గురుగ్రామ్‌లో యువకుడి అనుమానాస్పద మృతి.. శృంగార సామర్థ్యపు మందులే కారణమని అనుమానం!
- సెక్స్ సామర్థ్యం పెంచే మందుల ఓవర్‌డోస్‌తో చనిపోయి ఉండవచ్చని అనుమానం
- గదిలో మందుల ప్యాకెట్లు, హెల్త్ సప్లిమెంట్స్ స్వాధీనం చేసుకున్న పోలీసులు
- కాబోయే భార్యను కలవడానికి ముందే ఈ ఘోరం జరిగిందని వెల్లడి
గురుగ్రామ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శృంగార సామర్థ్యాన్ని పెంచుకునేందుకు వాడే మందులను అధిక మోతాదులో తీసుకోవడం వల్ల ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సెక్టార్ 53 ప్రాంతంలో అద్దెకు ఉంటున్న పీజీ ఫ్లాట్‌లో 29 ఏళ్ల యువకుడు విగతజీవిగా కనిపించడం కలకలం రేపింది. అతని గదిలో కొన్ని మందుల ప్యాకెట్లు, హెల్త్ సప్లిమెంట్స్ లభించాయని పోలీసులు వెల్లడించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మృతుడిని నాగ్‌పూర్‌కు చెందిన రోహిత్ లాల్‌గా గుర్తించారు. అతను న్యూఢిల్లీలోని క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కార్యాలయంలో పనిచేస్తూ, గురుగ్రామ్‌లో నివసిస్తున్నాడు. గురువారం ఉదయం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. రోహిత్‌తో కలిసి రోజూ ఆఫీసుకు వెళ్లే అతని సహోద్యోగి, ఆ రోజు రోహిత్ ఫోన్‌కు సమాధానం ఇవ్వకపోవడం, గది తలుపు తీయకపోవడంతో అనుమానంతో పోలీసులకు సమాచారం అందించాడు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, గది తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లారు. అక్కడ రోహిత్ మంచంపై అప్పటికే మృతి చెంది ఉన్నాడు. గదిని పరిశీలించగా, కొన్ని మందుల ప్యాకెట్ల ఖాళీ కవర్లు కనిపించాయని పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.
ప్రాథమిక విచారణలో ఓ ఆసక్తికరమైన విషయం తెలిసింది. రోహిత్ తన కాబోయే భార్యను కలుసుకునేందుకు ఆహ్వానించాడని, అయితే ఆమె రాకముందే అతను మరణించాడని దర్యాప్తు అధికారి ఒకరు తెలిపారు. ఈ క్రమంలోనే అతను శృంగార సామర్థ్యాన్ని పెంచే మందులు తీసుకుని ఉండవచ్చని, ఓవర్‌డోస్ కారణంగా గుండెపోటు వచ్చి మరణించి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. "మేము స్వాధీనం చేసుకున్న మందులను, మృతుడి విస్రా శాంపిల్స్‌ను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి (ఎఫ్ఎస్ఎల్) పంపాము. విస్రా నివేదిక వచ్చిన తర్వాతే మరణానికి కచ్చితమైన కారణం తెలుస్తుంది. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం" అని సెక్టార్ 53 ఎస్‌హెచ్ఓ సతేందర్ రావల్ వివరించారు.