుకున్న విషయాలను చక్కబెట్టాలని నిర్ణయించుకుంటాడు. తాను చనిపోయిన విషయాన్ని ఆమెకి తెలియపరచాలని అనుకుంటాడు. అందుకోసం అతను ఏం చేస్తాడు? ఎలాంటి అనుభవాలను ఎదుర్కొంటాడు? అనేది మిగతా కథ.
జీవితాన్ని గురించి చాలామంది పెద్దగా ఆలోచన చేయరు. జీవితంలో ఏ విషయాన్ని సీరియస్ గా తీసుకోరు. తిని .. తాగేసి .. తిరిగేస్తూ ఉంటారు. అమ్మానాన్నలు .. అన్నదమ్ములు .. అక్కా చెల్లెళ్లు ఎవరెన్ని రకాలుగా చెబుతున్నా పట్టించుకోకుండా కాలక్షేపం చేస్తుంటారు. అలాంటి వాళ్లు హఠాత్తుగా చనిపోతే .. ఆత్మగా మారిపోతే .. ఒక వారం రోజులు మాత్రమే ఇక భూమ్మీద ఉంటామనే విషయం వాళ్లకి తెలిస్తే .. అప్పుడు వాళ్ల ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? అనేది ప్రధానమైన అంశంగా చేసుకుని ఈ కథ నడుస్తుంది.
సాధారణంగా ఏ సినిమాలోనైనా హీరో ఇంట్రడక్షన్ ఒక రేంజ్ లో ప్లాన్ చేస్తుంటారు. లేదంటే ఒక ఇంట్రెస్టింగ్ సీన్ తో ఇంట్రడక్షన్ ఉంటుంది. కానీ యాక్సిడెంట్ లో హీరో చనిపోవడంతో ఈ సినిమా కథ మొదలవుతుంది. హీరో ఆత్మ తన ఊళ్లో .. తన ఇంటి పరిసరాలలో .. తన స్నేహితుల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అతను ఒక ఆత్మగా చూస్తూ ముందుకు సాగుతుంటే, ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు విడతలు ..విడతలుగా ప్రేక్షకుల ముందుకు వస్తుంటాయి. కథను కొత్తగా ఆవిష్కరించడం ఇక్కడే మొదలైనట్టుగా అనిపిస్తుంది.
ఆంటోని తన తండ్రికి కోపం తెప్పించడం .. అక్కను చిరాకుపెట్టడం .. స్నేహితులతో చిల్లర గొడవలు .. మిల్లు అమ్మాయి సంజనతో ప్రేమలో పడటం వంటి సన్నివేశాలు ఈ కథను ఆసక్తికరంగా మారుస్తూ ముందుకు వెళుతుంటాయి. ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలను చాలావరకూ పూర్తి చేసుకుని, విశ్రాంతి సమయానికి కథ తిరిగి ఫస్టు సీన్ దగ్గరికి వచ్చి ఆగుతుంది.
ఆంటోని ఆత్మ ఈ భూమిని విడిపోవడానికి వారం రోజులు మాత్రమే సమయం ఉంటుంది. ఈలోగా తాను చనిపోయిన విషయం ప్రియురాలికి చెప్పాలని అతను ప్రయత్నిస్తూ ఉంటాడు. అతను చనిపోయిన సంగతి తెలియక, పెళ్లి సంబంధాలు తీసుకొస్తున్న తండ్రికి వద్దని చెప్పలేక సంజన సతమతమైపోవడం వంటి సన్నివేశాలతో సెకండాఫ్ కొనసాగుతుంది.
ఈ సినిమా సెకండాఫ్ లోతు తెలియనంత వరకూ ఫస్టాఫ్ ను సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. కథనం నిదానంగా నడుస్తూ అసహనంతో కదిలేలా చేస్తుంది. అయితే సెకండాఫ్ లో ఈ సినిమా ఎమోషన్స్ ను కాస్త బలంగానే టచ్ చేస్తుంది. ఎప్పటికీ ఇలాగే బతికేస్తూ ఉంటామని అన్ని విషయాలను నిర్లక్ష్యం చేస్తూ సమయాన్ని వృథా చేసే మనిషి హఠాత్తుగా చనిపోతే, ఆత్మగా పడే బాధను ఆవిష్కరించిన విధానం ఆకట్టుకుంటుంది.
జీవితం ఎంత అందమైనది .. అమూల్యమైనది అనే విషయం అది చేజారిన తరువాతనే తెలుస్తుంది అనే సత్యాన్ని చాటే సినిమా ఇది. ఆనందాలు .. అనుభూతుల విలువ తెలియనివాళ్లు ఆత్మగా ఏడు రోజులు ఈ నేలపై ఉండటానికి ఎంతగా బాధపడతారనేది చూపించిన విధానం ఆలోచింపజేస్తుంది. చేసిన పొరపాట్లు .. తప్పులు సరిదిద్దుకునే అవకాశం లేక ఆత్మ ఎంత క్షోభిస్తుందనేది మనసును కదిలిస్తుంది. జీవించి ఉన్నప్పుడు ప్రతి నిమిషం .. ప్రతి పని ఎంత విలువైనవో తెలియజెబుతుంది.
నటీనటుల నటన చాలా సహజంగా అనిపిస్తుంది. ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం .. ఎడిటింగ్ ఆ సహజత్వానికి మరింత బలాన్ని చేకూర్చినట్టు అనిపిస్తుంది. ఫస్టాఫ్ లో కథను సాగదీయకుండా కాస్త వేగంగా చెప్పడానికి ప్రయత్నిస్తే బాగుండేదనే భావన కలుగుతుంది. క్లైమాక్స్ ను డిజైన్ చేసిన విధానం కారణంగా సెకండాఫ్ మరింత బలపడి, ఈ సినిమాను చాలావరకూ నిలబడుతుంది. ఫ్యామిలీతో కలిసి చూడవలసిన సినిమానే ఇది.

Movie Details
Movie Name: Anugraheethan Antony
Genre: Comedy, Drama, Fantasy
Release Date: 6 Nov 2026
Cast: Sunny Wayne, Gouri G. Kishan, Siddique, Indrans, Suraj Venjaramoodu
Director: Prince Joy
Music: Arun Muraleedharan
Banner: Lekshya Entertainments
Review By: Peddinti
Anugraheethan Antony Rating: 2 out of 5
Disclaimer: This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer
Advertisement