కేతువును శాంతింపజేసే మార్గం !

కేతువు ప్రతికూల ఫలితాలను ఇస్తున్నప్పుడు ఆ జాతకులు నానాఇబ్బందులు పడవలసి వస్తుంది. కేతుగ్రహ దోషం కారణంగా అభివృద్ధి కుంటుపడుతుంది. అప్పటివరకూ ముందుకువెళుతోన్న రంగంలోనే వెనుకపడిపోవడం జరుగుతుంది. దాంతో తీవ్రమైన నిరాశా నిస్పృహలకు లోనవుతుంటారు.

కేతువు ప్రతికూల ప్రభావం వలన ఊహించని విధంగా ఎదురయ్యే సమస్యలు ... అనుకోని అవమానాలు మానసికంగా కుంగదీస్తాయి. బాధలను మరచిపోవడానికంటూ వ్యసనాలకు బానిసకావడం జరుగుతుంది. ఫలితంగా అనారోగ్యానికి గురై మరిన్ని బాధలను అనుభవించవలసి వస్తుంది. కేతుగ్రహ దోషం కారణంగా ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుందో తెలుసుకున్నవాళ్లు, ఆ దోష నివారణకు అవసరమైన ప్రయత్నాలు చేస్తుంటారు.

కేతువు చూపే ప్రతికూల ఫలితాల నుంచి బయటపడటానికి వివిధరకాల మార్గాలు చెప్పబడుతున్నాయి. వాటిలో 'గోదానం' ఒకటిగా కనిపిస్తుంది. కేతుగ్రహ దోష ప్రభావంతో ఇబ్బందులు పడుతున్నవాళ్లు 'కపిలగోవు' ను దానం చేయడం వలన ఆయన శాంతించి అనుగ్రహిస్తాడని చెప్పబడుతోంది. ఫలితంగా కేతుగ్రహ సంబంధమైన దోష ప్రభావం తొలగిపోతుందని స్పష్టం చేయబడుతోంది.


More Bhakti News