ధ్వంసమైన టెహ్రాన్ గాంధీ ఆసుపత్రి దృశ్యాలు రిలీజ్ చేసిన ఇరాన్.. వీడియో ఇదిగో!
అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ నేరాలకు పాల్పడుతున్నాయని, తమ దేశంలోని ఆసుపత్రులపై దాడులు చేస్తున్నాయని ఇరాన్ తీవ్ర విమర్శలు చేసింది. వైమానిక దాడుల్లో ధ్వంసమైన టెహ్రాన్ లోని గాంధీ ఆసుపత్రి భవనం దృశ్యాలను విడుదల చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అసహాయ స్థితిలో ఉన్న రోగులపై దాడులు చేయడం అమానుషమని మండిపడింది. అమెరికా, ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో దేశవ్యాప్తంగా మొత్తం 600 లకు పైగా వైద్య కేంద్రాలు ధ్వంసమయ్యాయని, పెద్ద సంఖ్యలో రోగులు, వైద్య సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని ఇరాన్ ఆరోపించింది.
ధ్వంసమైన ఆసుపత్రి భవనం, శిథిలమైన వార్డులు, నాశనమైన వైద్య పరికరాల దృశ్యాలను ఇరాన్ మీడియా ప్రపంచానికి విడుదల చేసింది. ఈ చర్యల వల్ల దేశంలో తీవ్రమైన మానవతా సంక్షోభం తలెత్తుతోందని ఆవేదన వ్యక్తం చేసింది. యుద్ధం పేరుతో సామాన్యులకు వైద్యం అందించే ఆసుపత్రులపై దాడులు చేయడం స్పష్టమైన యుద్ధ నేరమని ఐక్యరాజ్యసమితిలో ఇరాన్ ఆరోపించింది. అయితే, ఈ ఆరోపణలను అమెరికా ఖండించింది. ఇరాన్ తన క్షిపణి వ్యవస్థలను, సైనిక కార్యకలాపాలను ఆసుపత్రులు, పాఠశాలల కింద ఉన్న భూగర్భ బంకర్ల నుంచి నిర్వహిస్తోందని, అందుకే వాటిని లక్ష్యంగా చేసుకోవాల్సి వస్తోందని అమెరికా గతంలోనే ఆరోపించింది.