'ఆస్పిరెంట్స్ 2' (అమెజాన్ ప్రైమ్) వెబ్ సిరీస్ రివ్యూ

Aspirants 2

Movie Name: Aspirants 2

Release Date: 2023-10-25
Cast: Naveen Kasturia, Shivankit Singh Parihar, Abhilash Thapliyal, Sunny Hinduja, Namita Dubey
Director:Apoorv Singh Karki
Producer: Arunabh Kumar
Music: Sangeeth- Siddharth
Banner: TVF Creation
Rating: 2.75 out of 5
  • నిన్నటి నుంచి 'ఆస్పిరెంట్స్ 2' స్ట్రీమింగ్
  • ఎంచుకున్న కంటెంట్ కి న్యాయం చేసిన దర్శకుడు  
  • కంటెంట్ లో మిస్సయిన ఎంటర్టైన్ మెంట్ 
  • కథాకథనాల్లో కనిపించని స్పీడ్ 
  • ఎక్కడా పలకరించని ట్విస్టులు 

జీవితంలో ఏదైనా సాధించాలంటే అందుకోసం తలపెట్టిన పనిని తపస్సులా చేయాలి. అనుకున్నది సాధించడం కోసం ఎన్నింటినో త్యాగం చేయాలి. ఆర్ధికపరమైన .. ఆరోగ్యపరమైన ఇబ్బందులను అధిగమిస్తూ ముందుకు వెళ్లవలసి ఉంటుంది. అంత కష్టపడి అనుకున్నది సాధించిన తరువాత, అపనిందలు పాలైతే .. తాను మంచి చేయాలనుకున్నవారే తనకి చెడు తలపెడితే ఎలా వుంటుంది? అనే కంటెంట్ తో వచ్చిన సిరీస్ 'ఆస్పిరెంట్స్ 2'. క్రితం ఏడాది అమెజాన్ ప్రైమ్ లో ఫస్టు సీజన్ స్ట్రీమింగ్ కాగా, సెకండ్ సీజన్ నిన్నటి నుంచి అందుబాటులోకి వచ్చింది. 

ఈ కథ 'ఢిల్లీ'లోని రాజేంద్ర నగర్ లోను .. ఉత్తరప్రదేశ్ లోని 'రామ్ పూర్' లోను నడుస్తుంది. అభిలాష్ (నవీన్ కస్తూరియా) గురుప్రీత్ ( శివాంకిత్ సింగ్) ఎస్.కె. (అభిలాష్) ముగ్గురూ కూడా మంచి స్నేహితులు. ఈ ముగ్గురితోను సందీప్ (సన్నీ హిందూజా) చాలా సన్నిహితంగా ఉంటాడు. అభిలాష్ తాను ఎలాగైనా ఐఏఎస్ ను సాధించాలనే పట్టుదలతో ఉంటాడు. అందుకోసం ఎన్నో కష్టాలు పడతాడు. అదే ఆశయం ఉన్నప్పటికీ, అతని స్థాయిలో గురుప్రీత్ - ఎస్.కె. మనసు పెట్టలేకపోతారు. 

ఐఏఎస్ కి సంబంధించిన కోచింగ్ తీసుకుంటున్న సమయంలోనే అభిలాష్ కి 'దీప'తో పరిచయమవుతుంది. అతనిని ప్రేమిస్తున్నట్టుగా ఆమె చెబుతుంది. అయితే అభిలాష్ తాను అనుకున్న గమ్యానికి చేరుకోవాలనే ఉద్దేశంతో ఆ పరిచయాన్ని స్నేహం దగ్గరే ఉంచేస్తాడు. అతను ఐఏఎస్ ను సాధించి, కొంతకాలం తరువాత 'రామ్ పూర్' జిల్లాకి ఉన్నతాధికారిగా వస్తాడు. అప్పటికే గురుప్రీత్ కి 'ధైర్య'తో పెళ్లవుతుంది. అతను ఓ షూ కంపెనీని నిర్వహిస్తూ ఉంటాడు. ఇక ఎస్.కె. ఓ కోచింగ్ సెంటర్ లో పనిచేస్తూ ఉంటాడు. సందీప్ అసిస్టెంట్ లేబర్ కమిషనర్ గా పనిచేస్తూ ఉంటాడు.

 'రాంపూర్'లోని ఒక ఫ్యాక్టరీలో యాజమాన్యానికీ .. కార్మికులకు మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి. ఫ్యాక్టరీ యజమాని దయానిధి జోషికీ .. సందీప్ కి మధ్య అంతరం ఉంటుంది. అందువలన అక్కడి గొడవలను పరిష్కరించే ప్రయత్నం చేయకుండా సందీప్ ఉండిపోతాడు. ఈ విషయంలో పై అధికారిగా అభిలాష్ యాక్షన్ తీసుకుంటాడు. దాంతో ఆ ఇద్దరి మధ్య స్నేహం దెబ్బతింటుంది. తన బిజినెస్ విషయంలో మాట సాయం చేయనందుకు అభిలాష్ పై గురుప్రీత్ కోపంగా ఉంటాడు. అలాగే తన కోచింగ్ సెంటర్ సెమినార్ కి రానందుకు గాను అభిలాష్ పట్ల ఎస్.కె. కూడా అసహనంతో ఉంటాడు. ఒక వైపున తాను న్యాయం చేయవలసిన ప్రజలు ... మరో వైపున తన విషయంలో అసంతృప్తితో ఉన్న స్నేహితులు. అలాంటి పరిస్థితుల్లో అభిలాష్ ఏం చేస్తాడు? మంచి చేయడానికి ఆయన చేసిన ప్రయత్నాలకు ఎలాంటి మూల్యం దక్కింది? అనేది అసలు కథ.                  
 
