'కౌరిబురి: ది కర్స్ డ్ టెంపుల్' ( నెట్ ఫ్లిక్స్) సిరీస్ రివ్యూ!

Movie Reviews
Rating: 2/5ThrillerSeries details ›
Advertisement

Kauriburi: The Cursed Temple Review

ఈ మధ్య కాలంలో బెంగాలీ సిరీస్ ల జోరు పెరుగుతోంది. ఓటీటీ ప్రేక్షకుల హృదయాలలో బెంగాలీ సిరీస్ లు తమ ప్రత్యేకతను చాటుతూ వెళుతున్నాయి. అలా తెలుగు ఆడియోతోను ఓటీటీ ఆడియన్స్ ముందుకు వచ్చిన మరో సిరీస్ గా 'కౌరిబురి: ది కర్స్ డ్ టెంపుల్' కనిపిస్తుంది. సయంతన్ ఘోషల్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్, 6 ఎపిసోడ్స్ గా రూపొందింది. ఈ నెల 6వ తేదీ నుంచి ఈ సిరీస్ 'నెట్ ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్ అవుతోంది. 

భవతారణ్ ముఖర్జీ (జీతూ కమల్) తన తండ్రి నుంచి జ్యోతిష్యంతో పాటు కొన్ని మంత్రశక్తులను పొందుతాడు. జరగబోయే సంఘటనలు కొన్ని అతనికి ముందుగానే తెలుస్తుంటాయి. అస్సాంలో అడవీ ప్రాంతానికి దగ్గరలో ఉంటున్న 'మాధురి' కుటుంబం గురించి అతనికి తండ్రి చెబుతాడు. మాధురి (సోలంకీ రాయ్) ఆపదలో ఉందనీ, వెళ్లి కాపాడమని అంటాడు. ఒకప్పుడు మాధురి కుటుంబం భవతారణ్ ఇంటి పక్కనే ఉండేవారు. ఆ తరువాత వాళ్లు ఆ ఊరునుంచి వెళ్లిపోతారు. అప్పట్లోనే భవతారణ్ - మాధురి ఒకరిపట్ల ఒకరు ఆకర్షితులవుతారు.

తండ్రి మాట ప్రకారం భవతారణ్ అస్సాం అటవీ ప్రాంతంలోని మాధురి ఇంటికి చేరుకుంటాడు. మధురినీ చూడగానే, ఆమె ఒక దుష్ట శక్తిచేత పీడించబడుతోందనే విషయం అతనికి అర్థమవుతుంది. ఆమెకి 'అనీర్ బన్'తో వివాహం జరిగిందనీ, అతను ఏమైపోయాడనేది తెలియడం లేదని మాధురీ తల్లిదండ్రులు భవతారణ్ తో చెబుతారు. ఆ అడవి కూడా అనేక రహస్యాలతో కూడినదిగా భవతారణ్ కి అనిపిస్తుంది. అదే సమయంలో అతనికి 'పరాఖ్' అనే వ్యక్తి తారసపడతాడు. భవతారణ్ ని ఒక వృద్ధుడి దగ్గరికి తీసుకుని వెళతాడు. 

అడవి మధ్యలో ఒక భయంకరమైన గుహ ఉందనీ, ఆ గుహలో ఒక మాంత్రికురాలు 'కౌరిబురిదేవి'ని పూజిస్తుందని ఆ వ్యక్తి   భవతారణ్ తో చెబుతాడు. ఆ గుహలోనే 'గోలోక్ పుష్పం' ఉందనీ, విషానికి విరుగుడులా పనిచేసే ఆ పుష్పమే మాధురిని కాపాడగలుగుతుందని అంటాడు. అయితే ఆ పుష్పాన్ని అక్కడి నుంచి తీసుకురావడం అనుకున్నంత తేలిక కాదని  చెబుతాడు. అంతకంటే ముందుగా మాధురి భర్త ఆచూకీ తెలుసుకోవడం అవసరమని అంటాడు. ఆ మాంత్రికురాలు ఎవరు? ఆమె లక్ష్యం ఏమిటి? ఆ గుహలో నించి భవతారణ్ ఆ పుష్పాన్ని సంపాదించగలుగుతాడా? అనేది కథ.

 ఇది ఒక సూపర్ నేచురల్ థ్రిల్లర్. బెంగాలీ జానపద కథ ఆధారంగా రూపొందించబడిన సిరీస్. అది ఒక దట్టమైన అడవి .. ఆ అడవిలో ఒక భయంకరమైన గుహ .. ఆ గుహలో ఒక లక్ష్యాన్ని ఆశించి తాంత్రిక పూజలు చేసే మాంత్రికుడు .. అతని అధీనంలో ఒక మాయా పుష్పం .. ఎలాంటి వ్యాధినైనా నివారించి బ్రతికించగల శక్తి ఆ మాయా పుష్పానికి ఉంటుంది. మహారాజు ప్రాణాలను కాపాడటం కోసం బయల్దేరిన కథానాయకుడు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటాడు? అనే జానపద కథ చాలామందికి తెలిసిందే. అదే దారిలో అదే తీరుగా నడిచే కథ ఇది.

