BJP: మోదీ హయాంలో 51.40 కోట్ల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాయి: స్కోచ్ నివేదిక

SKOCH report on employement in PM Modi ten year
  • మోదీ ప్రభుత్వం సంస్కరణలతో 19.79 కోట్ల మందికి ప్రత్యక్ష ఉపాధి లభించిందని వెల్లడి
  • మోదీ కాలంలో 31.61 మంది ప్రభుత్వ పథకాల ద్వారా రుణ సదుపాయంతో ఉపాధి పొందారని వెల్లడి
  • సగటున ఏడాదికి 5 కోట్ల మందికి పైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందినట్లు వెల్లడి

2014 నుంచి 2024 వరకు పదేళ్ల నరేంద్ర మోదీ పాలనలో 51.40 కోట్ల మందికి ఉపాధి లభించినట్లు స్కోచ్ సంస్థ 'మోదీ నోమిక్స్' పేరిట నివేదికను విడుదల చేసింది. మోదీ ప్రభుత్వం చేసిన వివిధ సంస్కరణలతో 19.79 కోట్ల మందికి ప్రత్యక్ష ఉపాధి... 31.61 కోట్ల మందికి ప్రభుత్వ పథకాల ద్వారా రుణ సదుపాయంతో పరోక్ష ఉపాధి లభించిందని ఈ నివేదిక పేర్కొంది. ఇందుకు సంబంధించిన కథనాన్ని 'తెలంగాణ బీజేపీ' ఎక్స్ (ట్విట్టర్) హ్యాండిల్ ట్వీట్ చేసింది.

2014 నుంచి ప్రతి ఏడాది... అంటే మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత సగటున ఏడాదికి కనీసం 5.140 కోట్ల మంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందినట్లు పేర్కొంది. ప్రభుత్వ సూక్ష్మ రుణాలు ఉపాధి అవకాశాలకు ఉపయోగపడుతున్నట్లు తెలిపింది.

ఎంజీఎన్ఆర్ఈజీఎస్, పీఎంజీఎస్‌వై, పీఎంఏవై-జీ, పీఎంఏవై-యూ, డీఏవై-ఎన్‌యూఎల్ఎం, ఆర్ఎస్ఈటీఐ, ఏబీఆర్‌వై, పీఎంఈజీపీ, ఎస్‌బీఎం-జీ, పీఎల్ఐ, పీఎం స్వనిధి వంటి 12 కేంద్ర పథకాలను కూడా ఈ నివేదిక రూపకల్పనలో పరిగణనలోకి తీసుకున్నట్లు తెలిపింది.

  • Loading...

More Telugu News