బండి సంజయ్ రాజీనామా చేయాలనడం సరికాదు: కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి

Congress MP Mallu Ravi opposes calls for Bandi Sanjay resignation
  • బండి సంజయ్‌ని పదవి నుంచి దించాలని సొంత పార్టీ ఎంపీలే ప్రయత్నిస్తున్నారని విమర్శ
  • అది మంచి పద్ధతి కాదన్న మల్లు రవి
  • కవిత జైలుకు వెళ్ళినప్పుడు కేసీఆర్, కేటీఆర్ రాజీనామా చేశారా అని నిలదీత
బండి సంజయ్‌ని కేంద్రమంత్రి పదవి నుంచి దించాలని, రాజీనామా చేయించాలని సొంత పార్టీ ఎంపీలే ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ మల్లు రవి అన్నారు. కానీ అది మంచి పద్ధతి కాదని అన్నారు. ఆయనను పదవిలో నుంచి దించేస్తే తాము వస్తామని కొందరు భావిస్తున్నారని ఆరోపించారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కుమారుడు బండి భగీరథ్ తప్పు చేస్తే బండి సంజయ్ మంత్రి పదవికి రాజీనామా చేయాలనడం సరికాదని అన్నారు.

బండి సంజయ్ తన కుమారుడిని దాచిపెట్టకుండా చట్టానికి లొంగిపోయేలా చేసి బాధ్యతాయుతంగా వ్యవహరించారని కితాబిచ్చారు. మద్యం పాలసీ కేసులో కవిత జైలుకు వెళ్ళినప్పుడు కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు రాజీనామా చేశారా అని ప్రశ్నించారు. ఇలాంటి అంశాల్లో పార్టీలకు అతీతంగా వ్యవహరించాలని సూచించారు. పిల్లలు అన్నాక తప్పు చేస్తారని, కానీ దానిని రాజకీయం చేయడం సరికాదని అన్నారు. బండి సంజయ్ తన కుమారుడిని దాచిపెట్టకుండా సరెండర్ చేశారని గుర్తు చేశారు.
Go Back to Shorts
Bandi Sanjay
Bandi Sanjay son
Bandi Bhagirath
Mallu Ravi
Telangana Congress
BRS
Kavitha

More Telugu News