4 కాళ్లు, 4 చేతులు.. మధ్యప్రదేశ్‌లో వింత శిశువు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

4 కాళ్లు, 4 చేతులు.. మధ్యప్రదేశ్‌లో వింత శిశువు

Rare incident in Madhya Pradesh baby born with 4 legs and 4 arms
  • ఛాతీ భాగంలో అతుక్కుని ఉన్న అదనపు అవయవాలు
  • జన్యుపరమైన సమస్యే కారణమని వైద్యుల ప్రాథమిక అంచనా
  • శస్త్రచికిత్స కోసం ప్రత్యేక వైద్య పరీక్షలకు ఏర్పాట్లు
  • మెరుగైన చికిత్స నిమిత్తం జబల్‌పూర్‌కు ఎయిర్ అంబులెన్స్‌లో తరలింపు
మధ్యప్రదేశ్‌లో ఒక అరుదైన వైద్య పరిణామం చోటుచేసుకుంది. లవ్‌కుష్‌నగర్‌లో ఓ మగ శిశువు నాలుగు కాళ్లు, నాలుగు చేతులతో జన్మించాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు ఆ శిశువును చూసేందుకు భారీగా తరలివచ్చారు. వైద్యుల ప్రాథమిక సమాచారం ప్రకారం, శిశువు ఛాతీ భాగం నుండి ఈ అదనపు అవయవాలు పెరిగినట్లు గుర్తించారు.

ఈ అసాధారణ పరిస్థితికి జన్యుపరమైన లోపాలు కారణం కావొచ్చని వైద్యులు ప్రాథమికంగా భావిస్తున్నారు. అదనంగా ఉన్న కాళ్లు, చేతులను శస్త్రచికిత్స ద్వారా తొలగించే అవకాశాలను వారు పరిశీలిస్తున్నారు. అయితే, సర్జరీకి ముందు ఆ అవయవాల్లోని రక్త ప్రసరణ వ్యవస్థ, ఎముకల అనుసంధానం వంటి కీలక అంశాలను నిర్ధారించుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ఇందుకోసం శిశువుకు ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు.

ఈ పరీక్షల నివేదికలు వచ్చిన తర్వాతే శస్త్రచికిత్సపై తుది నిర్ణయం తీసుకుంటామని వైద్యులు స్పష్టం చేశారు. ఇదిలావుండగా, శిశువుకు మెరుగైన వైద్యం అందించేందుకు అధికారులు తక్షణమే స్పందించారు. బాలుడిని ఎయిర్ అంబులెన్స్ ద్వారా జబల్‌పూర్‌లోని ప్రత్యేక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం నిపుణులైన వైద్యుల బృందం శిశువు ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోంది.
Advertisement
Baby with 4 legs and 4 arms
Madhya Pradesh
Lavkushnagar
Rare birth medical case
Jabalpur hospital

More Telugu News