ఇరాన్‌లో పాలన మారింది... ఇక కలిసి పనిచేస్తాం: ట్రంప్

Trump Says Iran Regime Changed Ready for Cooperation
షార్ట్స్‌లో చూడండి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌లో అత్యంత ఫలవంతమైన రీతిలో పాలన మార్పు జరిగిందని, ఆ దేశంతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అయిన 'ట్రూత్ సోషల్' వేదికగా ఆయన ఈ మేరకు ఒక పోస్ట్ చేశారు.

ఇరాన్ ఇకపై యురేనియం శుద్ధి చేయదని ట్రంప్ తన పోస్టులో స్పష్టం చేశారు. భూమిలో లోతుగా పాతిపెట్టిన అణు ధూళిని తవ్వి తొలగించేందుకు ఇరాన్‌కు అమెరికా సహాయం చేస్తుందని తెలిపారు. ఇరాన్ ప్రస్తుతం అత్యంత కచ్చితమైన శాటిలైట్ నిఘాలో ఉందని, దాడి జరిగిన నాటి నుంచి అక్కడ ఏదీ మార్పు చెందలేదని పేర్కొన్నారు. తమ స్పేస్ ఫోర్స్ ఉపగ్రహాలు ఇరాన్ పై ఓ కన్నేసి ఉంచాయని వివరించారు. 

ఇరాన్‌తో టారిఫ్‌లు, ఆంక్షల ఉపశమనంపై తాము చర్చలు జరుపుతామని కూడా ట్రంప్ వెల్లడించారు. ఇరు దేశాల మధ్య ఉన్న 15 డిమాండ్లలో చాలా వాటికి ఇప్పటికే అంగీకారం కుదిరిందని ఆయన తన పోస్టులో వివరించారు. 
Go Back to Shorts
Donald Trump
Iran
US Iran relations
Uranium enrichment
Nuclear program
Sanctions relief
Truth Social
Space Force
Satellite surveillance
Middle East

More Telugu News