అమెరికాలో వలసలపై ట్రంప్ సర్కార్ ఉక్కుపాదం.. 3 లక్షలకు పైగా వీసాల రద్దు!
- వీటిలో 4,000 వీసాలు బెర్త్ టూరిజంకు సంబంధించినవని వెల్లడి
- నేర కార్యకలాపాలు, మోసాలే వీసాల రద్దుకు ప్రధాన కారణాలు
- గత ప్రభుత్వాలతో పోలిస్తే వేగంగా వీసాలను రద్దు చేస్తున్న ట్రంప్ సర్కార్
- ప్రభుత్వ చర్యలపై మానవ హక్కుల సంఘాల ఆందోళన
అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం వీసాల రద్దుపై కొరడా ఝుళిపిస్తోంది. 2025 జనవరిలో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఇప్పటివరకు 3 లక్షలకు పైగా వీసాలను రద్దు చేసినట్లు అమెరికా విదేశాంగ శాఖ తాజాగా ఓ ప్రకటనలో వెల్లడించింది. నేర కార్యకలాపాలకు పాల్పడటం, ప్రజా భద్రతకు ముప్పు కలిగించడం, మోసపూరిత చర్యల ద్వారా ఇమ్మిగ్రేషన్ నిబంధనలను ఉల్లంఘించడం వంటి కారణాలతో ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.
రద్దు చేసిన వీసాలలో సుమారు 4,000 వీసాలు 'బెర్త్ టూరిజం'కు సంబంధించినవి కావడం గమనార్హం. కేవలం అమెరికాలో బిడ్డకు జన్మనిచ్చి, తద్వారా ఆ శిశువుకు పుట్టుకతోనే అమెరికా పౌరసత్వం సంపాదించే లక్ష్యంతో ప్రయాణించడాన్ని బెర్త్ టూరిజంగా పరిగణిస్తారు. ఇలాంటి కార్యకలాపాలను ప్రోత్సహించే లేదా పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ అంశంపై దృష్టి సారించేందుకు ప్రత్యేకంగా ఒక టాస్క్ ఫోర్స్‌ను కూడా ఏర్పాటు చేసింది.
విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ పిగాట్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలతో పోలిస్తే ట్రంప్ పరిపాలనలో వీసాల రద్దు ప్రక్రియ చాలా వేగంగా జరుగుతోందని తెలిపారు. చట్టాన్ని ఉల్లంఘించే, మోసాలకు పాల్పడే, లేదా దేశ భద్రతకు భంగం కలిగించే వీసాదారుల పట్ల తమ ప్రభుత్వం 'జీరో టాలరెన్స్' విధానాన్ని అనుసరిస్తోందని ఆయన స్పష్టం చేశారు.
వీసాల రద్దు సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. 2026 ఆగస్టు నాటికి 1,75,000 వీసాలు రద్దు కాగా, సెప్టెంబర్ చివరి నాటికి ఆ సంఖ్య 2,50,000కి చేరింది. అప్పటికి బెర్త్ టూరిజంతో సంబంధం ఉన్న కేసులు 2,300 ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్య 4,000 దాటింది.
2026లో ఈ రద్దు ప్రక్రియ మరింత వేగవంతమైంది. అయితే, వీసాలు రద్దయిన వారి జాతీయతకు సంబంధించిన వివరాలను అధికారులు వెల్లడించలేదు. మరోవైపు ట్రంప్ ప్రభుత్వ కఠినమైన ఇమ్మిగ్రేషన్ విధానాలపై, ముఖ్యంగా వీసాల రద్దు ప్రక్రియలో సరైన నిబంధనలు పాటించడం లేదని మానవ హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.