'వంద దేవుళ్ళు' మూవీ రివ్యూ
'బిచ్చగాడు' చిత్రంతో తెలుగులో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న తమిళ కథానాయకుడు విజయ్ ఆంటోని ఆ తరువాత పలు అనువాద చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించాడు. అయితే 'బిచ్చగాడు' స్థాయి విజయాన్ని మాత్రం అందుకోలేకపోయాడు. ఈ సారి 'బిచ్చగాడు' చిత్ర దర్శకుడు శశి దర్శకత్వంలో ఆయన నటించిన చిత్రం 'వంద దేవుళ్ళు'తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. బిచ్చగాడు తరహాలోనే ఈ చిత్రం కూడా అమ్మ కథాంశంతో కావడం విశేషం. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రంతో విజయ్ ఆంటోని విజయాన్ని అందుకున్నాడా? ఈ చిత్రంలోని అమ్మ సెంటిమెంట్ ఎంత వరకు వర్కవుట్ అయ్యింది అనేది రివ్యూలో తెలుసుకుందాం.
భర్త మరణంతో ఒంటరి మహిళగా సమాజంలో బ్రతుకుతూ తన పిల్లలకు తనే సర్వం అయ్యి పిల్లలను చదివించి, వారిని ఉన్నతస్థానంలో చూడాలని, అందుకోసం కూలీ పని చేస్తూ పిల్లలను పెంచుతుంది వాసవి (శ్వాసిక). సమాజంలో ఒక ఒంటరి మహిళ అనుభవించే అవమానాలు, కష్టాలు అన్నీ ఎదుర్కొంటూ పిల్లలను పెద్ద చదువులు చదివిస్తుంది. అయితే ఊర్లో భర్త లేని మహిళను ఇరుగు పొరుగు వారు చూసే పద్దతి, వారి అవమానపు మాటలు భరించలేక మళ్లీ పెళ్లి చేసుకుంటే ఈ సూటిపోటి మాటల నుంచి విముక్తి కలుగుతుందని భావిస్తుంది.
తమ టీచర్ ద్వారా తల్లి పెళ్లి ఆలోచన గురించి తెలుసుకున్న పెళ్లి వయసుకు వచ్చిన వాసవి పెద్ద కొడుకు అమ్మ నిర్ణయంపై ఎంతో మండిపడతాడు. చిన్న కొడుకు కూడా మొదట్లో తల్లి నిర్ణయాన్ని తప్పుబడతాడు. అసలు కొడుకులిద్దరూ అమ్మ నిర్ణయాన్ని ఎందుకు స్వాగతించలేదు. ఆ తరువాత అదే కొడుకులు అమ్మకు పెళ్లి చేయడానికి ఎంత తపనపడతారు? ఇందుకోసం వారి ప్రాణాలు తెగించి ఊరి పెద్దలతో ఎందుకు ఫైట్ చేశారు? వాసవికి, ఏడుకొండలు( విజయ్ ఆంటోని)కి పెళ్లి జరిగిందా? అనేది మిగతా కథ
భర్త చనిపోయిన తరువాత ఓ మహిళ అమ్మగా, ఒంటరిగా తన పిల్లలను ప్రయోజకులను చేయడానికి తను అంతా కోల్పోయి, తన జీవితాన్ని పణంగా పెట్టి పిల్లలను ప్రయోజకులను చేయడానికి అహర్నిశలు శ్రమిస్తుంటుంది. తనకు ఓ జీవితం ఉందనే విషయాన్ని మరిచిపోతుంది. ఇలాంటి ఓ కథాంశంతో అమ్మ కూడా ఓ మనిషే. ఆమెకు మనసుంటుంది. అది తెలియక ఆమె జీవితాన్ని కూడా మనమే బతికేయకూడదు అనే ఓ పర్పస్‌ఫుల్ కథతో, అమ్మ సెంటిమెంట్‌తో దర్శకుడు శశి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ప్రస్తుత సమాజంలో పల్లెటూర్లలో ఉన్న కట్టుబాట్లు, సంప్రాదాయం పేరిట ఉన్న ఇలాంటి విచిత్ర ధోరణుల కారణంతో ఎంతో మంది అమ్మల జీవితాలు ఆరంభ దశలోనే ముగిసిపోతున్నాయనే విషయాన్ని ఈ చిత్రంలో చూపించారు.
