వైశాఖ పౌర్ణమి ప్రత్యేకత

ఏ మాసంలోనైనా పౌర్ణమి ప్రత్యేకతను సంతరించుకుని కనిపిస్తుంది. వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమి మరింత విశేషమైనదని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమిని 'మహా వైశాఖి' అని అంటారు. ఈ రోజున నదులలో పుణ్య స్నానాలు చేయాలని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఈ విధంగా చేయడం వలన సమస్త పాపాలు .. దోషాలు .. తొలగిపోతాయని అంటున్నాయి.

శ్రీమహా విష్ణువు .. దశావతారాలలో రెండవ అవతారమైన కూర్మావతారాన్ని ధరించినది ఈ రోజునే. లోక కల్యాణం కోసం స్వామివారు కూర్మావతారాన్ని ధరించిన ఈ రోజుని 'కూర్మ జయంతి'గా జరుపుతుంటారు. ఈ పౌర్ణమి రోజున శ్రీమహా విష్ణువును తులసి దళాలతో పూజించడం వలన, జన్మజన్మాలుగా వెంటవస్తోన్న పాపాలు నశించి .. ముందు జన్మలకి అవసరమైన పుణ్య ఫలాలు లభిస్తాయని ఆధ్యాత్మిక గ్రంధాలు స్పష్టం చేస్తున్నాయి. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆరాధనలో తరించిన శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులవారు జన్మించింది కూడా ఈ రోజునే కావడం విశేషం. 


More Bhakti News