TS Intermediate Results: తెలంగాణ ఇంట‌ర్మీడియ‌ట్ ఫ‌లితాల విడుద‌ల‌

  • ఫ‌స్ట్ ఇయ‌ర్‌లో 2.87 ల‌క్ష‌ల మంది ఉత్తీర్ణ‌త‌
  • సెకండ్ ఇయ‌ర్‌లో 3.22 ల‌క్ష‌ల మంది పాస్‌
  • ప్ర‌థ‌మ సంవ‌త్స‌రంలో 60.01 శాతం ఉత్తీర్ణ‌త న‌మోదు
  • ద్వితీయ సంవ‌త్స‌రంలో 64.18 శాతం మంది ఉత్తీర్ణ‌త
Telangana Intermediate Results announced

తెలంగాణ ఇంట‌ర్మీడియ‌ట్ ఫ‌లితాలు విడుద‌ల‌య్యాయి. ఫ‌స్ట్ ఇయ‌ర్‌లో 2.87 ల‌క్ష‌ల మంది, సెకండ్ ఇయ‌ర్‌లో 3.22 ల‌క్ష‌ల మంది పాస‌య్యారు. ప్ర‌థ‌మ సంవ‌త్స‌రంలో 60.01 శాతం, ద్వితీయ సంవ‌త్స‌రంలో 64.18 శాతం మంది ఉత్తీర్ణ‌త సాధించారు. ఫ‌స్ట్ ఇయ‌ర్‌లో బాలిక‌లు 68.35 శాతం, బాలురు 51.05 శాతం మంది ఉత్తీర్ణుల‌య్యారు. ఇక ద్వితీయ సంవ‌త్స‌రంలో బాలిక‌లు 72.53 శాతం, బాలురు 56.01 శాతం మంది పాస‌య్యారు. 

ఫ‌స్ట్ ఇయ‌ర్‌లో రంగారెడ్డి జిల్లా 71.07 శాతంతో మొద‌టి స్థానంలో ఉండ‌గా, సెకండ్ ఇయ‌ర్‌లో ములుగు 82.95 శాతంతో తొలి స్థానంలో నిలిచింది. ఇక ఈ ఏడాది దాదాపు 9.80 ల‌క్ష‌ల మంది విద్యార్థులు ఇంట‌ర్ ప‌రీక్ష‌లు రాశారు. ఇందులో 4.78 ల‌క్ష‌ల మంది ప్ర‌థ‌మ సంవ‌త్స‌రం విద్యార్థులు ఉంటే.. 4 ల‌క్ష‌ల‌కు పైగా ద్వితీయ సంవ‌త్స‌రం స్టూడెంట్స్ ఉన్నారు.

More Telugu News