అరుణభ్ కుమార్ - దీపేశ్ సుమిత్ర జగదీశ్ ఈ సిరీస్ ను క్రియేట్ చేశారు. అశుతోష్ పంకజ్ - దీపేశ్ సుమిత్ర ఈ కథను అందించగా, అపూర్వ్ సింగ్ కార్కి దర్శకత్వం వహించాడు. దర్శకుడు ఈ కథను ఆవిష్కరించిన తీరు ఒక పుస్తకం చదువుతున్నట్టుగా ఉంటుంది. సిరీస్ కి సంబంధించిన .. సినిమాకి సంబంధించిన మలుపులు .. ట్విస్టులు .. లవ్ .. రొమాన్స్ వంటివి ఎక్కడా కనిపించవు. అసలు ఆ దిశగా కథను తీసుకుని వెళ్లే ప్రయత్నం దర్శకుడు చేసినట్టుగా అనిపించదు. 

అభిలాష్ ఐఏఎస్ కావడానికి పడిన పాట్లు .. అధికారానికీ ... స్నేహితులకి మధ్య నలిగిపోయిన తీరును మాత్రమే దర్శకుడు సీరియస్ గా చెప్పుకుంటూ వెళ్లాడు. ప్రధానమైన పాత్రల మధ్య, వీలైతే కలిసి .. లేదంటే ఇద్దరేసి చొప్పున కబుర్లు చెప్పుకుంటూ ఉండటంతోనే  ఈ కథ అంతా నడుస్తుంది. ఎక్కడా కూడా .. ఏ పాత్ర కూడా యాక్టివ్ గా కనిపించదు. ఏం జరుగుతుందా? అనే ఆసక్తికి అసలు అవకాశమే లేకుండాపోయింది. 

దర్శకుడు ఉన్న కంటెంట్ ను పెర్ఫెక్ట్ గా ఆవిష్కరించాడు. ఒక జిల్లా అధికారికి ఉండవలసిన అధికారాలు .. సమస్యలు .. వాటిని పరిష్కరించడానికి అతనుపడే కష్టాలు .. టెండర్లు .. ఫ్యాక్టరీలు .. పై స్థాయి నుంచి వచ్చే ఒత్తిళ్లు ఇవన్నీ చూపిస్తూ వెళ్లారు. నిజానికి ఇవేవీ ఎంటర్టైన్ మెంట్ ను అందించేవి కావు. ఒక జిల్లా అధికారి అధికారాలు ... ఆయన నిర్ణయాలు .. చర్యలు .. వృత్తిపరమైన టెన్షన్స్ ఆడియన్స్ కి ఆసక్తిని కలిగించేవి కాదు. 

మంచికి పోతే  చెడు ఎదురైందన్నట్టుగా చివరో ట్విస్టు ఉంటుంది. ఆ ట్విస్ట్ కోసం అప్పటి వరకూ ప్రేక్షకులు వెయిట్ చేయడం కష్టమే. ఇక ఫ్లాష్ బ్యాక్ ను .. ప్రస్తుతానికి సంబంధించిన కథను పక్క పక్కనే చూపిస్తూ రావడం కూడా సాధారణ ప్రేక్షకులను అయోమయానికి గురిచేస్తుంది. ప్రధానమైన పాత్రను పోషించిన నవీన్ కస్తూరియా, ఐఏఎస్ ఆఫీసర్ అయిన తరువాత ఓకే. కానీ యంగ్ రోల్ కి ఆయన సెట్ కాలేదు. 

నటన పరంగా ఎవరికీ వంక బెట్టనవసరం లేదు. అందరూ కూడా చాలా నేచురల్ గా చేశారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. ఫొటోగ్రఫీ .. ఎడిటింగ్ కూడా కంటెంట్ కి తగినట్టుగానే ఉన్నాయి. సన్నివేశాలను సహజత్వంతో ఆవిష్కరించడానికి దర్శకుడు తవంతు కష్టపడ్డాడు. కానీ ప్రేక్షకులు కోరుకునే ప్రధాన అంశమైన ఎంటర్టైన్మెంట్ మిస్సయింది. ఇక్కడే ప్రేక్షకుడు అసంతృప్తికి లోనవుతాడు. ఈ జనరేషన్ కి తగిన స్పీడ్ కథనంలో లేకపోవడం మరో మైనస్ గా భావిస్తాడు. 

Trailer

More Reviews