'సీన్' - మూవీ రివ్యూ!
Advertisement
Scene Review
సూర్య ఈ మధ్య కాలంలో చేసిన సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన మరో యాక్షన్ కామెడీ సినిమాను చేశాడు. ఆ సినిమా పేరే 'సీన్'. మలయాళంలో దర్శకుడిగా రచయితగా మంచి పేరు తెచ్చుకున్న జిత్తూ మాధవన్ ఈ సినిమాను తెరకెక్కించాడు. 'రోమాంఛమ్' .. 'ఆవేశం' వంటి భారీ విజయాలను అందించిన ఆయన నుంచి వచ్చిన సినిమా ఇది. నజ్రియా నజీమ్ .. నెస్లెన్ కీలకమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, ఈ రోజునే థియేటర్లలో విడుదలైంది.
ప్రేమ్ రాజ్ (సూర్య) ఒక పోలీస్ ఆఫీసర్. ఎలాంటి క్లిష్టమైన కేసులనైనా చాకచక్యంగా పరిష్కరించడం ఆయన ప్రత్యేకత. డిపార్టుమెంటులో చాలామంది ఆయనతో కలిసి పనిచేయడానికి ఆసక్తిని చూపుతుంటారు. 'విక్టర్' ( టోవినో థామస్) అనే ఒక 'పెర్ఫ్యూమ్ కిల్లర్'ను చట్టానికి పట్టించిన ఘనత ప్రేమ్ రాజ్ కి ఉంటుంది. జైల్లో శిక్షను అనుభవిస్తున్న విక్టర్, ఇప్పుడు ప్రేమ్ రాజ్ పై కోపంతో ఉంటాడు. ఈ నేపథ్యంలోనే తన జాబ్ కి రిజైన్ చేయాలని ప్రేమ్ రాజ్ నిర్ణయించుకుంటాడు. అతని కంటి చూపు ఎప్పటికప్పుడు తగ్గిపోతూ ఉండటమే అందుకు కారణమని తెలుసుకుని పై అధికారులు షాక్ అవుతారు.
ఈ నేపథ్యంలోనే సిటీలో వరుస హత్యలు జరుగుతూ ఉంటాయి. హంతకుడు ఎవరు? ఎందుకు హత్యలు చేస్తున్నాడు? అనేది అర్థం కాక పోలీసులు తలలు పట్టుకుంటారు. పోలీసులు పడుతున్న అవస్థలను చాటుగా గమనిస్తూ, ఈశ్వర్ (నెస్లెన్) ఎంజాయ్ చేస్తుంటాడు. అతను తన తల్లితో కలిసి హత్యలకు ప్లాన్ చేస్తుంటాడు. ఈ కేసును తానే సాల్వ్ చేయాలని ప్రేమ్ రాజ్ నిర్ణయించుకుంటాడు. అందుకోసం తన అసిస్టెంట్ గా 'మాయ' (నజ్రియా)ను నియమించుకుంటాడు.
ప్రేమ్ రాజ్ తండ్రి గతంలో ఫోరెన్సిక్ డిపార్టుమెంటులో పనిచేసి ఉంటాడు. కాకపోతే ప్రస్తుతం అతను మెమరీ లాస్ తో ఇబ్బందిపడుతూ ఉంటాడు. ఇక ప్రేమ్ రాజ్ తల్లి నేరస్థుల స్వభావంపై అధ్యయనం చేసి ఉంటుంది. కాకపోతే ఆమె కూడా మద్యానికి బానిసై తన వృత్తికి దూరంగా ఉంటుంది. కంటిచూపు లేని ప్రేమ్ రాజ్ తన పేరెంట్స్ .. మాయ సాయంతో హంతకుడిని ఎలా పట్టుకుంటాడు? ఆ ప్రయత్నంలో ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటాడు? అనేది మిగతా కథ.
ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా సూర్య ఇంతవరకూ చాలానే సినిమాలు చేశాడు. పోలీస్ ఆఫీసర్ గా తెరపై ఆయన ఎంతలా విజృంభిస్తాడనేది అందరికీ తెలిసిందే. ఈ సినిమాలోనూ అదే పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తాడు. కాకపోతే ఆయనకీ కంటి చూపు ఉండదు. కంటిచూపు కోల్పోయిన ఒక పోలీస్ ఆఫీసర్, ఒక కిల్లర్ ను ఎలా వెంటాడుతాడు? ఎలా పట్టుకుంటాడు? అనే అంశం చుట్టూ దర్శకుడు ఈ కథను అల్లుకుంటూ వెళ్లాడు.