ఈ కథలో కథానాయకుడు తాను ఇష్టపడిన అమ్మాయిని క్షుద్రశక్తుల బారి నుంచి కాపాడటం కోసం రంగంలోకి దిగుతాడు. ఆ ప్రయత్నంలో తనకి ఎదురైన అవాంతరాలను అధిగమిస్తూ వెళతాడు. క్షుద్రపూజలు .. నరబలులు .. మంత్రించబడిన కాకులు .. రక్త స్పర్శ కారణంగా వికసించే మాయా పుష్పం .. వంటి అంశాలు ఈ సిరీస్ పై ఆసక్తిని పెంచుతూ వెళతాయి. రాత్రివేళలో అడవి నేపథ్యంలో సన్నివేశాలు మరింత ఉత్కంఠకు కారణమవుతాయి. 

అసలు 'కౌరిబురి' అమ్మవారు ఎవరు? అడవి నేపథ్యం .. దట్టమైన పొగ .. మంత్రించిన కాకుల గుంపులు ఎందుకోసం? వాటి వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటి? అనే ఒక సందేహం ప్రేక్షకులకు వస్తుంది. అందుకు ఇచ్చిన వివరణ కనెక్ట్ అవుతుంది. స్క్రీన్ పై అందుకు సంబంధించిన హడావిడినే కొంతవరకూ భయపడుతుంది.  

సాధారణంగా క్షుద్రపూజలు చేసేవారికి ఏదో ఒక లక్ష్యం అయితే ఉంటుంది. తమ శక్తిని పెంచుకోవడమే ప్రధానంగా కనిపిస్తుంది. కానీ ఈ కథలో క్షుద్రపూజలు చేసే మాంత్రికురాలి లక్ష్యం ప్రేక్షకులను కాస్త ఇబ్బంది పెడుతుంది. ఈ అంశం దగ్గరే ఈ కథ కాస్త పక్కకి వెళ్లినట్టుగా అనిపిస్తుంది. మరో అంశం ఏదైనా ఎంచుకుంటే బాగుండేది అనే అభిప్రాయం కలుగుతుంది. క్షుద్రశక్తులు ఆవహించడం .. అవి ఆవహించినవాళ్లు చిత్రంగా ప్రవర్తించడం గట్రా ఈ సిరీస్ లో కనిపించవు. అది కూడా కాస్త వెలితిగా అనిపించే అంశమే. 

ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం .. ఎడిటింగ్ ఫరవాలేదు. ప్రధానమైన పాత్రలను పోషించిన ఆర్టిస్టులంతా బాగానే చేశారు. ఇక ఈ తరహా కథలలో చివరికి వచ్చేసరికి దైవశక్తికి .. దుష్టశక్తికి మధ్య భీకరమైన పోరాటమే జరుగుతూ ఉంటుంది. ఒక రేంజ్ లో క్లైమాక్స్ ను డిజైన్ చేస్తుంటారు. కానీ ఈ సిరీస్ లో క్లైమాక్స్ చాలా సింపుల్ గానే సరిపెట్టారని చెప్పాలి. కొంతమందికి అది సహజంగా అనిపిస్తే, మరికొందరికి అసంతృప్తిని కలిగించే అవకాశం ఉంది.  

Series Details

Series Name: Kauriburi: The Cursed Temple

Genre: Thriller

Release Date: 6 Nov 2026

Cast: Jeetu Kamal, Solanki Roy, Paoli Dam, Saswata Chatterjee, Aniruddha Gupta

Director: Sayantan Ghosal

Music: Nabarun Bose

Banner: A Follow Focus Films

Review By: Peddinti

Kauriburi: The Cursed Temple Rating: 2 out of 5

Disclaimer: This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.

Trailer

Advertisement
Kauriburi: The Cursed TempleSayantan GhosalSayanthi Samaddar - SubhadeepJeetu KamalSolanki RoyPaoli DamSaswata ChatterjeeAniruddha Gupta

More Movie Reviews

'సీన్' - మూవీ రివ్యూ!

06 Nov, 14:09

'Summer Holidays Movie' Review

06 Nov, 11:59

'సమ్మర్‌ హాలిడేస్‌' మూవీ రివ్యూ

06 Nov, 11:44

Ramayana Part 1 Movie Review

05 Nov, 14:26

'రామాయణం - పార్టు 1' (మూవీ రివ్యూ)

05 Nov, 12:53

'ఇమ్మోర్టల్ ' (సోనీ లివ్) మూవీ రివ్యూ!

04 Nov, 13:38

'అక్క' (నెట్ ఫ్లిక్స్) సిరీస్ రివ్యూ!

03 Nov, 16:37

'రుద్రవనం పీఎస్' (జీ 5) సిరీస్ రివ్యూ!

02 Nov, 20:15

'Adarsha Kutumbam' Movie Review

30 Oct, 17:20
..More Movie Reviews