టీటీకే ప్రెస్టీజ్ వార్షిక 'ఏదాని కోసం ఏదైనా' ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో మీ వంటగదిని అప్‌గ్రేడ్ చేయండి

Related image

హైదరాబాద్, 29th ఏప్రిల్ 2024: అత్యంత విశ్వసనీయమైన మరియు ప్రముఖ కిచెన్ ఉపకరణాల బ్రాండ్ అయిన ప్రెస్టీజ్   చాలా కాలంగా అంతా ఎంతగానో ఎదురుచూస్తున్న "ఏదాని కోసం ఏదైనా" (ఎనీథింగ్ ఫర్ ఎనీథింగ్) ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో తిరిగి వచ్చింది. వివిధ ప్రెస్టీజ్ ఉత్పత్తుల కోసం ఎమ్మార్పీపై 24 శాతం నుండి 65 శాతం వరకు తగ్గింపుతో ఈ ఆకర్షణీయమైన ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను పొందేందుకు కస్టమర్‌లు తమ పాత వంట సామాను లేదా వంటగది ఉపకరణాలను తీసుకుని వచ్చి వాటిని మార్పిడి చేసుకోవచ్చు. మరే ఇతర ప్రచా రానికి భిన్నంగా, ఏ  బ్రాండ్ కు చెందినదైనా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నదైనా సరే, వంటగది పాత ఉపకర ణాన్ని ప్రెస్టీజ్ తాజా వినూత్న ఉత్పత్తులతో మార్పిడి చేసుకోవడానికి ఎనీథింగ్ ఫర్ ఎనీథింగ్ ఎక్స్ఛేంజ్ ప్రచారం వినియోగదారులకు వీలు కల్పిస్తుంది. ఆఫర్ ఏప్రిల్ 16న ప్రారంభమైంది మరియు జూన్ 30, 2024 వరకు కొనసాగుతుంది.

వినూత్నతల పట్ల ప్రెస్టీజ్ అంకితభావం అందరికీ తెలిసిందే. ప్రతి ఉత్పత్తి అధునాతనమైన, ఆధునిక సాంకే తికతతో రూపొందించబడింది. ఇంట్లో వంట చేసేవారికి శుభ్రమైన, ఒత్తిడి లేని, సౌకర్యవంతమైన వంట అ నుభవాన్ని అందిస్తుంది. ‘ఎనీథింగ్ ఫర్ ఎనీథింగ్’ ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో, వినియోగదారులు ప్రెస్టీజ్ సరికొత్త ఆ విష్కరణలతో తమ వంటగదిని అప్‌గ్రేడ్ చేసుకునే అద్భుతమైన అవకాశాన్ని పొందుతారు.

 ప్రెస్టీజ్ తన అన్ని ఉత్పత్తి విభాగాలలో గణనీయమైన తగ్గింపును అందిస్తోంది. వీటిలో వినూత్న లిడ్-లాక్ మెకానిజం, ట్రిప్లై అవుటర్ లిడ్ తో కూడిన ఫ్లిప్-ఆన్ స్వచ్ ప్రెజర్ కుక్కర్ శ్రేణి మరియు స్పిలేజ్ కంట్రోల్ లిడ్ డిజైన్ తో  కూడిన ఇన్నర్ లిడ్ శ్రేణి ఉన్నాయి.  వీపీఐ, ఎస్ఎస్ డి మొదలైన అదనపు భద్రతా ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అలాగే, సులభంగా శుభ్రం చేయగల డిజైన్ మరియు ఎత్తగలిగే బర్నర్ ఫీచర్లతో విప్లవాత్మకమైన గ్యాస్ స్టవ్‌ల స్వచ్చ్ శ్రేణిపై ఆఫర్ కూడా ఉంది.

వినియోగదారులకు వారి వంటగది అవసరాలను ఎన్నకునేట ప్పుడు మరొక ముఖ్యమైన అంశం మన్ని కైన నాన్-స్టిక్ వంటసామాను. ఈ బ్రాండ్ నూతనంగా ఆవిష్కరించిన సిరామిక్ కోటెడ్ కుక్ వేర్ ను కలిగిఉంది. ఇది తక్కువ నూనె వినియోగాన్ని ప్రోత్సహించేలా డ్యూరబుల్ సిరామిక్ నాన్-స్టిక్ కోటింగ్ ను కలిగిఉంటుంది. సమానంగా వేడిని పంపిణి చేసేందుకు వీలు కల్పించే డ్యూరబుల్ మూడు లేయర్ల బాడీని కలిగిఉండే ట్రిప్లై కుక్ వేర్ కూడా ఉంది.  గ్లాస్ మూతతో కూడిన కడాయి, దోసతావా, ఫ్రై పాన్ మరియు మరిన్ని ఉంటాయి.

