సీఎస్కే బ్యాటర్లకు కళ్లెం వేసిన సన్ రైజర్స్ బౌలర్లు.. ఆకట్టుకున్న కమిన్స్
- సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు 181 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన చెన్నై
- 44 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచిన డెవాల్డ్ బ్రెవిస్
- మూడు కీలక వికెట్లు పడగొట్టిన హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్
- నిదానంగా ఆడి నిరాశపరిచిన సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్
- కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఆకట్టుకున్న సన్‌రైజర్స్ బౌలర్లు
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఓ మోస్తరు స్కోరుకే పరిమితమైంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై, నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. హైదరాబాద్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి చెన్నైని భారీ స్కోరు చేయకుండా నిలువరించారు. చెన్నై బ్యాటర్లలో డెవాల్డ్ బ్రెవిస్ (44) టాప్ స్కోరర్‌గా నిలవగా, హైదరాబాద్ బౌలర్లలో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మూడు కీలక వికెట్లతో ఆకట్టుకున్నాడు.
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన చెన్నైకి ఓపెనర్లు మంచి ఆరంభాన్ని ఇవ్వలేకపోయారు. సంజూ శాంసన్ (13 బంతుల్లో 27) మెరుపులు మెరిపించినా, కమిన్స్ బౌలింగ్‌లో ఇషాన్ కిషన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత ఉర్విల్ పటేల్ (13) కూడా త్వరగానే ఔటయ్యాడు. అయితే, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మరోసారి నెమ్మదిగా ఆడి నిరాశపరిచాడు. 21 బంతులు ఎదుర్కొని కేవలం 15 పరుగులు మాత్రమే చేసి కమిన్స్ బౌలింగ్‌లోనే ఔటయ్యాడు. దీంతో చెన్నై 11.3 ఓవర్లలో 100 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఈ దశలో కార్తీక్ శర్మ (19 బంతుల్లో 32), డెవాల్డ్ బ్రెవిస్ (27 బంతుల్లో 44), శివమ్ దూబే (23 బంతుల్లో 26) బాధ్యతాయుతంగా ఆడారు. ముఖ్యంగా బ్రెవిస్, దూబే ఐదో వికెట్‌కు 59 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పి జట్టు స్కోరును పరుగులెత్తించారు. బ్రెవిస్ తన ఇన్నింగ్స్‌లో 2 ఫోర్లు, 4 భారీ సిక్సర్లతో అలరించాడు. చివరి ఓవర్లలో హైదరాబాద్ బౌలర్లు పుంజుకోవడంతో చెన్నై ఆశించిన స్థాయిలో స్కోరు నమోదు చేయలేకపోయింది.
సన్‌రైజర్స్ బౌలర్లలో కెప్టెన్ ప్యాట్ కమిన్స్ తన అద్భుతమైన బౌలింగ్‌తో చెన్నై బ్యాటింగ్ లైనప్‌ను దెబ్బతీశాడు. 4 ఓవర్లలో కేవలం 28 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. అతనికి తోడుగా సాకిబ్ హుస్సేన్ 2 వికెట్లు తీయగా, ఎషాన్ మలింగ, ప్రఫుల్ హింగే తలో వికెట్ దక్కించుకున్నారు. నితీష్ కుమార్ రెడ్డి రెండు ఓవర్లలో 35 పరుగులు ఇచ్చాడు.