రీల్ కోసం స్టంట్... తలపై ఇరుక్కుపోయిన పాల డబ్బా.. వీడియో ఇదిగో!

Rajasthan youths reel stunt backfires head stuck in milk container
  • సోషల్ మీడియా రీల్ కోసం యువకుడి వింత విన్యాసం
  • తలపై పెట్టుకున్న పాల డబ్బా ఇరుక్కుపోవడంతో అవస్థలు
  • స్థానికుల సహాయంతో హార్డ్‌వేర్ షాపుకు తరలింపు
  • గ్రైండర్‌తో డబ్బాను కట్ చేసి యువకుడిని కాపాడిన గ్రామస్థులు
  • వైరల్ అవుతున్న రెస్క్యూ వీడియో
రాజస్థాన్‌లో ఓ యువకుడికి సోషల్ మీడియా రీల్ సరదా ప్రాణాల మీదకు తెచ్చింది. సరదా కోసం చేసిన ఓ విన్యాసం వికటించడంతో అతడి తల ఓ స్టీల్ పాల డబ్బాలో ఇరుక్కుపోయింది. గంటల తరబడి నరకయాతన అనుభవించిన అతడిని గ్రామస్థులు అతి కష్టం మీద కాపాడారు. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అల్వార్ జిల్లా అక్బర్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మధోగఢ్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. కాలూరామ్ అనే యువకుడు గోధుమలు అమ్మేందుకు బైక్‌పై వెళ్తున్నాడు. ఎండ వేడి నుంచి తప్పించుకోవడానికి, అదే సమయంలో ఓ రీల్ చిత్రీకరించడానికి తన వెంట ఉన్న 15 లీటర్ల పాల డబ్బాను తలపై పెట్టుకున్నాడు. కానీ, ఊహించని విధంగా అది తలకు బిగుసుకుపోయి బయటకు రాలేదు.

ఎంత ప్రయత్నించినా డబ్బా రాకపోవడంతో కాలూరామ్ కేకలు వేశాడు. దీంతో గ్రామస్థులు అక్కడికి చేరుకున్నారు. దాదాపు 10 కిలోల బరువున్న ఆ డబ్బాను తీయడం ఎవరివల్లా కాలేదు. దీంతో అతడిని దగ్గరలోని ఓ హార్డ్‌వేర్ షాపునకు తీసుకెళ్లి, గ్రైండర్ మెషిన్‌తో డబ్బాను జాగ్రత్తగా కట్ చేయడం ప్రారంభించారు. గ్రైండర్‌తో కట్ చేసేటప్పుడు ఏ చిన్న పొరపాటు జరిగినా యువకుడికి ప్రమాదమని అందరూ ఆందోళన చెందారు.

చివరకు సురక్షితంగా డబ్బాను తొలగించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ రెస్క్యూ ఆపరేషన్‌ను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, అది ఇప్పుడు వైరల్‌గా మారింది. 
Go Back to Shorts
Kalooram
Rajasthan youth
social media reel
milk container
stuck head
viral video
rescue operation
Alwar district
Madhogarh village

More Telugu News