amazon: అమెజాన్​ గ్రేట్​ సమ్మర్​ సేల్.. ఎప్పుడు మొదలవుతుందంటే..!

  • మే 2వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నట్టు అమెజాన్ వెల్లడి
  • వెల్ కమ్ రివార్డ్స్, ప్రీబుకింగ్ వంటి ఆఫర్లు ఉన్నట్టు వెబ్ సైట్లో ప్రకటన
  • ‘బిగ్ సేవింగ్స్ డేస్’ పేరిట మే 3 నుంచి ప్రత్యేక సేల్ చేపడుతున్నట్టు ఫ్లిప్ కార్ట్ వెల్లడి
amazon great summer sale starts from may 2

వేసవి నేపథ్యంలో ఆన్ లైన్ ఈ కామర్స్ సంస్థల డిస్కౌంట్లు, ఆఫర్ల జాతర మొదలైంది. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ ప్రత్యేకంగా ‘గ్రేట్ సమ్మర్ సేల్’ను ప్రకటించింది. మే 2వ తేదీ నుంచి ఇది మొదలుకానున్నట్టు తమ వెబ్ సైట్, యాప్ లో వెల్లడించింది. అయితే ఎప్పటివరకు ఈ సేల్ కొనసాగుతుందన్నది ఇంకా తెలపలేదు.

ప్రైమ్ మెంబర్లకు ముందుగా అంటూ..

  • అమెజాన్ తమ గ్రేట్ సమ్మర్ సేల్ ఆఫర్లు అమెజాన్ ప్రైమ్‌ సబ్ స్క్రైబర్లకు మే 1వ తేదీ అర్థరాత్రి 12 గంటల నుంచే అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ సేల్‌లో ఐసీఐసీఐ బ్యాంక్‌, వన్‌ కార్డ్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా డెబిట్‌కార్డు/ క్రెడిట్‌కార్డులపై 10 శాతం డిస్కౌంట్‌ ఉంటుందని వెల్లడించింది.
  • సేల్‌ సమయంలో వినియోగదారులు చేసే మొదటి ఆర్డర్ ను ఫ్రీగా డెలివరీ చేస్తామని.. వెల్‌కమ్‌ రివార్డ్‌ పేరిట 20 శాతం క్యాష్‌ బ్యాక్‌ కూడా ఇస్తామని వెబ్ సైట్ లో పేర్కొంది.
  • కొన్ని రకాల ప్రొడక్టుల శాంపిళ్లను కేవలం ఒక్క రూపాయికే అందించనున్నట్టు అమెజాన్ పేర్కొంది. ‘ట్రై బిఫోర్ యు బై @ 1’ పేరిట ఈ ఆఫర్ ను పేర్కొంది.
  • ఆఫర్ పై అందించే ఉత్పత్తులను ముందే బుక్ చేసుకునేందుకు ‘ప్రీ బుక్’ ఆఫర్ ను కూడా అందించనున్నట్టు తెలిపింది.

మరోవైపు ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ కూడా తరచూ నిర్వహించే ‘బిగ్ సేవింగ్స్ డేస్’ సేల్ తేదీలను ప్రకటించింది.  మే 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఈ సేల్ కొనసాగుతుందని తమ వెబ్ సైట్, యాప్ లలో వెల్లడించింది.

More Telugu News