'గత వైభవం'(అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ!
-
తెలుగు తెరకి పరిచయమైన కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్. తెలుగులో 'నా సామిరంగ' వంటి పెద్ద హిట్ ఆమె ఖాతాలో ఉంది. అలాంటి ఆషికా రంగనాథ్ కన్నడలో చేసిన సినిమానే 'గత వైభవ'. సునీ దర్శకత్వం వహించిన ఈ సినిమా, క్రితం ఏడాది నవంబర్ 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆషిక జోడీగా 'దుష్యంత్' మటించిన ఈ సినిమా, ఈ నెల 1వ తేదీ నుంచి 'అమెజాన్ ప్రైమ్'లో అందుబాటులోకి వచ్చింది.
పురాతన్ (దుష్యంత్) శ్రీమంతుల కుటుంబానికి చెందిన యువకుడు. విజువల్ ఎఫెక్ట్స్ కి సంబంధించిన ఒక స్టూడియోను అతను రన్ చేస్తూ ఉంటాడు. అతని తండ్రి ఒక సైక్రియాటిస్ట్. తండ్రీకొడుకులిద్దరూ స్నేహితుల మాదిరిగా ఉంటూ ఉంటారు. ఒక రోజున ఎవరో తన పెయింటింగ్ ను గీసి సోషల్ మీడియాలో పెట్టడం అతను చూస్తాడు. ఆధునిక (ఆషికా రంగనాథ్) మదిలో తరచూ మెదులుతున్న రూపం అది. దాంతో అతను 'కూర్గ్' వెళ్లి ఆమెను కలుసుకుంటాడు.
'ఆధునిక' అందం దుష్యంత్ ను ముగ్ధుడిని చేస్తుంది. తన రూపాన్ని గీయడానికి కారణం ఏమిటని అతను ఆమెను అడుగుతాడు. తమది జన్మజన్మల ప్రేమ అని ఆమె చెబుతుంది. గత జన్మలలో రెండుమార్లు తాము కలుసుకున్నామనీ, ప్రేమించుకున్నామని అంటుంది. ఇప్పుడు మూడోసారి ఎదురుపడ్డామని చెబుతుంది. మొదటి జన్మలో తాను దేవకన్యననీ, అతను అసురుడనే విషయం చెబుతుంది.
రెండో జన్మలో అతను పల్లెటూరి మొనగాడైన శ్రీనివాసన్ అనీ, అతని ప్రియురాలిగా ఉన్న తన పేరు 'మంగళ' అని చెబుతుంది. తన సోదరుడు 'అనామదేవుడు' తమకి ఇచ్చిన శాపాన్ని గురించి గుర్తుచేస్తుంది. ఆధునిక చెప్పిన ప్రకారం గత జన్మలలో ఏం జరిగింది? ఆమె సోదరుడు ఇచ్చిన శాపం ఏమిటి? పునర్జన్మలు .. ప్రేమలను గురించి 'పురాతన్' నమ్ముతాడా? ఈ జన్మలోనైనా వారి ప్రేమ ఫలిస్తుందా? అనేది మిగతా కథ.
ఒకప్పుడు పునర్జన్మల నేపథ్యంలో చాలానే సినిమాలు వచ్చాయి. పూర్వ జన్మలో ప్రేమించుకోవడం .. ఆ తరువాత జన్మలో ఆ ప్రేమ కొనసాగడం వంటి కథలకు అప్పట్లో లభించిన ఆదరణ కూడా చాలా ఎక్కువ. అయితే ఈ మధ్య కాలంలో మాత్రం ఈ తరహా కథలు చాలా వరకు తగ్గిపోయాయి. చాలా గ్యాప్ తరువాత పునర్జన్మల నేపథ్యంలో వచ్చిన సినిమాగా 'గత వైభవం' గురించి చెప్పుకోవచ్చు. ఈ కథ మొత్తం నాలుగు ఎపిసోడ్స్ గా తెరపై కనిపిస్తుంది.