వాసవి జీవితంతో మొదలైన ఈ కథలో ఒంటరి మహిళగా ఆమె సమాజంలో పడే సంఘర్షణ, అమ్మ, కొడుకుల ప్రేమ ఇవన్నీకథను ముందుకు నడిపించాయి. పిల్లలు పెద్దవ్వడం, ఉద్యోగాలు, ప్రేమ, వీటితో పాటు వాసవికి మరో జీవితం ఇవ్వాలనే కొడుకుల ఆలోచన ఇవన్నీ ఆసక్తిగానే కొనసాగుతాయి. కథనం స్లోగా కొనసాగిన భావోద్వేగాలు పండటంతో ప్రేక్షకుడు కథలో లీనమవుతాడు. ప్రథమార్థం సాగదీసినట్లుగా, అక్కడక్కడా బోరింగ్ సన్నివేశాలతో ముగుస్తుంది. ఇక ద్వితీయార్థంలోనూ ప్రేక్షకుడి ఊహించిన కథే జరుగుతుందటంతో పెద్ద ఆసక్తికరంగా అనిపించదు. అయితే కథను నడిపిన విధానం, స్క్రీన్‌ప్లే ఆకట్టుకుంటుంది. వాసవి పెళ్లికి ఎదురయ్యే సమస్యలు, వాటిని కొడుకు వివేక్ ఎలా అధిగమించాడు? ఏడుకొండలు పాత్ర పరిచయం ఈ సన్నివేశాలన్నీ కథను ఇంట్రెస్టింగ్‌గా కొనసాగించేటట్లు చేశాయి.
ఏడుకొండలు పాత్రను డిజైన్ చేసిన విధానం అలరిస్తుంది. ఏడుకొండలు, వాసవి మధ్య సన్నివేశాలు క్యూట్‌గా, మనసుకు ఆహ్లాదంగా అనిపిస్తాయి.ఈ సినిమా చూస్తుంటే అందరికి తెలుగులో వచ్చిన 'మా నాన్నకి పెళ్లి' సినిమా గుర్తుకు వస్తుంది. అయితే ఆ చిత్రంలో కథ నాన్న పెళ్లి చుట్టూ అల్లుకుంటే ఈ సినిమాలో అమ్మ పెళ్లి నేపథ్యంతో కథ ఉంటుంది. అయితే ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు మళ్లీ మళ్లీ చూస్తున్న భావనను కలిగిస్తాయి. సాధారణంగా ఇలాంటి సినిమాల్లో పతాక సన్నివేశాలు పాఠాలు చెబుతున్నట్లుగా పేజీల కొద్ది పవర్‌ఫుల్ డైలాగులతో ఉంటాయి. కానీ ఈ సినిమాలో సింపుల్‌గా ఎంటర్‌టైన్‌మెంట్‌వేలో ముగించిన విధానం బాగుంది. అయితే రచన పరంగా ఈసినిమాను మరింత బలంగా రాసుకుని ఉంటే పూర్థిస్థాయిలో అలరించే అవకాశం ఉండేది.
వాసవి పాత్రలో శ్వాసిక నటన ఈ చిత్రానికి ప్రాణం. ఆమె నటన ఎంతో సహజంగా, భావోద్వేగంగా అనిపిస్తుంది.సంభాషణలకు మించి ఆమె హావాభావాల్లో చూపెట్టిన ప్రతిభ మెప్పిస్తుంది. ఏడుకొండలుగా విజయ్ ఆంటోని పాత్ర నిడివి తక్కువైనా తనదైన నటనతో అలరించాడు. కొడుకులుగా భాస్కర్, దీషన్ నటన పర్వాలేదు. కావ్య అనిల్, లిజోమోల్ జోస్, కరుణాస్, బాలాజీ శక్తివేల్ నటన గుర్తుండిపోతుంది. పాటలు, నేపథ్య సంగీతం కథను వేగంగా నడిపించడానికి దోహదపడ్డాయి. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ బాగానే కుదిరాయి. ఈ సినిమాలో సంభాషణలు కొన్ని గుర్తుండిపోతాయి. దర్శకుడు తను చెప్పాలనుకున్న అంశాన్ని నిజాయితీగా చెప్పే ప్రయత్నం చేశాడు.
'వంద దేవుళ్ళు' చిత్రాన్ని 'బిచ్చగాడు'ను దృష్టిలో పెట్టుకుని వెళితే ఈ సినిమా విషయంలో నిరాశపడతారు. నెమ్మదిగా సాగే కథనం, అక్కడక్కడా బోరింగ్ సన్నివేశాలను మినహాయిస్తే సెంటిమెంట్ సినిమాలు, కుటుంబ బావోద్వేగాల చిత్రాలను ఇష్టపడే వారిని ఈ సినిమా సంతృప్తి పరుస్తుంది.

Movie Details
Movie Name: Vanda Devullu
Release Date: 2026-06-19
Cast: Vijay Antony, Swasika, Ajay, Lijomol Jose, Kavya, Shakti, Padini, Karnas, Balaji Sakthivel, Divakar, Arul Dass, Bucks, Vinodhini, Munishkanth, Kodangi Vadivelu
Director: Shashi
Producer: Ramajanjaneyulu Javvaji
Music: Balaji Sri Ram
Banner: Vijay Antony Film Corporation, Sarvanth Ram Creations
Review By: Maduri Madhu
Trailer