ఈశ్వర్ తన తండ్రిని చంపి పూడ్చడంతోనే ఈ కథ మొదలవుతుంది. అతను తన తన తండ్రిని ఎందుకు చంపేసి ఉంటాడు? అనే ఒక సందేహం ఆడియన్స్ ను వెంటాడుతూ ఉంటుంది. ఇక మరో వైపున పోలీస్ ఆఫీసర్ ప్రేమ్ రాజ్ తనదైన స్టైల్లో కేసులను డీల్ చేస్తూ వెళుతుంటాడు. పోలీస్ ఆఫీసర్ .. హంతకుడు ఇద్దరూ ఎక్కడ ఏ సందర్భంలో ఎదురుపడతారు? అనే ఒక కుతూహలం ప్రేక్షకులను అలా వెయిట్ చేయిస్తూ ఉంటుంది.
చూపులేని ఒక పోలీస్ ఆఫీసర్ .. హంతకుడిగా మారిన ఒక తెలివైన కుర్రాడు మధ్య నడిచే దాగుడు మూతలు ఆసక్తికరంగానే ఉంటాయి. అలాగే చూపులేని పోలీస్ ఆఫీసర్ కి మాయ తాను చూపై ముందుకు నడిపించే సన్నివేశాలు కూడా ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తాయి. పోలీస్ ఆఫీసర్ కి చూపు ఉందో లేదో తెలుసుకోవడం కోసం వెళ్లిన హంతకుడు మాయ కంట్లో పడిపోవడం .. హంతకుడి తల్లిని వెంబడించడం .. ప్రేమ్ రాజ్ ను వెతుక్కుంటూ హంతకుడు నేరుగా అతని ఇంటికి రావడం .. వంటి సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.
ఓపెనింగ్ సీన్ తోనే ఉత్కంఠను రేకెత్తించినప్పటికీ, ఆ తరువాత కథనం చల్లబడుతూ .. చెప్పబడుతూ సాగుతుంది. ప్రీ క్లైమాక్స్ కి ముందు నుంచే కథ కాస్త పుంజుకుంటుంది. క్లైమాక్స్ దిశగా పరుగెడుతున్న సమయంలోనే రక్తి కట్టిస్తుంది. అప్పటివరకూ పోలీస్ ఆఫీసర్స్ అరుపులు .. కేకలతో ఆడియన్స్ కి కాస్త అసహనం తప్పదనే చెప్పాలి. కామెడీ కోసం అనుకున్నాడో ఏమో గానీ, ఆరంభంలో సూర్య .. లాల్ పాత్రలు గట్టిగా అరుస్తూ ఆడియన్స్ ను చిరాకుపెడతాయి.
ఇక సూర్య తల్లిదండ్రుల పాత్రల ద్వారా కామెడీని కాస్త గట్టిగానే పిండాలనే ఉద్దేశంతో దర్శకుడు ప్రయత్నించినట్టు కనిపిస్తుంది. కాకపోతే ఆ ప్రయత్నం వికటించిందనే చెప్పాలి. ఈ పాత్రలతో డిజైన్ చేసిన సన్నివేశాలు నవ్వించలేకపోగా ఇబ్బంది పెడతాయి. ఇక విక్టర్ పాత్రను సెకండ్ పార్ట్ కోసం వదిలేశారని అనుకోవాలి.
సూర్య .. నజ్రియా .. నెస్లెన్ నటన ఆకట్టుకుంటుంది. వినీత్ అగస్టీన్ ఫొటోగ్రఫీ .. సుశీన్ శ్యామ్ నేపథ్య సంగీతం .. అజ్మల్ సాబూ ఎడిటింగ్ ఫరవాలేదు. లవ్ .. రొమాన్స్ .. డ్యూయెట్లకు అవకాశం లేకపోవడం, ఎమోషన్స్ ను కలపకపోవడం పెద్ద లోపంగా అనిపిస్తుంది. చూపులేని ఒక పోలీస్ ఆఫీసర్ .. ఒక హంతకుడిని పట్టుకోవడానికి ఏం చేస్తాడు? అనే లైన్, అందుకు సంబంధించిన సెకండ్ పార్ట్ లోని కొన్ని సన్నివేశాల మినహా, ఈ సినిమా ఆకట్టుకోలేకపోయిందనే చెప్పాలి.

Movie Details
Movie Name: Scene
Genre: Action, Comedy
Release Date: 6 Nov 2026
Cast: Suriya, Naslen, Nazriya Nazim, Anandaraj, Lal
Director: Jithu Madhavan
Music: Sushin Shyam
Banner: 2D Entertainment
Review By: Peddinti
Scene Rating: 2 out of 5
Disclaimer: This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer
Advertisement