బీఆర్ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నా: కేటీఆర్‌తో భేటీ అనంతరం జీవన్ రెడ్డి
- బీఆర్ఎస్‌తో కలిసి పనిచేస్తే రాష్ట్ర భవిష్యత్తుకు పాటుపడవచ్చని వ్యాఖ్య
- శేషజీవితంలో కేసీఆర్‌తో కలిసి పనిచేసే అవకాశం వచ్చిందన్న జీవన్ రెడ్డి
- జీవన్ రెడ్డి నివాసానికి చేరుకుని పార్టీలోకి ఆహ్వానించిన కేటీఆర్
అంతకుముందు, జగిత్యాలలో జీవన్ రెడ్డిని బీర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలిశారు. హైదరాబాద్ నుంచి జగిత్యాలకు చేరుకున్న కేటీఆర్... జీవన్ రెడ్డితో ఆయన నివాసంలో గంటకు పైగా సమావేశమయ్యారు. ఈ సందర్బంగా శాలువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కేటీఆర్ వెంట ఎల్. రమణ, పాడి కౌశిక్ రెడ్డి, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ తదితరులు ఉన్నారు.