Nara Lokesh: మంగళగిరిలో ఘనంగా రామాలయ పునఃప్రతిష్ఠ.. హాజరైన మంత్రి లోకేశ్‌

Nara Lokesh Attends Grand Ram Temple Reinstallation in Mangalagiri
షార్ట్స్‌లో చూడండి
రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ తన నియోజకవర్గమైన మంగళగిరిలో జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్నారు. పట్టణంలోని కొప్పురావుకాలనీలో నూతనంగా నిర్మించిన రామాలయంలో విగ్రహ పునఃప్రతిష్ఠ మహోత్సవం బుధవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి లోకేశ్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఆలయ ప్రాంగణానికి చేరుకున్న లోకేశ్‌కు ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక టీడీపీ నాయకులు, ప్రజలు సాదర స్వాగతం పలికారు. అనంతరం పండితుల వేదమంత్రోచ్చారణల నడుమ హనుమత్, లక్ష్మణ, సీతాసమేత రాముల వారి విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న లోకేశ్‌, స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పునర్ నిర్మాణానికి తనవంతుగా రూ. 5 లక్షల విరాళాన్ని ప్రకటించారు.

ఈ కార్యక్రమంలో పద్మశాలీ కార్పొరేషన్ ఛైర్మన్ నందం అబద్దయ్య, టీటీడీ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీ దేవి, ఏపీఎంఎస్‌ఐడీసీ ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, మంగళగిరి పట్టణ టీడీపీ అధ్యక్షుడు పడవల మహేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Go Back to Shorts
Nara Lokesh
Mangalagiri
Rama Temple
Temple Reinstallation
Andhra Pradesh
TDP
Donation
Koppuravukalani
Hindu Temple
Religious Ceremony

More Telugu News