భారత్‌లో కొత్త ఆఫీసు తెరిచిన 'అడోబ్'
- నోయిడాలో కొత్త కార్యాలయాన్ని ప్రారంభించిన అడోబ్
- అడోబ్ కు భారత్‌లో ఇది ఏడో ఆఫీస్, యూపీలో మూడోది
- ఏఐ ఆధారిత ఆవిష్కరణలపై దృష్టి సారించినట్లు కంపెనీ వెల్లడి
- భారత్‌లో 8,000 మందికి పైగా ఉద్యోగులున్న అడోబ్
- యూఎస్ తర్వాత అత్యధిక ఉద్యోగులు భారత్‌లోనే
ప్రముఖ అమెరికన్ సాఫ్ట్వేర్ సంస్థ అడోబ్ భారత్‌లో తన కార్యకలాపాలను మరింత విస్తరించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత ఆవిష్కరణలపై దృష్టి సారిస్తున్న ఈ టెక్ దిగ్గజం, ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో శుక్రవారం కొత్త కార్యాలయాన్ని ప్రారంభించింది.
నోయిడా సెక్టార్ 129లో ఏర్పాటు చేసిన ఈ కొత్త ఆఫీసు, భారత్‌లో అడోబ్‌కు ఏడో కార్యాలయం కాగా, ఉత్తరప్రదేశ్‌లో మూడోది. ప్రస్తుతం ఈ క్యాంపస్‌లో ఇంజినీరింగ్, కస్టమర్ విభాగాలకు చెందిన 700 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
"ఏఐ టెక్నాలజీ ప్రపంచాన్ని మారుస్తున్న ఈ తరుణంలో, ఆవిష్కరణలను పునర్నిర్వచించడంలో అడోబ్ ముందుంది. భారత్ నుంచి ఆవిష్కరణలను ప్రోత్సహించాలన్న మా లక్ష్యంలో ఈ కొత్త ఆఫీస్ ప్రారంభం ఒక ముఖ్యమైన మైలురాయి" అని అడోబ్ ఇండియా కంట్రీ మేనేజర్ అభిగ్యాన్ మోదీ తెలిపారు. మారుతున్న టెక్నాలజీ రంగంలో ఉద్యోగులు మరింత సమర్థవంతంగా కలిసి పనిచేసేందుకు ఈ కార్యాలయం దోహదపడుతుందని అడోబ్ ఇండియా ఎంప్లాయీ ఎక్స్పీరియన్స్ హెడ్ స్వాతి రుస్తాగీ అన్నారు.
1997లో భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించిన అడోబ్‌కు, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 8,000 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. అమెరికా తర్వాత అత్యధిక ఉద్యోగులున్న దేశం భారత్ కావడం విశేషం. కంపెనీ గ్లోబల్ ఇన్నొవేషన్‌లో మూడింట ఒక వంతు వాటా భారత్ నుంచే వస్తోంది. ఈ కొత్త క్యాంపస్ పర్యావరణహితంగా నిర్మితమైందని, దీనికి ఐజీబీసీ ప్లాటినం సర్టిఫికేషన్ ఉందని కంపెనీ పేర్కొంది. అంతేకాకుండా, ఏఐ నైపుణ్యాలను పెంపొందించే లక్ష్యంతో ఫైర్‌ఫ్లై, ఫొటోషాప్ వంటి టూల్స్‌ను విద్యార్థులకు ఉచితంగా అందిస్తున్నట్లు అడోబ్ ఈ ఏడాది ప్రారంభంలో ప్రకటించింది.