ఇండియన్ మెనూ ఆప్షన్‌లతో కూడిన ప్రత్యేకమైన ఇండక్షన్ కుక్‌టాప్‌  బ్రాండ్ యొక్క కావాల్సిన శ్రేణిలో ఉంటుంది. దీంతో పాటుగా ఆటోమేటిక్ ప్రెజర్ కుక్కర్ విజిల్ కౌంటర్, వాటి ఆల్ ఇన్ వన్ ఎండ్యూరా మిక్సర్ గ్రైండర్‌లు, 14 విభిన్న కార్యాచరణలను కవర్ చేయడం వంటివి కూడా ఎనీథింగ్ ఫర్ ఎనీథింగ్ ఆఫర్‌లో చేర్చబడ్డాయి. ఈ రెండు విభాగాలలోని ఉత్పత్తుల ప్రత్యేకమైన, అనుకూలమైన వినూత్న లక్షణా లు వాటిని ప్రతి విని యోగదారు ఇష్టపడే ఎంపికగా చేస్తాయి. అదనంగా, ప్రెస్టీజ్ యొక్క భారతదేశపు మొట్టమొదటి వినూత్న సేఫ్-సెన్స్ చిమ్నీలు, గ్యాస్-లీక్ మరియు స్మోక్ డిటెక్షన్ టెక్నాలజీని కలిగి ఉంటాయి, ఇవి కూడా సాటి లేని ధరకు అందుబాటులో ఉన్నాయి.

టీటీకే ప్రెస్టీజ్ లిమిటెడ్ చీఫ్ సేల్స్ & మార్కెటింగ్ ఆఫీసర్ శ్రీ అనిల్ గుర్నానీ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘‘ప్రెస్టీజ్‌లో, మా కస్టమర్ అవసరాలకు అనుగుణంగా ప్రత్యేకమైన ఉత్పత్తులు, ఆవిష్కరణలతో పరిష్కార-ఆధారిత విధా నాన్ని అందించడానికి మేము కట్టుబడి ఉన్నాం.   మన్నికైన వంటసామాను, శుభ్రమైన ఉపక రణాలు లేదా అత్యాధునిక సాంకేతికతతో నడిచే ఉత్పత్తులు ...ఏవి అయినా సరే... గృహిణులను వారి వంటగది అనుభవాన్ని అప్‌గ్రేడ్ చేయాల్సిందిగా మేం ప్రోత్సహిస్తాం. మా కస్టమర్లు బ్రాండ్‌కు విధేయులుగా ఉన్నారు. ఈ ఆఫర్ ద్వారా, మేం వారికి మేం వారితో నిర్మించుకున్న అనుబంధాన్ని వేడుక చేసుకోవడాని కి ఆకర్షణీయమైన డీల్స్ ద్వారా ఉత్తమమైన ఉత్పత్తులను అందించాలనుకుంటున్నాం’’ అని అన్నారు.

ఎన్నో విశిష్టతలతో, పటిష్టమైన, అధిక-పనితీరు, సహేతుక ధర కలిగిన ఉత్పత్తుల ఎంపిక, తన తక్షణ మరియు స్పందించే విక్రయానంతర సేవ  ద్వారా భారతదేశ  అత్యంత విశ్వసనీయమైన, మంచి బ్రాండ్‌ల లో ప్రెస్టీజ్ ఒకటి. ప్రెస్టీజ్ ద్వారా ఉత్పత్తి చేయబడిన ప్రతి వస్తువు చాలా శ్రద్ధతో ఆలోచనాత్మకంగా తయారు చేయబడుతుంది, మన్నికైనది, సరసమైనది మరియు అద్భుతంగా రూపొందించబడింది.

 
టిటికె ప్రెస్టీజ్ లిమిటెడ్ అనేది టీటీకే గ్రూప్ లో భాగం. గత ఆరు దశాబ్దాలుగా టిటికె ప్రెస్టీజ్ లిమిటెడ్ భారతదేశ అతి పెద్ద వంటింటి ఉపకరణాల కంపెనీగా ఎదిగింది. గృహిణుల అవసరాలను తీరుస్తోంది. ప్రెస్టీజ్ బ్రాండ్ ప్రతీ ఉత్పాదన కూడా లక్షలాది ఇళ్లలో మొదటి ఎంపికగా ఉంటోంది. ఈ సంస్థ యూకేకు చెందిన హార్వుడ్ హోమ్ వేర్స్ ను కొను గోలు చేసింది మరియు 2017 ఆగస్టులో భారతదేశంలో జడ్జ్ బ్రాండ్ ను ఆవిష్కరించింది.

More Press Releases