ఒక వైపున క్షీరసాగర మథనం .. మరో వైపున అసురుడిని దేవకన్య ప్రేమించడం మొదటి ఎపిసోడ్ గా వస్తుంది. ఈ నేపథ్యం కోసం వేసిన సెట్ బాగుంది. కానీ స్కూల్ పిల్లల కోసం ప్రదర్శించే స్టేజ్ నాటకాన్ని తలపిస్తుంది. ఆ తరువాత ఎపిసోడ్ పోర్చుగల్ - షిప్పు అంటూ కొనసాగుతుంది. సముద్రం నేపథ్యంలో .. షిప్పులో నడిచే కథ ఇది. సిల్లీ కామెడీతో ఈ ఎపిసోడ్ కూడా ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది.
ఇక మూడో ఎపిసోడ్ విలేజ్ నేపథ్యంలో .. 'అణాలు'.. 'కాణీలు' కాలంలో నడుస్తుంది. హీరో - హీరోయిన్ శ్రీనివాసన్ - మంగళ పేర్లతో కనిపిస్తారు. నేపథ్యం ఆసక్తికరంగానే అనిపిస్తుంది గానీ, ఇక్కడ కూడా అంత బలమైన కథేమీ కనిపించదు. ఇక ప్రస్తుత కాలానికి వస్తే, ఇక్కడైనా ఆడియన్స్ ఆశించే అంశాలు ఏమైనా ఉంటాయేమోనని అనుకుంటే, అలాంటివేమీ ఉండవనే చెప్పేశారు.
ఏ ఎపిసోడ్ చూసినా ఏమున్నది ప్రయోజనం? ఎక్కడా కూడా లవ్ .. రొమాన్స్ .. ఎమోషన్ జాడలేదే అని అనుకోకుండా ఉండలేం. చివరి సమయంలో అటు హీరోను .. ఇటు హీరోయిన్ ను ఉరుకులు పరుగులు పెట్టించి ఆడియన్స్ ను మరింత కంగారు పెట్టేసి కన్ఫ్యూజ్ చేశారు. అసలు ఉన్న కథనే అంతంత మాత్రం అనుకుంటే, అది కాస్తా అర్థం కాకుండా చేసేసి .. ఆలోచనలో పడేసి బయటికి పంపించేస్తారు.
విలియం డేవిడ్ ఫొటోగ్రఫీ బాగుంది. దేవలోకం సెట్ .. లైటింగ్ బాగున్నాయి. అలాగే విలేజ్ నేపథ్యంలో సీన్స్ చిత్రీకరణ కూడా ఆకట్టుకుంటుంది. శాండీ నేపథ్య సంగీతం ఫరవాలేదు. ఆశిక్ ఎడిటింగ్ ఓకే. హీరో యాక్టింగ్ గొప్పగా ఏమీ అనిపించదు. ఆషికా మాత్రం అందంగా మెరుస్తూ ప్రధానమైన ఆకర్షణగా నిలిచిందనే చెప్పాలి. ఈ రెండూ తప్పించి చెప్పుకోదగిన పాత్ర మరొకరి లేదంటే అర్థం చేసుకోవచ్చు.
ఒక సాధారణమైన విషయానికి సంబంధించిన కథనే చాలా బలంగా ఉండాలి. అదే పునర్జన్మల నేపథ్యం .. అందునా ప్రేమ ప్రాధాన్యత కలిగిన పునర్జన్మలను గురించి చెప్పాలంటే ఆ కథ మరింత బలంగా ఉండాలి. ఇంతటి బలమైన కారణం ఉండటం వల్లనే పునర్జన్మలోను ఆ బంధం కంటిన్యూ అయిందనే ఫీలింగ్ కలగాలి. ఆడియన్స్ కి అలా అనిపించాలంటే కంటెంట్ పై గట్టి కసరత్తు జరగాలి. ఈ సినిమాను చూస్తుంటే ఇవేవీ పెద్దగా పట్టించుకున్నట్టుగా అనిపించదు మరి. కథా పరంగా చూసుకుంటే, గతమంతా విషాదంతో నిండిన ఈ సినిమాకి, 'గత వైభవం' అనే టైటిల్ పెట్టడమే విస్మయులను చేసే విషయంగా చెప్పుకోవాలి.

Movie Details
Movie Name: Gatha Vaibhavam
Release Date: 2026-02-01
Cast: Ashika Ranganath,Dushyanth,Kishen Bilagali,Sudha Belawadi
Director: Suni
Producer: Deepak Thimmappa
Music: Judah Sandhy
Banner: Servegara Silver Screens
Review By: Peddinti
Trailer