Tunguska: డ్రోన్లు, క్రూయిజ్ క్షిపణులను వేటాడే 'తుంగుస్కా'... రష్యాతో భారత్ కీలక ఒప్పందం
భారత సైనిక సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా రక్షణ మంత్రిత్వ శాఖ శుక్రవారం రెండు కీలక ఒప్పందాలను ఖరారు చేసింది. మొత్తం ₹858 కోట్ల విలువైన ఈ కాంట్రాక్టులపై రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ సమక్షంలో సంతకాలు జరిగాయి. ఈ ఒప్పందాల ద్వారా ఆర్మీకి అత్యాధునిక క్షిపణి వ్యవస్థలు, నేవీ విమానాలకు స్వదేశీ నిర్వహణ సేవలు అందనున్నాయి.
వివరాల్లోకి వెళితే, భారత సైన్యం కోసం రష్యాకు చెందిన 'జేఎస్‌సీ రోసోబోరోన్‌ఎక్స్‌పోర్ట్' సంస్థ నుంచి రూ.445 కోట్లతో తుంగుస్కా ఎయిర్ డిఫెన్స్ క్షిపణి వ్యవస్థలను కొనుగోలు చేయనున్నారు. విమానాలు, డ్రోన్లు, క్రూయిజ్ క్షిపణుల వంటి గగనతల ముప్పుల నుంచి దేశానికి బహుళస్థాయి రక్షణ కల్పించేందుకు ఈ వ్యవస్థలు ఉపయోగపడతాయి. ఈ ఒప్పందం ఇండో-రష్యా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని రక్షణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
రెండో ఒప్పందాన్ని బోయింగ్ ఇండియా డిఫెన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కుదుర్చుకున్నారు. దీని విలువ రూ.413 కోట్లు. భారత నౌకాదళానికి చెందిన పీ-8ఐ లాంగ్-రేంజ్ సముద్ర నిఘా విమానాల నిర్వహణ, మరమ్మతుల కోసం ఈ కాంట్రాక్ట్ కుదిరింది. 'బై ఇండియన్' కేటగిరీ కింద, 100 శాతం స్వదేశీ కంటెంట్‌తో ఈ ఒప్పందం కుదరడం విశేషం. ఇది 'ఆత్మనిర్భర్ భారత్', 'మేక్ ఇన్ ఇండియా' లక్ష్యాలకు అనుగుణంగా ఉందని ప్రభుత్వం పేర్కొంది.
'హిందూ మహాసముద్రానికి కాపలాదారు'గా పిలిచే పీ-8ఐ విమానాలు సముద్ర గస్తీ, జలాంతర్గాములను గుర్తించడంలో భారత నౌకాదళంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రస్తుతం 12 విమానాలు సేవలందిస్తుండగా, భవిష్యత్తులో మరో 6 విమానాలను సమకూర్చుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది.
ఏమిటీ తుంగుస్కా సిస్టమ్...?
ఆధునిక యుద్ధ తంత్రంలో పెరిగిపోతున్న డ్రోన్లు, తక్కువ ఎత్తులో ప్రయాణించే విమానాలు, హెలికాప్టర్లు, క్రూయిజ్ క్షిపణుల ముప్పును సమర్థంగా ఎదుర్కొనేందుకు తుంగుస్కా వ్యవస్థలు భారత సైన్యానికి అదనపు బలాన్ని చేకూర్చనున్నాయి. తుంగుస్కా అనేది ఒకే ప్లాట్‌ఫామ్‌పై క్షిపణులు, ఆటోకెనాన్లు (అత్యంత వేగంగా బుల్లెట్లను ప్రయోగించే భారీ తుపాకులు) రెండింటినీ కలిగిన ఒక హైబ్రిడ్ వ్యవస్థ. ఇది భూతల దళాలకు సమీప గగనతలంలో పటిష్టమైన రక్షణ కవచంగా పనిచేస్తుంది. ఈ కొత్త కొనుగోలుతో దేశంలోని బహుళస్థాయి వాయు రక్షణ నెట్‌వర్క్‌ను మరింత పటిష్టం చేయాలన్నది భారత ప్రభుత్వ వ్యూహాత్మక లక్ష్యం.
సోవియట్ యూనియన్ హయాంలో రూపుదిద్దుకున్న ఈ తుంగుస్కా వ్యవస్థలు అనేక ప్రత్యేకతలను కలిగి ఉన్నాయి. 1982లో పాతతరం 'షిల్కా' వ్యవస్థల స్థానంలో ఇవి సైన్యంలోకి ప్రవేశించాయి. ఈ వ్యవస్థలో 8 నుంచి 10 కిలోమీటర్ల పరిధి గల 9ఎం311 క్షిపణులు ఎనిమిది ఉంటాయి. వీటితో పాటు, సమీపంలోని లక్ష్యాల కోసం 4 కిలోమీటర్ల పరిధి కలిగిన రెండు 30 ఎంఎం ఆటోకెనాన్లు అమర్చి ఉంటాయి. ఈ కెనాన్లు నిమిషానికి 3,900 నుంచి 5,000 రౌండ్ల వరకు కాల్పులు జరపగలవు.
దీనికి అమర్చిన రాడార్ వ్యవస్థ 18 కిలోమీటర్ల దూరంలోని శత్రు లక్ష్యాలను గుర్తించి, 16 కిలోమీటర్ల దూరం నుంచే వాటిని ట్రాక్ చేయగలదు. నలుగురు సిబ్బందితో పనిచేసే ఈ వ్యవస్థ, ట్యాంకుల తరహా ట్రాక్డ్ ఛాసిస్‌పై గంటకు 65 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. రష్యా-జార్జియా, రష్యా-ఉక్రెయిన్ యుద్ధాల్లో ఈ వ్యవస్థలను విస్తృతంగా ఉపయోగించారు. కాలక్రమేణా తుంగుస్కా-ఎం, తుంగుస్కా-ఎం1 వంటి ఆధునిక వేరియంట్లు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం రష్యా సైన్యం దీని స్థానంలో మరింత అధునాతనమైన 'పాంట్‌సిర్-ఎస్' వ్యవస్థలను ప్రవేశపెడుతోంది.