పంచాంగములో నక్షత్ర యోగ కరణములు

పంచాంగము అంటే అయుదు అంగములు అని అర్థం. తిథి .. వారము .. నక్షత్రం .. యోగము .. కరణము అనేవి అయిదు అంగములుగా చెప్పబడుతున్నాయి. సాధారణంగా తిథి .. వారములు చాలామందికి తెలిసి ఉంటాయి. కానీ నక్షత్రములు .. యోగములు ... కరణములు గురించి తెలిసిన వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. పంచాంగమును అనుసరించి నక్షత్రములు 27 గా ... యోగములు 27 గా ... కరణములు 11 గా చెప్పబడుతున్నాయి.

ఈ నేపథ్యంలో అశ్విని .. భరణి .. కృత్తిక .. రోహిణి .. మృగశిర .. ఆర్థ్ర .. పునర్వసు .. పుష్యమి .. ఆశ్లేష .. మఖ .. పుబ్బ .. ఉత్తర .. హస్త .. చిత్త .. స్వాతి .. విశాఖ .. అనూరాధ .. జ్యేష్ఠ .. మూల .. పూర్వాషాఢ .. ఉత్తరాషాఢ .. శ్రవణం .. ధనిష్ఠ .. శతభిషం .. పూర్వాభాద్ర .. ఉత్తరాభాద్ర .. రేవతి అనే నక్షత్రాలు ప్రధానమైన పాత్రను పోషిస్తుంటాయి.

విష్కంభం .. ప్రీతీ .. ఆయుష్మాత్ .. సౌభాగ్య .. శోభన .. అతిగండ .. సుకర్మ .. ధృతి .. శూల .. గండ .. వృద్ధి .. ధృవ .. వ్యఘాత .. హర్షణ .. వజ్ర .. సిద్ధి .. వ్యతిపాత .. వరీయన్ .. పరీఘ .. శివ .. సిద్ధ .. సాధ్య .. శుభ .. శుక్ల .. బ్రహ్మ .. ఐంద్ర .. వైధృతి అనేవి యోగముల జాబితాలో కనిపిస్తాయి. ఇక కరణముల జాబితాలో బవ .. బాలవ .. కౌలవ .. తైతుల .. గరజి .. వనిజ .. భద్ర .. శకుని .. చతుష్పాత్ .. నాగవం .. కింతుఘ్నమ్ అనేవి దర్శనమిస్తాయి.


More Bhakti News