పాపాలను హరించే సాలగ్రామ పూజ

సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే సాలగ్రామ రూపం ధరించాడని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. సాలగ్రామంపై వుండే చక్రాలను బట్టి వాటిని వివిధ పేర్లతో పిలుస్తుంటారు. సాలగ్రామాన్ని పూజించడం వలన శివకేశవులను ఆరాధించిన ఫలితం దక్కుతుందని అంటారు. సాధారణంగా సాలగ్రామాలు పూజా మందిరాల్లో ఎక్కువగా కనిపించవు. వాటిని పూజించడంలోని నియమాలే అందుకు కారణం.

సాలగ్రామాలను పంచామృతాలతో అభిషేకించవలసి వుంటుంది .. నిత్య ధూప దీప నైవేద్యాలు సమర్పించవలసి ఉంటుంది. ఈ కారణంగానే పూజా మందిరాల్లో తక్కువగాను .. దేవాలయాల్లో ఎక్కువగాను సాలగ్రామాలు కనిపిస్తూ ఉంటాయి. సాలగ్రామాలు గల ప్రదేశంలో చేసే జపాలు .. దానాలు అనేక రెట్ల ఫలితాన్ని ఇస్తాయనేది మహర్షుల మాట. సాలగ్రామాలను పూజించడం వలన సమస్త పాపాలు .. దోషాలు నశిస్తాయి .. సకల శుభాలు కలుగుతాయి.       


More Bhakti News